30, అక్టోబర్ 2020, శుక్రవారం

Pradosa puja

Om  ప్రదోష పూజ


ప్రదోష స్తోత్రమ్


జయ దేవ జగన్నాథ జయ శఙ్కర శాశ్వత | 

జయ సర్వసురాధ్యక్ష జయ సర్వసురార్చిత ||౧|| 


జయ సర్వగుణాతీత జయ సర్వవరప్రద || 

జయ నిత్య నిరాధార జయ విశ్వమ్భరావ్యయ ||౨|| 


జయ విశ్వైకవన్ద్యేశ జయ నాగేన్ద్రభూషణ | 

జయ గౌరీపతే శమ్భో జయ చన్ద్రార్ధశేఖర ||౩|| 


జయ కోఠ్యర్కసఙ్కాశ జయానన్తగుణాశ్రయ | 

జయ భద్ర విరూపాక్ష జయాచిన్త్య నిరఞ్జన ||౪|| 


జయ నాథ  కృపాసిన్ధో జయ భక్తార్తిభఞ్జన | 

జయ దుస్తరసంసారసాగరోత్తారణ ప్రభో ||౫|| 


ప్రసీద మే మహాదేవ సంసారార్తస్య ఖిద్యతః | 

సర్వపాపక్షయం కృత్వా రక్ష మాం పరమేశ్వర ||౬|| 


మహాదారిద్ర్యమగ్నస్య మహాపాపహతస్య చ || 

మహాశోకనివిష్టస్య మహారోగాతురస్య చ ||౭|| 


ఋణభారపరీతస్య దహ్యమానస్య కర్మభిః || 

గ్రహైఃప్రపీడ్యమానస్య ప్రసీద మమ శఙ్కర ||౮|| 


దరిద్రః ప్రార్థయేద్దేవం ప్రదోషే గిరిజాపతిమ్ || 

అర్థాఢ్యో వాఽథ రాజా వా ప్రార్థయేద్దేవమీశ్వరమ్ ||౯|| 


దీర్ఘమాయుః సదారోగ్యం కోశవృద్ధిర్బలోన్నతిః || 

మమాస్తు నిత్యమానన్దః ప్రసాదాత్తవ శఙ్కర ||౧౦|| 


శత్రవః సంక్షయం యాన్తు ప్రసీదన్తు మమ ప్రజాః || 

నశ్యన్తు దస్యవో రాష్ట్రే జనాః సన్తు నిరాపదః ||౧౧|| 


దుర్భిక్షమారిసన్తాపాః శమం యాన్తు మహీతలే || 

సర్వసస్యసమృద్ధిశ్చ భూయాత్సుఖమయా దిశః ||౧౨|| 


ఏవమారాధయేద్దేవం పూజాన్తే గిరిజాపతిమ్ || 

బ్రాహ్మణాన్భోజయేత్ పశ్చాద్దక్షిణాభిశ్చ పూజయేత్ ||౧౩||


సర్వపాపక్షయకరీ సర్వరోగనివారణీ | 

శివపూజా మయాఽఽఖ్యాతా సర్వాభీష్టఫలప్రదా ||౧౪||


ఇతి ప్రదోషస్తోత్రం సమ్పూర్ణమ్ ||


అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ

2, ఏప్రిల్ 2020, గురువారం

*కరోనా వైరస్* - మన సహాయము 
ఆరాధ్య బంధువులకు నమస్కారములు 
ప్రస్తుతం దేశంలో కారోన వైరస్ సమస్య కారణంగా, దానిని నివారించుటకై దేశం అంతటా మన ప్రభుత్వం లోక్డౌన్
 ( Lockdown) ప్రకటించిన సందర్భంలో ఎంతోమంది బీదవారు భోజన వసతికై ఇబ్బంది పడుట మనం గమనించుచున్నాము.
ఈ సందర్భంగా  శ్రీ ముదిగొండ శంకరాధ్యమఠం, కవాడిగుడా సౌజన్యముతో మరియు శ్రీ S P  బద్రి గారు , శ్రీ ముదిగొండ వీరేశ్ గార్ల సహకారంతో  కొంత మంది పేదలకైనా ఆహారం అందజేయుటకు  dt. 02.04.2020 నుండి శ్రీ ముదిగొండ శంకరాధ్యమఠంలో ఏర్పాటు చేయదలిచినాము.
ఈ ప్రయత్నములో మాకు పోలీస్ వారు సంపూర్ణ సహకారం అందజేయుటయే కాక రేవు అనగా 02.04.2020 మొదటిరోజు ఈ అన్నదానం ప్రారంభం సందర్భంగా గాంధీనగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ (C.I)  విచ్చేసి తన వంతు సహకారాము అందించనున్నారు.
కాబట్టి మన ఆరాధ్య బందువులందరూ మాకు ధన మరియు వస్తు రూపేణా సహకరించవలిసిందిగా విన్నపం చేయుచున్నాము.
మీరు మీ బంధు మిత్రులు కూడా ఈ ప్రయత్నంలో సహకరించుటకై  కోరవలసిందిగా ప్రార్ధించుచున్నాము. వస్తు రూపేణా ఇవ్వదలిచినవారు శ్రీ ముదిగొండ శంకరాధ్య మఠం లో ఇవ్వగలరు.
ధన రూపేణా విరాళాలు ఈ క్రింది బ్యాంక్ అకౌంట్ లో జమ చెయ్యగలరు.
Mudigonda Shankararadhya mutt  Kavadiguda.
Bank name ;:
STATE BANK OF INDIA,
S.B A/C NO. : 
52026092486
Branch : Kavadiguda
IFSC CODE NO  : 
SBIN OO2O312.
ఇట్లు
ములుగు పవన కుమార్  --  9246358204
వివరములకు ఈ క్రింది వారిని సంప్రదించగలరు:
శ్రీ ములుగు హనుమంతరావు గారు
9849986614     ఫిట్ పర్సన్ ముదిగొండ శంకరారాధ్య మఠం,  కవాడిగూడ.

శ్రీ ముదిగొండ చంద్రశేఖర్ గారు    9849630790
ప్రధాన కారదర్శి, శ్రీ శైవ మహాపీఠం , నాగోల్
శ్రీ  M.V.M. రావు గారు9849010505
అధ్యక్షులు,  శ్రీ శైవ మహాపీఠం జంట నగరశాఖ.
శ్రీ S P బద్రి గారు +91 95023 59124
శ్రీ ముదిగొండ వీరేశ్ గారు  +91 92461 09664  
ఎందరో  మహానుభావులు ధన రూపేణ సహాయమందించారు 


ఆరాధ్య బంధువులకు నమస్కారములు...

అనుకున్న ప్రణాళిక ప్రకారం ఈరోజు శ్రీ ముదిగొండ శంకరాధ్యమఠంలో అన్నదానం కార్యక్రమం ప్రారంభించబడినది.

కరోనా వైరస్ భయంతో బయటికి వెళ్ళుటయే కష్టంగా ఉన్న ఈ సమయంలో మన కార్యవర్గ సభ్యులు ధైర్యం చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుట చాలా అభినందనీయం

శ్రీ శైవ మహాపీఠం కార్యవర్గ సభ్యుల బృందం కలసి సుమారు 300 ప్యాకెట్స్** బిసిబేళ్ల బాత్, రవ్వ కేసరి మరియు 100 ప్యాకెట్స్ పులిహోర తయారు చేయించినారు.
మ౹౹ 1 గం. లకు  సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి {C.I} సహకారంతో ఆహార ప్యాకెట్స్ తీసుకొని వెళ్ళి మూడు వందల మంది పేదలకు వితరణ చేయబడినది.

ఈ విధంగా మన ఆరాధ్య బృందం
ఈ కార్యక్రమము Lockdown ఉన్న అన్ని రోజులు  కొనసాగించగలరని ఆశిస్తూ వారికి మన సమాజం తరఫున ఆశీస్సులు, అభినందనలు తెలియజేయుచున్నాము.
తగిన ఆర్థిక వనరులను వారికి సమకూర్చుట మన సమాజ బాధ్యతగా భావించి మన సభ్యులందరూ వారికి విరాళములు అంద చేయవలసిందిగా కోరుతున్నాము

 సానుకూలమెపుడు సంకల్పబలమున్న/
మెచ్చు దేముడొకరి మేలు దలచ/
దిక్కులేనివార్కి దేముడే దిక్కగు/
శివపురీశ! దేవ! చిద్విలాస!/🙏

ఇట్లు
ములుగు హనుమంత రావు,
ఫిట్ పర్సన్
శ్రీ ముదిగొండ శంకరారాధ్యమఠం