పినాకి
శివుని ధనుస్సు పేరు'పినాక' . ప్రసిద్ధ పురాణంలో, అతను త్రిపుర అని పిలువబడే మాయాసురుని మూడు నగరాలను నాశనం చేయడానికి త్రిపురాంతకగా తన అవతారంలో ఈ విల్లును ఉపయోగించాడని నమ్ముతారు ., దీనికి అక్షరార్థంగా అర్థం, 'పినాక' విల్లు పట్టేవాడు.
నా స్వంత రచనలే కాక, ఆధ్యాత్మిక పురాణేతిహాసముల,రచనలు -సేకరించిన వ్యాసములలో కొన్ని నాకు నచ్చినవి ,మెచ్చినవి- ఏరి కోరి సేకరించి ఒక చోట పేర్చి వుంచాను
శివపురి శివుని ఆజ్ఞ అయినది - అవి అన్ని గ్రంథ రూపము నొందాయి . గ్రంథ శీర్షిక 'పినాకి 'కూడా ఆయన ప్రతిపాదనే .
చేయునది నేనైనను - చేయించెడు వాడు 'శివపురి శివుడే '
ముదిగొండ సేనాపతి
మహా మృత్యుంజయ మంత్రం:
ఓం నమః శివాయ ॐఈ మంత్రమే ఎందుకు మృత్యుంజయ మంత్రమైందీ ???
ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం /
ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్ //
అర్ధం :-
అందరికి శక్తిని ప్రసాదించే సుగంధభరితుడైన త్రినేత్రుడును (శివుడును) ఆరాదిస్తున్నాను. దోసపండు కాడ నుండి విడినట్లు మరణం పట్టు నుండి విడివడెదను గాక!
ఈ మంత్రమును ఎందుకు మృత్యుంజయ మంత్రమంటారు? అనేక వేల వేల మంత్రాలుండగా ఈ శివమంత్రమునే ఎందుకు మృత్యుంజయ మంత్రముగా చెప్తుంటారు? అసలు దోసపండుకు, మృత్యువుకు ఏమిటి సంబంధం ఏమిటి? . మృత్యువును జయించడమంటే శరీరం పతనం కాకుండా వేలాది సంవత్సరములు జీవించి ఉండడం కాదు పునర్జన్మ లేకపోవడం.అంటే ఇకముందు జననమరణాలు లేకపోవడం. అంటే ఈ జన్మలోనే ముక్తిని పొందడం. ఈ ముక్తి అనేది మరణం తర్వాత ప్రాప్తించేది కాదు, జీవించి వుండగానే పొందాల్సిన స్థితి. ఈ ముక్తస్థితిని పొందాలంటే జ్ఞాని కావాలి. ఆ జ్ఞానత్వమును ప్రాసాదించేదే ఈ మంత్రం. అది ఎలాగంటారా?
ముందుగా ఉర్వారుక అంటే దోసపండుని గమనించండి. సామాన్యముగా ఈ దోసపాదు నేలమీద ఉంటుంది. ఈ పాదుకు కాసిన దోసకాయ పండినప్పుడు తొడిమ నుండి అలవోకగా తనంతట తనే విడిపోతుంది. జ్ఞానత్వం పొందిన వ్యక్తి కూడా అంటే జ్ఞాని కూడా ఈ దోసపండు మాదిరిగానే అలవోకగా ప్రాపంచికత నుండి విడివడతాడు. అంటే మాయనుండి విడివడతాడు. పండిన దోసపండు తొడిమ నుండి విడిపోయి తొడిమతో సంబంధం లేకుండా తొడిమ చెంతన వున్నట్లే, జ్ఞాని కూడా ప్రాపంచిక బంధాలనబడే ఈ సంసారమనే మాయనుండి విడిపోయినను దేహ ప్రారబ్ధం తీరేంతవరకు సంసారమందే జీవన్ముక్తుడై వుంటాడు. (జీవన్ముక్తుడనగా ప్రాపంచిక ప్రపంచములో బంధాలు చెంతనే వున్నను, మాయ విడివడడంతో ఇవి ఏవీ అంటక అత్మానుభవాన్ని నిరంతరం ఆస్వాదిస్తూ వుండే వ్యక్తి) ముక్తస్థితిలో వుంటాడు. ఇక మరి ఈ మాయా ప్రపంచంలో జననమరణాలు లేనిస్థితిలో వుంటాడు. పునర్జన్మ లేదు అని అంటే మృత్యువును జయించడమే !!.
ఈసరికే మీకు అర్ధమై యుంటుంది, దోసపండుతో ఎందుకు పోల్చారోనన్నది. ఇక ఈ స్థితిని పొందడం ఎలాగో తెలియజెప్పేదే త్రినేత్రుని ఆరాధన. ఆ ఆరాధన ఎలాగుండాలంటే -
జ్ఞానస్థితికి ఎదగాలంటే గురువు అవసరం. మీకు తెలుసు కదా, ఆదిగురువు శివుడు అన్న విషయం. ముందుగా శివుని దివ్యరూపం పరిశీలించండి. అందులో వున్న ఆధ్యాత్మిక రహస్యాలను శోదించండి. శివుని రూపమును పరిశీలించిన పెద్దలు ఇలా చెప్తుంటారు -
పంచభూతాత్మకుడు :-
శివుడు ధరించే పులిచర్మం భూతత్త్వానికీ, తలపై గంగ జలతత్త్వానికీ, మూడవనేత్రం అగ్నితత్త్వానికీ, విభూతి వాయుతత్త్వానికీ, శబ్దబ్రహ్మ స్వరూపమైన డమరుకం ఆకాశతత్త్వానికీ చిహ్నాలు.
త్రయంబకుడు :-
శివుని మూడుకన్నులు కాలాలను (భూత,భవిష్యత్, వర్తమానాలు) సూచిస్తాయి. ఇక శివుని మూడవకన్ను జ్ఞానానికి చిహ్నం. ఆజ్ఞాచక్ర స్థానములో వుండే ఈ ప్రజ్ఞాచక్షువు జ్ఞానాన్ని సూచిస్తుంది. ఈ ప్రదేశమందే ఇడా పింగళ సుషుమ్నా నాడులు కలుస్తాయి. దీనినే త్రివేణి సంగమం అని అంటారు.
నామము :-
శివనామం లోని మూడుగీతలు జాగృతి, స్వప్న, సుషుప్తి అవస్థలకు, మధ్యబిందువును తురీయావస్థలకు చిహ్నం. అటులనే ఈ రేఖాత్రయంకు చాలా అర్ధాలు చెప్తుంటారు, ఈ జగత్తంతయూ త్రిగుణాత్మకమని, మధ్యలో బిందువు గుణాతీతుడవు కమ్మూ, అని సూచిస్తుందని అంటుంటారు. అటులనే శివవిష్ణ్యాది భేదం లేకుండా రేఖాత్రయం ద్వారా అంతా త్రిమూర్త్యాత్మకమని (బ్రహ్మ విష్ణు మహేశ్వరులు) మధ్యబిందువు ద్వారా మువ్వురూ ఒకటేనని తెలుసుకోమన్న సూచనుందని కొందరంటుంటారు.
విభూతిదారుడు :-
సృష్టి అంతయూ ఎప్పటికైనా నశించునదే. అంటే భస్మంగాక తప్పదు. నీవు నేను అనుకొనబడు ఈ దేహం కూడా ఎప్పటికైనా భస్మమగునని తెలుపుటయే భస్మధారణ ఉద్దేశ్యం.
త్రిశూలం :-
సత్వ రజో తమోగుణాలకు, ఇచ్ఛా క్రియా జ్ఞానశక్తులకు, మానసిక శారీరక, ఆధ్యాత్మికశక్తులకు, ఇడా పింగళ సుషుమ్నా నాడులకు ప్రతిరూపం.
నాగాభరణుడు :-
సర్పం ప్రాపంచిక విషయాలకు ప్రతీక. హానికరమైన సర్పంను తన ఆదీనంలో పెట్టుకోవడంలో మర్మం ఏమిటంటే, ప్రాపంచికంగా ఎంతో హానికరాలు అయిన కామ, క్రోద, లోభ, మోహ, మద, మాత్సర్యాలన్న విషయాలను జయించడం బహు కష్టం. అవి వీడిపోయేవి కావు, కావున వాటిని అదుపులో వుంచుకోవాలని సూచిస్తూ శివుడు నాగాభరణుడుడైనాడు. అటులనే మన దేహంలో ఉన్న వెన్నెముక పాములా, మెదడు పడగలా గోచరిస్తుంది కదా, ఇది కుండలినీ జాగృతిని సూచిస్తుందని చెప్తుంటారు.
శివున్ని బోళాశంకరుడు అంటారు. ఎందుకంటే, సులభంగా అనుగ్రహిస్తాడు. ఈ అనుగ్రహం కూడా రెండు విధాలు. సంసారబద్ధుడై భోగాలను ఆశిస్తూ ఆరాదించినవారికి వాటిని అనుగ్రహిస్తాడు. జననమరణ చక్రభ్రమణంలో పడిపోకుండా సంసారంనుండి విముక్తిని కోరేవారికి విముక్తుల్ని చేసి ముక్తిని ప్రాసాదిస్తాడు. పై మంత్రమును మామూలుగా చదివితే అకాలమృత్యువునుండి ప్రమాదాల నుండి రక్షణ లభిస్తుంది. అలా కాకుండా పారమార్ధిక సాధనగా గ్రహించి ఆరాదిస్తే ముక్తస్థితి లభిస్తుంది. అందుకే శివున్ని లయకారుడు అంటారు. లయకారుడు అంటే లీనం చేసుకోవడం లేదా తనలో కలుపుకోవడం.
శివుణ్ణి ఆరాధించడమంటే శివుని పటంను అలకరించి కాసేపు పూజించడం కాదు. శివుని దివ్యరూపం వ్యక్తపరుస్తున్న ఈ ఆధ్యాత్మిక అంతరార్ధములను అవగాహన చేసుకొని ఆరాధించాలి. ఆ ఆరాధనా కూడా ఏ రీతిలో వుండాలో శివరూమే తెలుపుతుంది. సాధారణంగా శివుడు ధ్యానంలో ఆసీనుడైనట్లు దర్శనమిస్తుంటాడు. ఆ రూపం ద్వారా నిరంతరం బాహ్యప్రపంచమును కాంచే కనులను గట్టిగా కాకుండా అంటి అంటనట్లు మూసి వుంచి, దృష్టిని భ్రూమధ్యాన లగ్నం చేసి అంతర్ముఖులై సత్యంను దర్శించమన్న సూచనను గ్రహించి సాధన చేసినట్లయితే జీవుడు శివుడవుతాడు.
తన రూపం ద్వారా జ్ఞానబోధ చేస్తున్న శివమంత్రం ఎందుకు మృత్యుంజయ మంత్రమైందో ఇప్పుడు మీకు అర్ధమై వుంటుంది. మనం తరుచుగా వింటుంటాం, మనసెరిగి నడుచుకో, చిత్రాన్ని కాదు చిత్తాన్ని చూడు, శోధించిసాదించు అన్న మాటలను
దేవీభుజంగస్తోత్రం
శంకరభగవత్పాదులు ఈ స్తోత్రాన్ని భుజంగ ఛందస్సులో నిబద్ధం చేశారు. ఈ కారణం చేత ఈ స్తోత్రం ' దేవీ భుజంగస్తోత్రం' గా ప్రసిద్ధి పొందింది. ఎవరైతే శ్రీచక్రనివాసిని అయిన అమ్మను ఈ స్తోత్రంతో నిత్యమూ స్మరిస్తూ , పూజాదులు చేస్తూ ఉంటారో , అటువంటి వారు అమ్మ అనుగ్రహంతో పునరావృత్తి రహితమైన , జననమరణ ప్రవాహరూప సంసారాన్ని తరించి, మోక్షాన్ని పొందుతారు.
విరించ్యాదిభిః పంచభిర్లోకపాలైః సమూఢే మహానందపీఠే నిషణ్ణం . ధనుర్బాణపాశాంకుశప్రోతహస్తం మహస్త్రైపురం శంకరాద్వైతమవ్యాత్ .. 1..
యదన్నాదిభిః పంచభిః కోశజాలైః శిరఃపక్షపుచ్ఛాత్మకైరంతరంతః . నిగూఢే మహాయోగపీఠే నిషణ్ణం పురారేరథాంతఃపురం నౌమి నిత్యం .. 2..
విరించాదిరూపైః ప్రపంచే విహృత్య స్వతంత్రా యదా స్వాత్మవిశ్రాంతిరేషా . తదా మానమాతృప్రమేయాతిరిక్తం పరానందమీడే భవాని త్వదీయం .. 3..
వినోదాయ చైతన్యమేకం విభజ్య ద్విధా దేవి జీవః శివశ్రేతి నామ్నా . శివస్యాపి జీవత్వమాపాదయంతీ పునర్జీవమేనం శివం వా కరోషి .. 4..
సమాకుంచ్య మూలం హృది న్యస్య వాయుం మనో భ్రూబిలం ప్రాపయిత్వా నివృత్తాః . తతః సచ్చిదానందరూపే పదే తే భవంత్యంబ జీవాః శివత్వేన కేచిత్ .. 5..
శరీరేఽతికష్టే రిపౌ పుత్రవర్గే సదాభీతిమూలే కలత్రే ధనే వా . న కశ్చిద్విరజ్యత్యహో దేవి చిత్రం కథం త్వత్కటాక్షం వినా తత్త్వబోధః .. 6..
శరీరే ధనేఽపత్యవర్గే కలత్రే విరక్తస్య సద్దేశికాదిష్టబుద్ధేః . యదాకస్మికం జ్యోతిరానందరూపం సమాధౌ భవేత్తత్త్వమస్యంబ సత్యం .. 7..
మృషాన్యో మృషాన్యః పరో మిశ్రమేనం పరః ప్రాకృతం చాపరో బుద్ధిమాత్రం . ప్రపంచం మిమీతే మునీనాం గణోఽయం తదేతత్త్వమేవేతి న త్వాం జహీమః .. 8..
నివృత్తిః ప్రతిష్ఠా చ విద్యా చ శాంతి- స్తథా శాంత్యతీతేతి పంచీకృతాభిః . కలాభిః పరే పంచవింశాత్మికాభి- స్త్వమేకైవ సేవ్యా శివాభిన్నరూపా .. 9..
అగాధేఽత్ర సంసారపంకే నిమగ్నం కలత్రాదిభారేణ ఖిన్నం నితాంతం . మహామోహపాశౌఘబద్ధం చిరాన్మాం సముద్ధర్తుమంబ త్వమేకైవ శక్తా .. 10..
సమారభ్య మూలం గతో బ్రహ్మచక్రం భవద్దివ్యచక్రేశ్వరీధామభాజః . మహాసిద్ధిసంఘాతకల్పద్రుమాభా- నవాప్యాంబ నాదానుపాస్తే చ యోగీ .. 11..
గణేశైర్గ్రహైరంబ నక్షత్రపంక్త్యా తథా యోగినీరాశిపీఠైరభిన్నం . మహాకాలమాత్మానమామృశ్య లోకం విధత్సే కృతిం వా స్థితిం వా మహేశి .. 12..
లసత్తారహారామతిస్వచ్ఛచేలాం వహంతీం కరే పుస్తకం చాక్షమాలాం . శరచ్చంద్రకోటిప్రభాభాసురాం త్వాం సకృద్భావయన్భారతీవల్లభః స్యాత్ .. 13..
సముద్యత్సహస్రార్కబింబాభవక్త్రాం స్వభాసైవ సిందూరితాజాండకోటిం . ధనుర్బాణపాశాంకుశాంధారయంతీం స్మరంతః స్మరం వాపి సంమోహయేయుః .. 14..
మణిస్యూతతాటంకశోణాస్యబింబాం హరిత్పట్టవస్త్రాం త్వగుల్లాసిభూషాం . హృదా భావయంస్తప్తహేమప్రభాం త్వాం శ్రియో నాశయత్యంబ చాంచల్యభావం .. 15..
మహామంత్రరాజాంతబీజం పరాఖ్యం స్వతో న్యస్తబిందు స్వయం న్యస్తహార్దం . భవద్వక్త్రవక్షోజగుహ్యాభిధానం స్వరూపం సకృద్భావయేత్స త్వమేవ .. 16..
తథాన్యే వికల్పేషు నిర్విణ్ణచిత్తా- స్తదేకం సమాధాయ బిందుత్రయం తే . పరానందసంధానసింధౌ నిమగ్నాః పునర్గర్భరంధ్రం న పశ్యంతి ధీరాః .. 17..
త్వదున్మేషలీలానుబంధాధికారా-న్విరించ్యాదికాంస్త్వద్గుణాంభోధిబిందూన్ . భజంతస్తితీర్షంతి సంసారసింధుం శివే తావకీనా సుసంభావనేయం .. 18..
కదా వా భవత్పాదపోతేన తూర్ణం భవాంభోధిముక్తీర్య పూర్ణాంతరంగః . నిమజ్జంతమేనం దురాశావిషాబ్ధౌ సమాలోక్య లోకం కథం పర్యుదాస్సే .. 19..
దావా హృషీకాణి సామ్యం భజేయుః కదా వా న శత్రుర్న మిత్రం భవాని . కదా వా దురాశావిషూచీవిలోపః కదా వా మనో మే సమూలం వినశ్యేత్ .. 20..
నమోవాకమాశాస్మహే దేవి యుష్మ- త్పదాంభోజయుగ్మాయ తిగ్మాయ గౌరి . విరించ్యాదిభాస్వత్కిరీటప్రతోలీ- ప్రదీపాయమానప్రభాభాస్వరాయ .. 21..
కచే చంద్రరేఖం కుచే తారహారం కరే స్వాదుచాపం శరే షట్పదౌఘం . స్మరామి స్మరారేరభిప్రాయమేకం మదాఘూర్ణనేత్రం మదీయం నిధానం .. 22..
శరేష్వేవ నాసా ధనుష్వేవ జిహ్వా జపాపాటలే లోచనే తే స్వరూపే . త్వగేషా భవచ్చంద్రఖండే శ్రవో మే గుణే తే మనోవృత్తిరంబ త్వయి స్యాత్ .. 23..
జగత్కర్మధీరాన్వచోధూతకీరాన్ కుచన్యస్తహారాన్కృపాసింధుపూరాన్ భవాంభోధిపారాన్మహాపాపదూరాన్ భజే వేదసారాఞ్శివప్రేమదారాన్ .. 24..
సుధాసింధుసారే చిదానందనీరే సముత్ఫుల్లనీపే సురత్రాంతరీపే . మణివ్యూహసాలే స్థితే హైమశాలే మనోజారివామే నిషణ్ణం మనో మే .. 25..
దృగంతే విలోలా సుగంధీషుమాలా ప్రపంచేంద్రజాలా విపత్సింధుకూలా . మునిస్వాంతశాలా నమల్లోకపాలా హృది ప్రేమలోలామృతస్వాదులీలా .. 26..
జగజ్జాలమేతత్త్వయైవాంబ సృష్టం త్వమేవాద్య యాసీంద్రియైరర్థజాలం . త్వవేకైవ కర్త్రీ త్వమేకైవ భోక్త్రీ న మే పుణ్యపాపే న మే బంధమోక్షౌ .. 27..
ఇతి ప్రేమభారేణ కించిన్మయోక్తం న బుధ్వైవ తత్త్వం మదీయం త్వదీయం . వినోదాయ బాలస్య మౌర్ఖ్యం హి మాత- స్తదేతత్ప్రలాపస్తుతిం మే గృహాణ .. 28..ం
ఇతి శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్యస్య శ్రీగోవిందభగవత్పూజ్యపాదశిష్యస్య శ్రీమచ్ఛంకరభగవతః కృతౌ దేవీభుజంగస్తోత్రం సంపూర్ణం .. !!
గీతా మాహాత్మ్యము
భగవన్ పరమేశాన ,భక్తి రవ్యభిచారిణీ,ప్రారబ్ధం భుజ్యమానస్యకథం భవతి హే ప్రభో!
భూదేవి విష్ణు భగవానుని గూర్చి యిట్లు ప్రశ్నించెను. ఓ భగవానుడా! పరమేశ్వరా! ప్రభూ! ప్రారబ్ధము అనుభవించువానికి అచంచలమైన భక్తి ఎట్లు కలుగగలదు?
ప్రారబ్ధం భుజ్యమానో౽పి,గీతాభ్యాసరత స్సదా,స ముక్తస్స సుఖీ లోకే,కర్మణా నోపలిప్యతే.
శ్రీ విష్ణువు చెప్పెను - ఓ భూదేవీ! ప్రారబ్ధ మనుభవించుచున్నను, ఎవడు నిరంతరము గీతాభ్యాసమందు నిరతుడై యుండునో అట్టివాడు ముక్తుడై కర్మలచే నంటబడక ఈ ప్రపంచమున సుఖముగ నుండును.
మహాపాపాది పాపాని,గీతాధ్యానం కరోతిచేత్,క్వచిత్స్పర్శం న కుర్వంతి,నలినీదల మంభసా.
తామరాకును నీరంటనట్లు గీతాధ్యానముచేయు వానిని మహాపాపములుకూడ కొంచెమైనను అంటకుండును.
గీతాయాః పుస్తకం యత్ర,యత్ర పాఠః ప్రవర్తతే,తత్ర సర్వాణి తీర్థాని,ప్రయాగాదీని తత్రవై.
ఎచట గీతాగ్రంథము యుండునో, మరియు ఎచట గీత పారాయణ మొనర్చబడుచుండునో, అచట ప్రయాగ మొదలగు సమస్తతీర్థములున్ను ఉండును.
సర్వే దేవాశ్చ ఋషయో,యోగినః పన్నగాశ్చయే,గోపాలా గోపికావా౽పి,నారదోద్ధవ పార్షదైః,సహాయో జాయతే శీఘ్రం,యత్ర గీతా ప్రవర్తతే.
ఎచట గీతాపారాయణము జరుగుచుండునో, అచ్చోటికి సమస్త దేవతలు, ఋషులు, యోగులు, నాగులు, గోపాలురు, భగవత్పార్శవర్తులగు నారద, ఉద్ధవాదులు వచ్చి శీఘ్రముగ సహాయమొనర్తురు.
యత్ర గీతావిచారశ్చ,పఠనం పాఠనం శ్రుతమ్,తత్రాహం నిశ్చితం పృథ్వినివసామి సదైవ హి.
ఓ భూదేవీ! ఎచట గీతను గూర్చిన విచారణ, పఠనము, బోధనము, శ్రవణము జరుగుచుండునో, అచట నేనెల్లప్పుడును తప్పక నివసించుదును.
గీతాశ్రయో౽హం తిష్ఠామిగీతా మే చోత్తమం గృహమ్,గీతా జ్ఞాన ముపాశ్రిత్యత్రీన్లోకాన్పాలయామ్యహం
నేను గీతనాశ్రయించుకొని యున్నాను. గీతయే నాకుత్తమమగు నివాస మందిరము. మరియు గీతాజ్ఞానము నాశ్రయించియే మూడు లోకములను నేను పాలించుచున్నాను.
గీతా మే పరమా విద్యాబ్రహ్మరూపా న సంశయః,అర్ధమాత్రాక్షరా నిత్యా స్వనిర్వాచ్య పదాత్మికా.
గీత నాయొక్క పరమవిద్య. అది బ్రహ్మస్వరూపము. ఇట సంశయ మేమియును లేదు. మరియు నయ్యది (ప్రణవముయొక్క నాల్గవ పాదమగు) అర్ధమాత్రాస్వరూపము. అది నాశరహితమైనది. నిత్యమైనది. అనిర్వచనీయమైనది.
చిదానందేన కృష్ణేనప్రోక్తా స్వముఖతో౽ర్జునమ్,వేదత్రయీ పరానందాతత్త్వార్థజ్ఞానమంజసా
సచ్చిదానందస్వరూపుడగు శ్రీకృష్ణపరమాత్మచే ఈ గీత స్వయముగ అర్జునునకు చెప్పబడినది. ఇది మూడు వేదముల సారము. పరమానంద స్వరూపము. తన్మాశ్రయించినవారికిది శీఘ్రముగ తత్త్వజ్ఞానమును కలుగజేయును.
యో౽ష్టాదశ జపేన్నిత్యంనరో నిశ్చలమానసః,జ్ఞానసిద్ధిం స లభతేతతో యాతి పరం పదమ్.
ఏ నరుడు నిశ్చలచిత్తుడై గీత పదునెనిమిది అధ్యాయములను నిత్యము పారాయణము సలుపుచుండునో, అతడు జ్ఞానసిద్ధినిబొంది తద్ద్వారా పరమాత్మపదమును (మోక్షమును) బడయగల్గును.
పాఠే౽సమర్థస్సంపూర్ణేతదర్ధం పాఠ మాచరేత్,తదా గోదానజం పుణ్యంలభతే నాత్ర సంశయః
గీతను మొత్తము చదువలేనివారు అందలి సగము భాగమైనను పఠించవలెను. దానిచే వారికి గోదానము వలన కలుగు పుణ్యము లభించును. ఇవ్విషయమున సందేహములేదు.
త్రిభాగం పఠమానస్తుగంగాస్నానఫలం లభేత్,షడంశం జపమానస్తుసోమయాగఫలం లభేత్.
గీత యొక్క మూడవ భాగము(1/3) (ఆఱు అధ్యాయములు) పారాయణ మొనర్చువారికి గంగాస్నానము వలన కలుగు ఫలము చేకూరును. ఆఱవ భాగము (1/6)(మూడధ్యాయములు) పఠించువారికి సోమయాగఫలము లభించును .
ఏకాధ్యాయం తు యో నిత్యంపఠతే భక్తి సంయుతః,రుద్రలోక మవాప్నోతిగణోభూత్వా వసేచ్చిరమ్
ఎవడు గీతయందలి ఒక్క అధ్యాయమును భక్తితో గూడి నిత్యము పఠించుచుండునో, అతడు రుద్ర లోకమునుపొంది అచ్చట రుద్రగణములలో నొకడై చిరకాలము వసించును.
అధ్యాయ శ్లోకపాదం వా నిత్యం యః పఠతే నరః,స యాతి నరతాం యావ న్మనుకాలం వసుంధరే.
ఓ భూదేవీ! ఎవడు ఒక అధ్యాయమందలి నాల్గవ భాగమును నిత్యము పారాయణము చేయునో, అతడు ఒక మన్వంతర కాలము (ఉత్కృష్టమగు) మానవ జన్మను బొందును.
గీతాయాః శ్లోక దశకం సప్త పంచ చతుష్టయమ్,ద్వౌత్రీనేకం తదర్ధం వా శ్లోకానాం యః పఠేన్నరః.
చంద్రలోక మవాప్నోతి వర్షాణా మయుతం ధ్రువమ్,గీతాపాఠసమాయుక్తో మృతో మానుషతాం వ్రజేత్.
గీతయందలి పది శ్లోకములుకాని, లేక ఏడుకాని, ఐదుకాని, నాలుగుకాని, మూడుకాని, రెండుకాని, ఒకటికాని లేక కనీసము అర్ధశ్లోకమును గాని ఎవడు పఠించునో అతడు చంద్రలోకమునుబొంది అచట పదివేల సంవత్సరములు సుఖముగనుండును. ఇందు సంశయము లేదు. మరియు గీతను పఠించుచు ఎవడు మరణించునో, అతడు ఉత్తమమగు మానవజన్మమును బడయగల్గును.
గీతాభ్యాసం పునఃకృత్వా లభతే ముక్తి ముత్తమామ్,గీతేత్యుచ్చారసంయుక్తో మ్రియమాణో గతిం లభేత్.
అట్లాతడు మానవుడై జన్మించి గీతాభ్యాసమును మరల మరల గావించుచు ఉత్తమమగు మోక్షముపొందును. 'గీతా - గీతా' అని ఉచ్చరించుచు ప్రాణములను విడుచువాడు సద్గతిని బడయును. గీతార్థ శ్రవణాసక్తోమహాపాపయుతోపి వా,వైకుంఠం సమవాప్నోతివిష్ణునా సహ మోదతే.
మహాపాపాత్ముడైనను గీతార్థమును వినుటయందాసక్తి కలవాడైనచో వైకుంఠమును బొంది అచట విష్ణువుతో సహా ఆనంద మనుభవించుచుండును.
గీతార్థం ధ్యాయతే నిత్యం కృత్వా కర్మాణి భూరిశః,జీవన్ముక్తస్స విజ్ఞేయో దేహాంతే పరమం పదమ్.
ఎవడు గీతార్థమును చింతన చేయుచుండునో, అతడు అనేక కర్మల నాచరించినను, జీవన్ముక్తుడేయని చెప్పబడును. మరియు దేహపతనాంతర మతడు పరమాత్మపదమును (విదేహకైవల్యమును) బొందెను.
గీతామాశ్రిత్య బహవో భూభుజో జనకాదయః,నిర్ధూతకల్మషా లోకే గీతాయాతాః పరమం పదమ్.
ఈ ప్రపంచమున గీతను ఆశ్రయించి జనకాదులగు రాజులనేకులు పాపరహితులై పరమాత్మపదమును బొందగలిగిరి.
గీతాయాః పఠనం కృత్వా మాహాత్మ్యం నైవ యః పఠేత్ | వృథా పాఠో భవేత్తస్య శ్రమ ఏవ హ్యుదాహృతః ||
గీతను పఠించి ఆ పిదప మాహాత్మ్యమును నెవడు పఠింపకుండునో, అతని పారాయణము (తగిన ఫలమునివ్వక) వ్యర్థమేయగును. కావున అట్టివాని గీతాపఠనము శ్రమ మాత్రమే యని చెప్పబడినది.(గ్రంథము యొక్క మహిమను తెలుసుకొనినచో, గ్రంథము యెడల శ్రద్ధ కలుగదని భావము.)
ఏతన్మాహాత్మ్యసంయుక్తం గీతాభ్యాసం కరోతి యః | స తత్ఫల మవాప్నోతి దుర్లభాం గతి మాప్నుయాత్ ||
ఈ మాహాత్మ్యముతోబాటు గీతాపారాయణముచేయువాడు పైన తెలుపబడిన ఫలమును బొంది దుర్లభమగు సద్గతిని (మోక్షమును) బడయగలడు.
సూత ఉవాచ:-
మాహాత్మ్యమేతద్గీతాయా మయా ప్రోక్తం సనాతనమ్ |గీతాన్తే చ పఠేద్యస్తు యదుక్తం తత్ఫలం లభేత్ ||
సూతుడు చెప్పెను - ఓ శౌనకాది మహర్షులారా! ఈ ప్రకారముగ సనాతనమైనట్టి గీతామాహాత్మ్యమును, నేను మీకు దెలిపితిని. అద్దానిని గీతాపారాయణానంతర మెవడు పఠించునో అతడు పైన దెలిపిన ఫలమును బొందును.
ఇతి శ్రీ వరాహపురాణే శ్రీ గీతామాహాత్మ్యం సంపూర్ణమ్ .
శివతాండవ స్తోత్ర తాత్పర్యసహితము
1) జటాట వీగలజ్జల ప్రవాహ పావితస్థలే
గలేవలంబ్య లంబితాం భుజంగతుంగమాలికామ్ |
డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం
చకార చండతాండవం తనోతు నః శివః శివమ్||
కదులుతున్న తన జటలు అనే అరణ్యంలో సురగంగ యొక్క చిత్తడి (మిక్కిలి తడి) కలవాడు
తన మెడలో వేలాడుతూ కదులుతున్న సర్పముల వరుసలు కలవాడు
డమ డమ ధ్వనులను వెలువరిస్తున్న డమరుకము కలవాడు
భయంకరమైన తాండవము చేయుచున్నవాడు అయిన పరమ శివుడు మనందరికి శుభాన్ని కలుగ చేయుగాక!
2) జటాకటా హసం భ్రమ భ్రమ న్నిలింప నిర్ఝరీ
విలోల వీచివల్లరీ విరాజ మానమూర్ధని
ధగద్ధగద్ధ గజ్జ్వలల్ల లాటపట్ట పావకే
కిశోర చంద్రశేఖరే రతిః ప్రతిక్షణం మమ ||
తన జటా సమూహములందు , సంభ్రమముతో చలిస్తున్న ఆకాశగంగా ప్రవాహమును నిలిపివేసిన వాడును ,సుడులు తిరుగుతున్న గంగా తరంగములతో ప్రకాశిస్తున్న శిరస్సు కలవాడును,
ధగాధగా నుదుటిలో(మూడో కంటిలో ) ప్రకాశిస్తున్న అగ్ని దేవుడు కలవాడును
నెలవంకను తన శిరస్సున ధరించిన ఆ పరమశివునియందు ప్రతిక్షణము నాకు అనురక్తి కలుగును గాక!
3) ధరాధ రేంద్ర నందినీ విలాస బంధు బంధుర
స్ఫురద్ది గంతసంత తిప్రమోద మానమానసే |
కృపాకటాక్ష ధోరణీ నిరుద్ధ దుర్ధ రాపది
క్వచిద్దిగంబరే మనో వినోద మేతు వస్తుని||
హిమవంతుని కూతురైన పార్వతీదేవి విలాసములతో కూడుకొన్న క్రీగంటి చూపులకు పులకించి ఆనందించే మనస్సు కలవాడు,తన కృపాకటాక్షములతో భక్తుల కష్టములను తొలగించేవాడు,ఎల్లపుడూ దిగంబరుడు,(దిక్కులనే వస్త్రములుగా కలవాడు, అన్నిటావ్యాపించిన వాడు ) అయిన ఆ పరమ శివుడు నాకు ఆనందమును కలిగించును గాక !
4) జటాభుజంగ పింగళస్ఫుర త్ఫణా మణిప్రభా
కదంబ కుంకుమ ద్రవ ప్రలి ప్తదిగ్వ ధూముఖే |
మదాంధ సింధుర స్ఫురత్త్వగు త్తరీయ మేదురే
మనో వినోదమద్భుతం బిభర్తు భూతభర్తరి ||
తన సిగలో ముడిచియున్న సర్పము యొక్క ప్రకాశిస్తున్న మణి కాంతుల చేత పింగళ వర్ణము కలిగిన జటా జూటము కలిగిన వాడు. మహా సర్పాన్ని శివుడు తన సిగలో ముడుచుకొన్నాడు. ఆ పాము యొక్క మణి కాంతులు ఆయన నల్లటి జుట్టు మీద పడిపింగళ వర్ణంలో (అంటే కొద్దిగా పసుపు, నలుపు, ఎరుపు కలిసిన రంగు పింగళి వర్ణము అంటే సుమారుగా మామిడి చిగురు రంగు) ప్రకాశిస్తున్నాయి. ఆ పింగళ వర్ణాన్ని దిక్కు అనే కన్య పూసుకొన్నట్లుగా కనిపిస్తోంది. మదాంధుడైన గజాసురుడిని చంపి అతనిచర్మాన్ని ధరించినవాడు శివుడు. అందుకే అతని గజ చర్మాన్ని చూడటంతోనే మద గజం గుర్తుకు వస్తోంది. అటువంటి పరమశివుడు నా మనస్సుకు ఆనందం కలిగించునుగాక !
5) సహస్రలోచన ప్రభృత్య శేషలేఖ శేఖర
ప్రసూన ధూళి ధోరణీ విధూస రాంఘ్రి పీఠభూః |
భుజంగరాజ మాలయా నిబద్ధజాట జూటక
శ్రియై చిరాయ జాయతాం చకోర బంధు శేఖరః ||
వేయి కన్నులు కలిగిన దేవేంద్రుడు మొదలైన వారు తనకు నమస్కరిస్తున్నప్పుడు, వారి శిరస్సులలో అలంకరించుకొని ఉన్న పువ్వులలోని పుప్పొడి రేణువులతో అలంకరించబడిన పాద పీఠము కలవాడు, సర్ప రాజమును తన జటా జూటమునకు మాలగా ధరించినవాడు , చకోరములకు బంధువైన చంద్రుని శిరస్సున ధరించినవాడు అయిన పరమ శివుడు నాకు చిరకాలము శ్రేయస్సులను ఇచ్చును గాక!
6) లలాట చత్వరజ్వల ద్ధనంజయ స్ఫులింగభా-
నిపీత పంచసాయకం నమన్ని లింపనాయకమ్ |
సుధా మయూఖ లేఖయా విరాజమాన శేఖరం
మహాకపాలి సంపదే శిరోజ టాలమస్తు నః
తన మూడో కంటిలో ఉన్న ధనంజయమనే అగ్ని జ్వాలల చేత అయిదు బానలు కలిగిన మన్మథుడిని బూడిద చేసిన వాడు, దేవేంద్రుడు మొదలైన దేవ నాయకులచేత నమస్కరింపబడినవాడు ,తన శిరస్సునందున్న చంద్రుని చల్లని వెన్నెలలు మైపూతగా కలిగినచంద్ర శేఖరుడు, జట జూట ధారి, కపాలి , నాకు అనేక సిద్ధులు ఇచ్చుగాక !
7) కరాల ఫాల పట్టి కాధ గద్ధ గద్ధగ జ్జ్వల ద్ధనంజయాధ రీకృత ప్రచండ పంచసాయకే |
ధరాధరేంద్ర నందినీ కుచాగ్ర చిత్రపత్రక-
ప్రకల్పనైక శిల్పిని త్రిలోచనే మతిర్మమ ||
తన నుదుటిలో ధగ ధగా భయంకరంగా ప్రకాశిస్తున్న అగ్నిలో అయిదు బాణములు కలిగిన మన్మథుడిని దగ్థం చేసిన వాడు , పార్వతీదేవి యొక్క కుచాగ్రములపై చిత్ర విచిత్రములైన పూతలను అలంకరించుటలో హస్త లాఘవము కలిగిన శిల్పి వంటి వాడు అయినత్రిలోచనునిపై నా మనస్సు లగ్నమవును గాక !
8) నవీన మేఘ మండలీ నిరుద్ధ దుర్ధ రస్ఫురత్-
కుహూనిశీథినీతమః ప్రబంధబంధకంధరః |
నిలింపనిర్ఝరీధరస్తనోతు కృత్తిసింధురః
కళానిధానబంధురః శ్రియం జగద్ధురంధరః ||
కొత్త మేఘములను ధిక్కరిస్తున్న అమావాస్య రాత్రిని పోలిన నల్లని కంఠము కలవాడు, ఆకాశ గంగను తన శిరస్సు మీద ధరించిన వాడు , కృత్తికా నక్షత్రంలో ఉండేవాడు, గజ చర్మాన్ని కప్పుకొన్నవాడు , తెల్లని చంద్ర కళను నిరోధించే నల్లని కంఠము కలవాడు అయిన పరమశివుడు ప్రపంచమునకు శ్రేయస్సును ప్రసాదించునుగాక !
9) ప్రఫుల్ల నీలపంకజ ప్రపంచకాలి మచ్చటా-
విలంబికంఠ కంధరా రుచిప్రబద్ధకంధరమ్ |
స్మరచ్ఛిదం పురచ్ఛిదం భవచ్ఛిదం మఖచ్ఛిదం
గజచ్ఛిదాంధకచ్ఛిదం తమంతకచ్ఛిదం భజే ||
వికసించిన నల్లని కలువ పూవు వంటి తన కంఠంలో , నల్లని విషాన్ని మింగటం చేత నల్లని కాంతులతో శోభింఛేవాడు, మన్మథుడిని చేదించిన వాడు,పురములను ఛేదించినవాడు, భవబంధములను ఛేదించేవాడు, దక్ష యజ్ఞమును ఛేదించినవాడు , గజాసురుని ఛేదించిన వాడు, గజాసురుని సంహరించిన వాడు, అంధకాసురుని ఛేదించిన వాడు, యముడిని కూడా నిలువరించిన వాడు అయిన పరమశివుడిని సేవించుచున్నాను.
10) అఖర్వ సర్వమంగళా కళా కదంబ మంజరీ
రసప్రవాహ మాధురీ విజృంభణా మధువ్రతమ్ |
స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం
గజాంతకాంధకాంతకం తమంతకాంతకం భజే ||
కదంబమంటే కడిమి. కడిమిచెట్టు పువ్వులు ఒకదానిలోనుండి మరొకటి వరుసగా దండవలె కళాత్మకంగా ఉంటాయి. సర్వ మంగళ అయిన పార్వతీదేవి యొక్క విస్తారమైన కళాత్మకమైన సౌందర్యమనే రస కదంబ పూల ప్రవాహంలో విజృంభించేతుమ్మెదవంటి వాడు శివుడు. మన్మథుడినిఅంతమొందించిన వాడు,పురములను నాశనము చేసిన వాడు, భవబంధములను నశింపచేసే వాడు, దక్ష యజ్ఞమును నాశనము చేసిన వాడు , గజాసురుని నశింప చేసిన వాడు, అంధకాసురుని చంపిన వాడు, యముడిని కూడా యముడు అయిన పరమశివుడిని సేవించుచున్నాను.
11) జయత్వ దభ్ర విభ్రమ భ్రమ ద్భుజంగమ స్ఫురత్
ధగ ద్వినిర్గ మత్క్ర మస్ఫుర త్కరాల ఫాల హవ్యవాట్ |
ధిమి ద్ధిమి ద్ధిమి ధ్వనన్మృ దంగ తుంగ మంగళ
ధ్వనిక్రమప్రవర్తిత ప్రచండతాండవః శివః ||
ఆకాశమునందు ఆశ్చర్యమును కలిగించునట్లుగా , కదులుతున్న బుసలు కొట్టుచున్న భుజంగమును (పామును) స్ఫురింపచేయుచున్న ధగద్ధగాయమానమైన అగ్ని జ్వాలలను వెలువరిస్తున్న ఫాల నేత్రము కలిగిన వాడు , ధిమి ధిమి అని మంగళ ధ్వనులుచేస్తున్న మృదంగ ధ్వనులకు అనుగుణంగా భయంకరమైన తాండవం చేస్తున్న పరమశివా ! నీకు జయము
12) దృషద్విచిత్ర తల్పయోర్భు జంగ మౌక్తిక స్రజోర్-
గరిష్ఠరత్నలోష్ఠయోః సుహృద్విపక్షపక్షయోః |
తృణారవిందచక్షుషోః ప్రజామహీమహేంద్రయోః
సమం ప్రవర్తితం సదా సదాశివం భజామ్యహం ||
సుకుమారమైన హంస తూలికా తల్పాన్ని- వట్టి నేలను, పూమాలలను- సర్ప హారాన్ని , శ్రేష్ఠములైన రత్నములను- మట్టి గడ్డలను, తన పక్షము వారిని- విపక్షమువారిని , గడ్డి పోచను- సువాసనలు వెద చల్లే పద్మాన్ని , సామాన్య మానవుడిని- దేవేంద్రుడంతటి వాడిని సమముగా భావించే సమ దర్శనుడైన ఆ పరమ శివుడిని నా మనస్సులో భావిస్తాను.అన్నింటా తాను ఉన్నాడు కనుక ఒకటి ఎక్కువ - ఒకటి తక్కువ అనే భావన పరమశివునికి లేదని, అన్నింటిని సమంగా చూస్తాడని భావం
13) సదా నిలింప నిర్ఝరీ నికుంజ కోటరే వసన్
విముక్తదుర్మతిః సదా శిరఃస్థమంజలిం వహన్ |
విముక్తలోలలోచనో లలాటఫాలలగ్నకః
శివేతి మంత్రముచ్చరన్ సదా సుఖీ భవామ్యహమ్ ||
ఎల్లపుడు గంగా నదీ తీరములో ఉన్న ఉద్యానవనములో విహరించేవానిని (నివసించేవాడు) , ఎగుడు దిగుడు కన్నులు కలిగిన వానిని (త్రినేత్రుడు) , నుదుటిలో అగ్ని నేత్రము కలవానిని - నా మనస్సులో ఎటువంటి దురాలోచనలు లేకుండా తలుస్తూ , ప్రశాంతంగా తలమీద చేతులుంచి నమస్కరిస్తూ , శివ , శివ అని మంత్రము పలుకుతూ , ఎప్పుడూ నేను సుఖముగా ఉంటాను.
14) ఇమం హి నిత్యమేవ ముక్తముత్త మోత్తమం స్తవం
పఠన్స్మరన్బ్రువన్నరో విశుద్ధిమేతిసంతతమ్ |
హరే గురౌ సుభక్తిమాశు యాతి నాన్యథా గతిం
విమోహనం హి దేహినాం సుశంకరస్య చింతనమ్ ||
ఎవరైతే ఉత్తమమైన ఈ శివ తాండవ స్తోత్రమును నిత్యము చదువుతుంటారో , స్మరిస్తుంటారో, చెబుతుంటారో వారికి ఎప్పుడు విశుద్ధి కలుగుతుంది. అనగా పవిత్రాత్ముడవుతాడు.
శ్రీ అర్గలా స్తోత్రం
శ్లోకం + కోరిక కంటే ఆ విగ్రహం చూస్తేనే ఏదో వైబ్రేషన్ హాయిగా వుంది - ఎక్కడ ఉందో గాని shared post
ఈ ఫోటోని చూస్తూ ఈ స్త్రోత్రం రోజూ చదవండి చాలా కష్టంగా అవుతున్న పనులు సులభంగా అవుతుంది.
అవుతుందో కాదో అని అనుమానంగా ఉన్నవి ఆటంకాలు తొలగి పోతాయి, చాలా రోజులుగా అవుతునట్టే ఉండి కాకుండా వెనక్కి పోతున్న పనులు చేతికి అందుతుంది. ఎవరి వల్ల అయినా భయం కానీ, బాధ కానీ ఉంటే ఆ సమస్య తిరిపోతుంది.. అనారోగ్యంతో చాలా రోజుల నుండి బాధ పడుతూ ఉన్నవారికి ఉపశమనం లభిస్తుంది... ఇది అమ్మవారిని అనుగ్రహం కోసం ప్రసన్నం చేసుకునే శ్లోకం, మొదలు పెట్టే ముందు మీ సమస్య సంకల్పములో చెప్పుకొని ప్రారంభించాలి, ఏ సమస్య లేని వారు కూడా ఆ తల్లి అనుగ్రహం కోసం ఈ స్త్రోత్రం నిత్యం పారాయనఁ చేయవచ్చు.. పరిహారంగా చేసే వాళ్ళు ఉదయం సాయంత్రం చదవాలి.. కచ్చితంగా దీపం వెలిగించి బెల్లం ముక్క అటుకులు, కుదిరితే దానిమ్మ గింజలు కూడా నైవేద్యంగా పెట్టి చదివి హారతి ఇవ్వాలి...
అస్యశ్రీ అర్గళా స్తోత్ర మంత్రస్య విష్ణుః ఋషిః| అనుష్టుప్ఛందః| శ్రీ మహాలక్షీర్దేవతా| మంత్రోదితా దేవ్యోబీజం|
సంకల్పమ్: మీ పేరు గోత్రం మీ కోరిక చెప్పుకుని పారాయణ చేయండి...
ధ్యానం
ఓం బంధూక కుసుమాభాసాం పంచముండాధివాసినీం|
స్ఫురచ్చంద్రకలారత్న ముకుటాం ముండమాలినీం||
త్రినేత్రాం రక్త వసనాం పీనోన్నత ఘటస్తనీం|
పుస్తకం చాక్షమాలాం చ వరం చాభయకం క్రమాత్||
దధతీం సంస్మరేన్నిత్యముత్తరామ్నాయమానితాం|
అథవా
యా చండీ మధుకైటభాది దైత్యదళనీ యా మాహిషోన్మూలినీ
యా ధూమ్రేక్షన చండముండమథనీ యా రక్త బీజాశనీ|
శక్తిః శుంభనిశుంభదైత్యదళనీ యా సిద్ధి దాత్రీ పరా
సా దేవీ నవ కోటి మూర్తి సహితా మాం పాతు విశ్వేశ్వరీ||
ఓం నమశ్చండికాయై
మార్కండేయ ఉవాచ
ఓం జయత్వం దేవి చాముండే జయ భూతాపహారిణి|
జయ సర్వ గతే దేవి కాళ రాత్రి నమోఽస్తుతే||1||
మధుకైఠభవిద్రావి విధాత్రు వరదే నమః
ఓం జయంతీ మంగళా కాళీ భద్రకాళీ కపాలినీ ||2||
దుర్గా శివా క్షమా ధాత్రీ స్వాహా స్వధా నమోఽస్తుతే
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి ||3||
మహిషాసుర నిర్నాశి భక్తానాం సుఖదే నమః|
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి||4||
ధూమ్రనేత్ర వధే దేవి ధర్మ కామార్థ దాయిని|
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి||5||
రక్త బీజ వధే దేవి చండ ముండ వినాశిని |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి||6||
నిశుంభశుంభ నిర్నాశి త్రైలోక్య శుభదే నమః
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి||7||
వంది తాంఘ్రియుగే దేవి సర్వసౌభాగ్య దాయిని|
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి||8||
అచింత్య రూప చరితే సర్వ శతృ వినాశిని|
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి||9||
నతేభ్యః సర్వదా భక్త్యా చాపర్ణే దురితాపహే|
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి||10||
స్తువద్భ్యోభక్తిపూర్వం త్వాం చండికే వ్యాధి నాశిని
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి||11||
చండికే సతతం యుద్ధే జయంతీ పాపనాశిని|
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి||12||
దేహి సౌభాగ్యమారోగ్యం దేహి దేవీ పరం సుఖం|
రూపం ధేహి జయం దేహి యశో ధేహి ద్విషో జహి||13||
విధేహి దేవి కల్యాణం విధేహి విపులాం శ్రియం|
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి||14||
విధేహి ద్విషతాం నాశం విధేహి బలముచ్చకైః|
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి||15||
సురాసురశిరో రత్న నిఘృష్టచరణేఽంబికే|
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి||16||
విధ్యావంతం యశస్వంతం లక్ష్మీవంతంచ మాం కురు|
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి||17||
దేవి ప్రచండ దోర్దండ దైత్య దర్ప నిషూదిని|
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి||18||
ప్రచండ దైత్యదర్పఘ్నే చండికే ప్రణతాయమే|
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి||19||
చతుర్భుజే చతుర్వక్త్ర సంస్తుతే పరమేశ్వరి|
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి||20||
కృష్ణేన సంస్తుతే దేవి శశ్వద్భక్త్యా సదాంబికే|
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి||21||
హిమాచలసుతానాథసంస్తుతే పరమేశ్వరి|
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి||22||
ఇంద్రాణీ పతిసద్భావ పూజితే పరమేశ్వరి|
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి ||23||
దేవి భక్తజనోద్దామ దత్తానందోదయేఽంబికే|
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి ||24||
భార్యాం మనోరమాం దేహి మనోవృత్తానుసారిణీం|
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి||25||
తారిణీం దుర్గ సంసార సాగర స్యాచలోద్బవే|
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి ||26||
ఇదంస్తోత్రం పఠిత్వా తు మహాస్తోత్రం పఠేన్నరః|
సప్తశతీం సమారాధ్య వరమాప్నోతి దుర్లభం ||27||
|| ఇతి శ్రీ అర్గలా స్తోత్రం సమాప్తం ||
వీరభద్రదండకమ్
దక్ష యజ్ఞం ధ్వంసం చేయడానికి వచ్చిన వీరభద్రస్వామి, సహస్ర బాహువులతో దర్శనమిస్తాడు. ఈయనను సుదర్శన వీరభద్రస్వామి అని అంటారు. ఆయనను ఆరాధిస్తే శత్రువులపై విజయము, మనోధైర్యం, తేజస్సు కలుగుతాయని ప్రతీతి. భూత ప్రేత ప్రయోగాలు జరిగాయనీ, ఏదో గాలి ఆవహించందనీ, భయాలతో పీడించబడే వారి దగ్గర కూర్చుని ఈ దండకం చదివి వినిపిస్తూ ఉంటే వారు త్వరగా కొలుకుంటారు ...
ఈ వీరభద్ర దండకాన్ని ప్రతిరోజూ భక్తి శ్రద్ధ విశ్వాసాలతో పఠిస్తే స్వామివారి అనుగ్రహము కలుగుతుంది .
శ్రీ వీరభద్ర దండకం
శ్రీమన్ మహావీరభద్రా సుమౌనీంద్ర భద్రప్రదా సర్వసిద్ధిప్రదా భద్రకాళీమనఃపద్మసంచార భాగ్యోదయా నిత్యసత్యప్రియా సచ్చిదానందరూపా విరూపాక్ష దక్షాధ్వరధ్వంసకా దేవ నీ దైవతత్త్వంబులన్ బొగడ బ్రహ్మాదులే చాలరన్నన్ మనో బుద్ధి చాంచల్యమున్ జేసి వర్ణింపగా బూనితిన్ రుద్రుడిన్నింద్రదంష్ట్రోష్టుడై క్రోధతామ్రాక్షుడై అంగ దుర్దంగ పింగళ జటాజూట సందోహమందొక్క దివ్యజ్జటన్ తీసి క్ష్మామండలిన్ వైవ భూమ్యాన్తరిక్షంబులన్ ప్రజ్వరిల్లతాపాక జ్వాలలన్ జిమ్ము కేశావళితో చండ వేదాండ శుండావ డొర్దండ హేతి ప్రకాండంబుతో విస్ఫులింగద్యుతిన్ వెల్గు నేత్రత్రయీయుక్త నాభిలక్దంష్ట్రోగ్ర వక్త్రంబుతో వీరభద్రుండవై వెలసి దక్షాధ్వరధ్వంసమున్ జేయ నీ తండ్రి యాజ్ఞన్ తలందాల్చి భూత ప్రపంచంబు వెన్నంటరానప్డు బ్రహ్మాండ భాండమ్ములుర్రూతలూగన్ దిగంతంబు లట్టిట్టులై మ్రొక్క బ్రహ్మాదులెంతో భయ భ్రాంతులై పార నా యజ్ఞశాలాటవిన్ జొచ్చి పంచాస్యముల్ నాపశుప్రాయు లన్ బట్టి పెల్లార్చుచున్ జీల్చి చండాడి మార్తాండునిన్ బట్టి పండ్లూడగా గొట్టి భాషాసతీ నాసికన్ గోసి జంభారి దోస్తంభ శుంభప్రతాపంబు జక్కాడి శ్రీమహావిష్ణు చక్రంబు వక్రంబుగా మింగి అక్షీణతౌక్షేయ విక్షేపమున్ జేసి దక్షుతలన్ ద్రుంచివేయన్ మహాభీత చేతస్కులై రప్డు రక్షించుమో వీరభద్రుండ మమ్మం చు జేమోడ్చిసేవంచు దీనావళిన్ గాంచి సౌహార్దమొప్పన్ గటాక్షించి రక్షించి తీవయ్య నిను దీక్షతో గోరి సేవించు భక్తవజ్రాళులన్ దీర్ఘాయురారోగ్య సౌభాగ్య సంపత్ మహాభోగ భాగ్యంబు లన్ ప్రసాదించుమో వీరభద్రా ముని స్తోత్ర పాత్ర నమస్తే నమస్తే నమస్తే నమః |
వారాహి అమ్మ వారి _పన్నెండు పేర్లకు అర్థాల
1) పంచమి:;;ఐదవది, ఆమె ఎనిమిది మాతృకా దేవిలలో ఐదవది, అలాగే ఆమె సదాశివ ఐదవ కరణ్శ్వరుని అనుగ్రహ శక్తిగా వెనుక ఉన్న శక్తి
2) దండనాథ:;;;;శ్రీ లలితా దేవి యొక్క సాయుధ దళాల కమాండర్ ఇన్ చీఫ్. మరియు ఆమె చేతిలో కర్ర ఉన్నవారు.
3) సంకేత:;;;సీక్రెట్ కోడెడ్, హింట్ (ఆమె తన సూచనలతో మీకు మార్గనిర్దేశం చేస్తుంది(ఆమె మీకు సంకేత్ ఇస్తుంది)) మరియు సైన్యంలో రహస్య సంకేతాలు. ఆమె శక్తికి ప్రతీక.
4) సమయేశ్వరి:;;;;నియమాలు మరియు పరిమితులు ఉన్న మార్గం యొక్క దేవత. ఆమె కాలానికి/కాలానికి అధిపతి (ఆమె నారాయణి ,కాళి స్వరూపం),కాలం ఆమె చేతిలో ఉంది .ఆమె కాలాన్ని/కాలాన్ని పరిపాలిస్తుంది.
5) సమయ_సంకేత:;;;;వారాహి దేవి కాల(సమయం) స్వరూపిణి కాళీ దేవి రూపంలో ఉంటుంది.(సమయానికి సమయ కా-సమయ కా సంకేత-చిహ్నం).పూజ మార్గంలో రహస్య సంకేతం. పూజ అనేది సాధన మరియు యుద్ధం వ్యక్తిత్వం అయినందున మనం అర్థం మరియు అర్థం చేసుకోవాలి. పూజలో ప్రతి చర్య వెనుక ఉన్న తత్వశాస్త్రం, ఆమె ఈ అవగాహనను మాకు అందిస్తుంది
.6) వారాహి:;;వరాహ శక్తి స్వరూపం, వారాహి.శ్రీ విష్ణువు యొక్క వరాహ అవతారం వెనుక ఉన్న దైవిక శక్తి. వరాహ శక్తి యొక్క స్త్రీ రూపం. ముఖము వరాహ స్వామి వంటిది.
7) పోత్రిణి:;;ఆమె వరాహ శక్తి రూపంలో పూజిస్తోంది. వరాహ శక్తిని కీర్తించే పేరు. పందిని ఎదుర్కొనే శక్తి ఉంది.పందికి నీటిలో తేలియాడే మరియు ఈదగల సామర్థ్యం ఉన్నందున, ఆమె తన భక్తులను తేలుతూ ఉంచి ప్రపంచంలో వారిని నడిపించే సామర్థ్యాన్ని కలిగి ఉంది.
8) శివ:;;ఎప్పుడూ శుభప్రదమైనది. దేవి ఎప్పుడూ స్వచ్ఛమైన అవగాహన కనుక ఆమె ఎప్పుడూ శుభప్రదమైనది. ఆమె స్ఫటికం, స్వచ్ఛమైన మరియు పవిత్రమైన శివుడు. ఆమె శక్తి, శివుడే తప్ప మరెవరో కాదు. ఆమె కేవలం సముద్రం లేదా స్వచ్ఛమైన స్పృహ.
9) వర్తలి:;;త్రెకాల్ గ్యాని. ఆమె మాకు మూడు సార్లు సమాచారాన్ని చేరవేస్తుంది.
10) మహాసేన:;;ఆమె శ్రీ లలితా మహా త్రిపుర సుందరి యొక్క అన్ని సాయుధ దళాలకు కమాండర్ ఇన్ చీఫ్. మనపై ప్రభావం చూపే అన్ని ప్రతికూల శక్తుల (శక్తుల) ఓటమి మరియు అణచివేతను నిర్ధారించడానికి ఆమె వద్ద అన్ని వనరులు ఉన్నాయి. ఆమె భౌతిక, భౌతిక మరియు ఆధ్యాత్మిక అన్ని అంశాలలో మన శ్రేయస్సును నిర్ధారిస్తుంది.
మాంసం, ఎముకలు, రక్తంతో కూడిన శరీరం ఆమె సైన్యాలు కాబట్టి ఈ శరీరాన్ని మంచి స్థితిలో ఉంచడం ఈ దేవి యొక్క వరం అని ఇక్కడ సూచించబడింది.
11) అగ్నచక్రేశ్వరి:;;ఆమె ఆరు చక్రాలలో (షడ్చక్రాలు) ఆరవది మరియు చివరిది అయిన మూడవ కన్ను పీనియల్ గ్రంధి అజ్ఞా చక్రం (మధ్య కనుబొమ్మ) పాలకుడు మరియు స్వీయ జ్ఞానంతో మనకు ప్రకాశించేది. ఈ చక్రం మాత్రమే అందరినీ కూడా సక్రియం చేయగలదు. దిగువ చక్రాలు మరియు కుండలిని యొక్క సరైన పురోగతిని నిర్ధారించండి. ఈ చక్రానికి అధిపతిగా, ఆమె మాత్రమే మార్గనిర్దేశం చేయగలదు మరియు కుండలిని దాని శిఖరాగ్రానికి (శివ శక్తి ఐక్య) పెరుగుదలను నిర్ధారించడానికి సహస్రారానికి తీసుకెళ్లగలదు.
12) అరిగ్ని:;;శత్రువులను తొలగించేది మరియు నియమాలను సమర్థించేది.ఆమె అన్ని ప్రతికూల శక్తులు మరియు శత్రువులను తొలగించేది. శత్రువులు బాహ్య లేదా అంతర్గత లేదా రెండూ కావచ్చు. ఆమె అన్ని ప్రతికూల కర్మలను పారద్రోలుతుంది మరియు తన అభీష్టానుసారం అన్ని రకాలుగా శత్రుత్వాన్ని తొలగిస్తుంది. ఆమె భౌతిక ఆందోళనల కంటే పైకి ఎదగడానికి మరియు మనల్ని శాశ్వతమైన మరియు అపరిమితమైన ఆధ్యాత్మిక రంగాలకు తీసుకెళ్లడానికి సహాయపడుతుంది.
!శుభమస్తు!!సర్వేజనా సుఖినో భవంతు !!
శనీశ్వరుడు
"నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజమ్
ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరమ్"
నీలాంజనం అంటే : నల్లటి కాటుక రూపంలో ఉండే వాడు,
రవిపుత్రం అంటే :సూర్యుడి పుత్రుడు,
యమాగ్రజం :యముడికి సోదరుడు,
ఛాయా మార్తాండ :సంభూతం ఛాయా దేవికి
మార్తాండుడు అంటే :సూర్య భగవానుడికి జన్మించిన వాడు,
తం నమామి శనేశ్చరం:అలాంటి శనీశ్వరుడికి నమస్కరిస్తున్నాను అని అర్థం.
ఈ మంత్రాన్ని ఒక్కసారి జపిస్తే శనీశ్వరుడు మిమల్ని అనుగ్రహిస్తాడు.
శనీశ్వరుడిని ఎప్పుడూ శని శని అని పిలవకూడదట. శనీశ్వరా అని మాత్రమే పలకాలి.
విశేషం ఏమంటే ఈశ్వర శబ్దం ఎక్కడ ధ్వనిస్తుందో అక్కడ ఐశ్వర్యం ఉంటుంది.
ఉదాహరణకి శివుడిని ఈశ్వరుడు, మహేశ్వరుడు అంటాం, ఆయన అలా అనుగ్రహిస్తాడు...
వెంకటేశ్వర స్వామి పేరులోనూ ఈశ్వర శబ్దం ఉంది. ఈశ్వర శబ్దం ఉంది కాబట్టే ఆయన కలియుగ దైవంగా మారి మన కోరికలను నెరవేరుస్తున్నాడు.
అలాగే శనీశ్వరుడి నామంలోనూ శని, ఈశ్వరుడు అనే శబ్దం రావడంతో ఈయన కూడా శివుడిలా, వేంకటేశ్వరుడిలా మనల్ని అనుగ్రహిస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి.
శనీశ్వరుడికి బయపడాల్సిన పనిలేదు. నవగ్రహా మండపానికి వెళ్లినప్పుడు శనీశ్వరుడికి భక్తితో నమస్కారం చేయండి. నమస్కరించడం వల్ల, శనివార నియమాల్ని పాటించడం వల్ల, నీలం లేదా నలుపు రంగు వస్త్రాల్ని ధరించడం వల్ల, ఆయనకు ఇష్టమైన చిమ్మిలి నివేదనం చేయడం వల్ల, శనివారం శనికి తైలాభిషేకం చేయడం వల్ల, శివారాధన చేయడం వల్ల, తప్పక అనుగ్రహిస్తాడు. శనివారం నాడు, లేదా అమావాస్య తిథిలో హనుమంతునికి నేతితో దీపమెలిగించే వారికి సకల సంపదలు చేకూరుతాయి.
రావణుడి చెరలో ఉన్న నవగ్రహాలను తప్పించిన కారణంగా హనుమంతునికి శనీశ్వరుడు ఓ వరం ఇచ్చాడని,
ఆ వర ప్రభావంతో ఏలినాటి శని ప్రభావంలో ఉన్న జాతకులు హనుమంతునిని స్తుతిస్తే..
వారికి శనిగ్రహంచే ఏర్పడాల్సిన ఈతిబాధలు, సమస్యలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి...స్వస్తి.
అహం బ్రహ్మాస్మి!!
*ఆకాశానికి ఉన్న ఒకే ఒక గుణం…శబ్దం.
*వాయువుకు ఉన్నగుణాలు రెండు…శబ్దం, స్పర్శ.
*అగ్నికి ఉన్న గుణాలు మూడు…శబ్ద, స్పర్శ, రూపములు.
*జలముకు ఉన్న గుణాలు నాలుగు…శబ్ద, స్పర్శ, రూప, రసము(రుచి)లు.
భూమికి ఉన్న గుణాలు ఐదు…శబ్ద, స్పర్శ,రూప, రస, గంథాలు.
ఈ ఐదు గుణాలూ…పాంచభౌతిక తత్త్వాలు గల మన శరీరానికి ఉన్నాయి కనుకనే మనం భూమిని ఆశ్రయించి జీవిస్తున్నాం.
జలము…‘గంథము’ అనే గుణాన్ని త్యాగం చేయడం వల్ల, మనం నీటిని చేతితో పట్టుకోలేము. నీటికి మన చేతిని ఆధారంగా మాత్రమే ఉంచగలం. కొంతసేపటికి ఆ నీరు ఆవిరైపోతుందేగనీ.. దీనిని మనం బంధించలేము.
*అగ్ని…‘రస, గంథము’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, అగ్నిని కళ్ళతో చూడగలమే గానీ, కనీసం తాకనైనా తాకలేము. తాకితే శిక్షిస్తుంది.
వాయువు…‘రస,గంథ, రూపము’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, మనం వాయువును ఈ కళ్ళతో చూడనైనా చూడలేము. వాయువే తనంతట తాను మనలను స్పృశించి, తన ఉనికిని మనకు తెలియజేస్తుంది.*ఆకాశం…‘రస, గంథ, రూప, స్పర్శ’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, అది మన కళ్ళకు కనిపించకుండా, తను ఉన్నానని మనలను భ్రమింప చేస్తుంది.కేవలం ఒకే ఒక గుణమున్న (శబ్దం) ఆకాశాన్నే మనం చూడలేనప్పుడు…, ఏ గుణము లేని ఆ ‘నిర్గుణ పరబ్రహ్మ’ ఎలా ఈ భౌతిక నేత్రానికి కనిపిస్తాడు? అలా చూడాలంటే మన మనోనేత్రాన్ని తెరవాలి. దాన్ని తెరవాలంటే…, పాంచభౌతిక తత్త్వాలైన గుణాలను, అనగా…ప్రాపంచిక విషయ వాసనలను త్యజించాలి. అప్పుడు నీవు ‘నిర్గుణుడ’వు అవుతావు. అప్పుడు నీవే ‘పరమాత్మ’వు అవుతావు. నిన్ను నీలోనే దర్శించుకుంటావు.
అదే ‘అహం బ్రహ్మాస్మి’ అంటే...నిన్ను నీవు తెలుసుకోవడమే’ అదే దైవాన్ని దర్శించడమంటే,అదే దైవ సాక్షాత్కారం అంటే…,;
వారాహి దేవి
ఆషాడ మాసంలో పాడ్యమి నుంచి దశమి వరకు వారాహి దేవి పేరుతో గుప్త నవరాత్రులు గా జరుపుకుంటారు.
వారాహి.... లలితా దేవికి సైన్యాధ్యక్షురాలు. సప్త మాతృకలలో వారాహి ఒకటి. ఈమెను లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కొలుస్తారు. ఈమె వరహస్వామి అర్ధాంగి.
మార్కండేయ పురాణం లోని దేవి మహత్యం లోని ఒక కథ ప్రకారం దేవుళ్ళు శరీరంనుండి వారి శ్రీ రూప శక్తులు ఉద్భవిస్తాయి. శివుడు నుండి శివాని విష్ణు నుండి వైష్ణవి బ్రహ్మ బ్రాహ్మణి ఇలా వరాహస్వామి నుండి వారాహి వారాహ రూపములో ఉద్భవిస్తుంది. హరహి వారహ రూపంలో చేతిలో చక్రం ఖడ్గంతో వర్ణితమైంది.
ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢ శుద్ధ నవమి వరకు గల తిధుల రాత్రి సమయంలో అమ్మవారిని పూజిస్తారు. వీటిని గుప్త నవరాత్రులు అంటారు....
వారాహి దేవి లలితా దేవి సైన్యంలో రధ గజ తురగ సైన్యం బలాలు అన్ని వరాహి ఆధీనములో ఉంటాయి... అందుకే ఆమెను దండనాథ అన్నారు .
వారాహి ఉగ్రముగా కనపడినప్పటికీ బిడ్డలను కంటికి రెప్పలా కాపాడే కన్నతల్లి ముఖ్య ప్రాణ రక్షణి.
వారాహి అమ్మవారు అంటే హిరణ్యాక్షుడు భూదేవిని జలంలోకి తీసుకెళ్లినప్పుడు శ్రీ మహా విష్ణువు వరాహ రూపంలో అవతరించి వాడిని సంహరించి భూదేవిని రక్షిస్తాడు. శ్రీ లక్ష్మి సహస్రనామ స్తోత్రము లో వారాహి ధరణి ధ్రువ అని కనిపిస్తుంది.
హయగ్రీవ స్వామి అగస్త్యునికి చెప్పిన వారాహి నామాలు ఇవి.
పంచమి, దండనాథా,సంకేతా, సమయేశ్వరి,సమయ సంకేతా, వారాహి, పోత్రిణి, శివా, వార్తాళి, ఆజ్ఞ, చక్రేశ్వరి, ఆరిఘ్ని.
అమ్మ అనుగ్రహం అందరికీకలగాలి
సప్త మాత్రికలు
కొన్ని దేవాలయాల్లో వరుసగా పేర్చ బడిన అమ్మవార్ల మూర్తులను చూస్తుంటాం.
వారినే సప్త మాత్రికలుసగా పూజిస్తాం. ఎటువంటి భయాలనైనా పారద్రోలగల శక్తి సామర్ఱ్యాలు ఈ సప్త మాత్రికలకు ఉంటాయని భక్తుల విశ్వాసం.
సప్త మాత్రికలు ఎవరు.? ఎలా ఉద్భవించారు.?
బ్రాహ్మణి, వైష్టవి, మహేశ్వరి, ఇంద్రాణి, వరాహి, కౌమారి, చాముండ, నరసింహీ, వినాయకీగా పిలవబడే సప్త మాత్రికల్లో ఒకరుగా వరాహ దేవి అమ్మవారిని చెబుతారు. విష్ణుమూర్తి అవతారాల నుండి ఉద్భవించిన వారే ఈ సప్త మాత్రికలు. బ్రహ్మ నుండి బ్రాహ్మణి, విష్ణువు నుండి వైష్ణవి, పరమేశ్వరుని నుండి మహేశ్వరి, ఇంద్రుని నుండి ఇంద్రాణి, వరాహావతారం నుండి వరాహి, స్కంధ నుండి కౌమారీ, నరసింహావతారం నుండి నరసింహి, వినాయకుని నుండి వినాయకీ సప్త మాత్రికలుగా ఉద్భవించారు. వారిలోని వరాహి అవతారం ప్రత్యేకమైనది. ఆమె వరాహి దేవిగా పిలవబడుతూ, ఆ పరమేశ్వరుని క్షేత్రానికి క్షేత్ర పాలికగా కాపు కాస్తోంది. అంత ప్రత్యేకత ఉన్న ఈ వరాహి దేవి అమ్మవారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వరాహ మూర్తి అని దశావతారాల్లో విష్ణు మూర్తిని కొలుస్తుంటాం. వరాహా మూర్తిగా తన ముక్కుపై భూగోళాన్ని మోస్తున్నట్లుగా మహా విష్ణువు రూపం అందరికీ సుపరిచితమే. అయితే, వరాహి దేవి అనే పేరు మాత్రం ఇంతవరకూ ఎవ్వరూ విని ఉండరు. ఎవరీ వరాహి దేవి.? సప్త మాత్రికల్లో ఒకరుగా చెప్పబడుతున్న ఈ అమ్మవారు ఎక్కడుంది.?కాశీ క్షేత్ర పాలికే ఈ సప్తమాత్రిక..
సాక్షాత్తూ పరమ శివుడు కొలువై ఉన్న కాశీ పట్టణానికి క్షేత్ర పాలికగా వరాహిదేవిని కొలుస్తారట. చాలా చోట్ల శివుడే క్షేత్ర పాలకుడుగా ఉంటాడు. కానీ, ఆ పరమ శివునికే ఈ వరాహి దేవి క్షేత్ర పాలికగా ఉందన్న మాట. కాశీ పట్టణానికే కాదు, తంజావూర్ బృహదీశ్వరాలయానికీ ఈ మాత క్షేత్ర పాలికగా కాపలా కాస్తోందట. తంజావూర్ బృహదీశ్వరాలయంలో ఈ అమ్మవారికి ప్రత్యేకంగా ఓ ఆలయం ఉంది. ఆ ఆలయంలో అమ్మ నల్లని రాతితో వరాహ ముఖంతో నిండుగా, ఉగ్రరూపంలో దర్శనమిస్తుంది. ఆ రూపాన్ని చూడాలంటే, నిజంగా పెట్టి పుట్టాలంతే అన్నట్లుగా ఉంటుంది అమ్మవారి రూపం ఇక్కడ. అలాగే, కాశీ నగరంలో అయితే, నీలి రంగులో దర్శనమిస్తుంది. వరాహ రూపంలోనే ఆరు చేతులూ శంఖు, సుదర్శన చక్రాలతో శిరస్సుపై చంద్రవంకతో ప్రశాంతంగా దర్శనమిస్తుంది. సప్త మాత్రికలందరిలోనూ ఈ అమ్మవారు అత్యంత ప్రత్యేకమట. అందుకే అమ్మను క్షేత్ర పాలిక అంటారు. చాలా శక్తివంతురాలిగా వరాహి దేవిని స్తుతిస్తారు. రాక్షసులను మట్టు పెట్టే సమయంలో ఆమె చూపిన తెగువకు చిహ్నంగానే ధైర్యసాహసాలకు ప్రతీకగా ఆమెను కొలుస్తారు.ఈ అమ్మవారిని ఎందుకు కొలుస్తారంటే.....
ధైర్యానికి ప్రతీకగా ఈ అమ్మను కొలుస్తారట. భారతదేశంలోనే కాదు, నేపాల్ వాసులు కూడా వరాహి దేవిని ప్రత్యేకంగా పూజిస్తారట. బుద్ధిజంలోనూ వరాహి దేవి ప్రస్థావన ఉంది. బుద్ధిజంలో వరాహి దేవిని వజ్రవరాహి, వజ్ర యోగిని అని పిలుస్తారు. ఎక్కువగా తాంత్రిక విద్యల కోసం నేపాల్ వాసులు ఈ అమ్మవారిని ప్రసన్నం చేసుకుంటారట. అయితే, చెడు కోసం వాడే తాంత్రిక విద్యలు కావట. మంచి కోసం ఉపయోగించే తాంత్రిక విద్యల కోసమే అమ్మవారిని కొన్ని ప్రత్యేక పూజలతో ప్రసన్నం చేసుకుంటారనీ తెలుస్తోంది. బెనారస్, తంజావూరుతో పాటు, ఇండియాలోని మరికొన్ని ఆలయాల్లో వారాహి దేవి విగ్రహాలు కనిపిస్తాయి...
🚩సర్వేజనా సుఖినోభవంతు🚩
శివలింగ వృక్షం..
శివలింగ వృక్షం శాస్త్రీయ నామం కౌరౌపిటా గియానెన్సిస్. ఆంగ్ల పరిభాషలో కేనన్ బాల్ ట్రీ అంటారు. ఇది దక్షిణ అమెరికాలోను, దక్షిణ భారతదేశంలోను కనిపిస్తుంది. ఈ వృక్షాన్ని నాగలింగ వృక్షమని కూడా అంటారు. వీటి పుష్పాల మధ్య భాగం పడగ విప్పిన సర్పం వలె ఉంటుంది.
శివలింగ వృక్షం శివుడి జఠాఝూఠ ఆకృతిలో, వెండ్రుకలు విప్పారినట్లుగా ఉంటాయి. పుష్పాలు కొమ్మలకు పూయకుండా వెంట్రుకల లాంటి జడలకు పూస్తాయి. పైభాగాన నాగ పడగ కప్పి ఉన్నట్లుగా ఉండి లోపల శివలింగాకృతిలో ఉంటాయి. శివలింగపుష్పాల్ని నాగమల్లి పుష్పాలుగా, మల్లికార్జున పుష్పాలుగా కూడా పిలుస్తారు. ఇవి అద్భుత సుగంధ పరిమళాలు వెదజల్లుతుంటాయి.
హిందువులు శివలింగపుష్ప రూపంలో, వృక్షరూపంలో శివుడు కొలువై ఉన్నాడని బావిస్తారు. శివలింగపుష్పాలు సర్వదేవతలకు ముఖ్యంగా శివునికి ప్రీతికరం. ఈ పుష్పాలతో శివపూజ చేయడం ప్రతి శివభక్తునికి నిజంగా ఒక వరం. శివలింగపుష్పాలతో శివపూజ చేసిన వారికి జన్మరాహిత్యాన్ని పొంది, అంత్యమున కైవల్యం పొందునని శివపురాణంలో ఉంది. ఏ దేవునికైనా ఈ పుష్పం సమర్పించినప్పుడు, తప్పనిసరిగా ఆ దేవతల శిరస్సుపై లేదా భుజస్కందాలలో మాత్రమే అలంకరించాలి. పాదాలదగ్గర వేయరాదు. పార్వతికి మాంగల్యంలో అలంకరించాలి...స్వస్తి...
*పరమశివుని ఆకృతిలో*
*పరమశివుని ఆకృతిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్ధం ఉంది. శివుని త్రిశూలం సత్వ, రజ, తమో గుణాలకు ప్రతిరూపాలు.
ఢమరుకం శబ్ద బ్రహ్మ స్వరూపం.
అతని శిరస్సును అలంకరించిన చంద్రవంక మనోనిగ్రహానికి, గంగాదేవి శాశ్వతత్వానికి ప్రతీక.
అతని దేహంపై గల సర్పాలు భగవంతుని జీవాత్మలుగాను,
ధరించిన పులి చర్మం అహంకారాన్ని త్యజించమని, ఆశీనంపైన పులిచర్మం కోరికలకు దూరంగా ఉండమని,
భస్మం పరిశుద్ధతనూ సూచిస్తాయి.
ఆయన పట్టుకున్న నాలుగు జింక కాళ్ళు చతుర్వేదాలకు, నందీశ్వరుడు సత్సాంగత్యానికి, నంది ధర్మదేవతకు,
మూడవ నేత్రం జ్ఞానానికి సూచిక.
దారిద్ర దహన గణపతి స్తోత్రం
దారిద్ర దహన గణపతి స్తోత్రం ప్రతీరోజూ పఠిస్తే శ్రీ గణేశుని అనుగ్రహం వలన అన్ని అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.
మనం ఏ కార్యం తలపెట్టినా, అది ఎటువంటి అవరోధాలు కలుగకుండా, విజయవంతంగా కొనసాగాలని ప్రప్రథమంగా శ్రీ విఘ్నేశ్వరుని ప్రార్ధిస్తాము. సకల శుభాలనూ అనుగ్రహించే ఈ గణపతి స్తోత్రం భక్తి శ్రద్ధ విశ్వాసాలతో పఠిస్తే, శ్రీ గణేశ అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ప్రతీరోజూ ఈ మహామహిమాన్వితమైన స్తోత్రాన్ని పఠించి, గణేశ అనుగ్రహం పొందుదాం.
దారిద్ర్య దహన గణపతి స్తోత్రo
సువర్ణ వర్ణ సుందరం సితైక దంత బంధురం
గృహీత పాశ మంకుశం వరప్రదా భయప్రధం
చతుర్భుజం త్రిలోచనం భుజంగ మోపవీతినం
ప్రపుల్ల వారిజాసనం భజామి సింధురాననః!!
కిరీట హార కుండలం ప్రదీప్త బాహు భూషణం
ప్రచండ రత్న కంకణం ప్రశోభితాంఘ్రి యష్టికం
ప్రభాత సూర్య సుందరాంబర ద్వయ ప్రధారిణం
సరత్న హేమనూపుర ప్రశోభి తాంఘ్రి పంకజం
సువర్ణ దండ మండిత ప్రచండ చారు చామరం
గృహ ప్రదేందు సుందరం యుగక్షణ ప్రమోదితం
కవీంద్ర చిత్తరంజకం మహా విపత్తి భంజకం
షడక్షర స్వరూపిణం భజే గజేంద్ర రూపిణం
విరించి విష్ణు వందితం విరుపలోచన స్తుతం
గిరీశ దర్శనేచ్చయా సమార్పితం పరాంబయా
నిరంతరం సురాసురైః సుపుత్ర వామలోచనైః
మహామఖేష్ట కర్మను స్మృతం భజామి తుందిలం
మదౌహ లుబ్ధ చంచలాళీ మంజు గుంజితా రవం
ప్రబుద్ధ చిత్తరంజకం ప్రమోద కర్ణచాలకం
అనన్య భక్తి మాననం ప్రచండ ముక్తిదాయకం
నమామి నిత్య మాదరేణ వక్రతుండ నాయకం
దారిద్ర్య విద్రావణ మాశు కామదం
స్తోత్రం పఠెదేత దజస్ర మాదరాత్
పుత్రీ కళత్ర స్వజనేషు మైత్రీ
పుమాన్ భవే దేకదంత వరప్రాసాదాత్
ఇతి దారిద్ర్య దహన గణపతి స్తోత్రం సంపూర్ణం!!ఓం గం గణపతయే నమః!!
మాస శివరాత్రి పర్వదినం
మాస శివరాత్రి అంటే ఏమిటి..? ఎందుకు జరుపుకోవాలి? ఎలా జరుపుకోవాలి? దీని వలన ఉపయోగములు ఏమిటి ?
మాస శివరాత్రిని ఎప్పుడు జరుపుకోవాలి
ప్రతి నెల అమావాస్య ముందురోజు వచ్చే
చతుర్ధశి తిథిని మాసశివరాత్రిగా జరుపుకుంటారు.
అసలు శివరాత్రి అనగా శివుని జన్మదినం (లింగోద్భవం) అని అర్ధం.
శివుని జన్మ తిథిని అనుసరించి ప్రతి నెలా జరుపుకునేదే మాస శివరాత్రి.
మాస శివరాత్రి ఎందుకు జరుపుకోవాలి?
మహాశివుడు లయ కారకుడు.
లయానికి (మృత్యువునకు) కారకుడు కేతువు. అమావాస్యకు ముందు వచ్చే చతుర్ధశి సమయంలో చంద్రుడు క్షీణించి బలహీనంగా ఉంటాడు.
చంద్రోమా మనస్సో జాతః
అనే సిద్దాంతము ప్రకారము ఈ చంద్రుడు క్షీణ దశలో ఉన్నప్పుడూ జీవులపై ఈ కేతు ప్రభావము ఉండటము వలన వారి వారి ఆహారపు అలవాట్లపై ప్రభావము చూపించడము వలన జీర్ణశక్తి మందగిస్తుంది.
తద్వారా మనస్సు ప్రభావితమవుతుంది.
ఆయా జీవులు ఈ సమయంలో మానసికముగా సమయమును కోల్పోవడమో,
చంచల స్వభావులుగా మారడమో,
మనోద్వేగముతో తీసుకోకూడని నిర్ణయాలు తీసుకోవడమో జరిగి కొన్ని సమయాలలో తమకే కాకుండా తమ సమీపములో ఉన్న ప్రజల యొక్క మనస్సు, ఆరోగ్యం, ధనం, ప్రాణములకు హాని తలపెట్టే ప్రయత్నం తమ ప్రమేయం లేకుండానే చేస్తూ ఉంటారు.
మనం గమనిస్తే అమావాస్య తిథి ముందు ఘడియలలో కొందరి ఆరోగ్యం మందగించండం లేదా తిరగబెట్టడం, ప్రమాదాలు ఎక్కువగా జరిగి మరణాలు సంభవించడానికి కారణము ఇదే అని చెప్పవచ్చు.
కావున ఇటువంటి విపత్కర పరిస్థితులు రాకుండా ఉండాలన్నా లేక వాటి యొక్క తీవ్రత మనపై తక్కువగా ఉండాలన్నా మనం అవకాశం ఉన్నంతమేర ప్రతి మాసము ఈ మాస శివరాత్రిని జరుపుకోవలసిన అవసరం ఉన్నది.
మాస శివరాత్రిని శాస్త్రయుక్తంగా ఎలా జరుపుకోవాలంటే అమావాస్య ముందు వచ్చే మాస శివరాత్రి నాడు సశాస్త్రీయంగా ఉపవాసము ఉండి సాధ్యమైనంత మేర ఎక్కువగా నీరు త్రాగుతూ గడపాలి.
ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత స్నానాధికాలు ముగించుకుని దగ్గరలోని శివాలయ దర్శనం చేయాలి.
శక్తి మేర ప్రదక్షిణలు చేయవచ్చు.
అలాగే ఈ రోజు శివాలయములో పూజలో పెట్టిన చెరకు రసమును భక్తులకు పంచినచో
వృత్తి అంశములో ఇబ్బందులను ఎదుర్కొనేవారికి ఆటంకాల నుండి ఉపశమనం లభిస్తుంది.
అదేవిధంగా ఆరోజు ప్రదోషవేళ శివునకు మారేడు దళములతో లేదా కనీసము గంగా జలముతో అభిషేకాది అర్చనలు చేయడము మంచిది.
ఇవేమీ చేయడానికి అవకాశములేని వారు ఆరోగ్యవంతులు అలాగే గృహములో అశౌచ దోషము లేనివారు ఈ రోజు ఉపవాసము ఉండి మూడు పూటల చల్లని నీటితో స్నానం చేయాలి.మంచం మీద కాకుండా నేలపై పడుకోవాలి.
మాస శివరాత్రిని జరుపుకోవడము వలన ఉపయోగములు?
ప్రత్యేకించి ఈ రోజును శాస్త్రీయంగా జరుపుకోవడము వలన మన జాతకములోని క్షీణ చంద్ర దోషముల యొక్క తీవ్రత తగ్గు ముఖం పడుతుంది.సంతానలేమి సమస్యలు నుండి విముక్తి లభిస్తుంది.వృత్తికి సంబంధించిన అవరోధాలలో మార్పు కల్గుతుంది.దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా మొండిగా, పెంకిగా, బద్దకంగా, మూర్కంగా ప్రవర్తించే పిల్లల చేత వారి తల్లిదండ్రులు ఈ రోజు ఉపవాసమును చేయించి దేవాలముకు వెళ్ళే అలవాటును చేయించగలిగితే వారిలో కాలక్రమములో ఖచ్చితముగా మార్పు వస్తుందని పెద్దలు అనుభవపూర్వకంగా చెప్పిన మాటలు. మానసిక సమస్యల నుండి విముక్తి లభిస్తుంది.కావున అవకాశం ఉన్నంత మేర ప్రతి మాస శివరాత్రిని సశాస్త్రీయంగా జరుపుకోవడము ద్వారా శుభములను పొందగలుగుతాము. శివోహం !!
ఏకాదశరుద్రులు.
ఏ నామముతో పిలిచిన కొలిచినా, మీ హృదయంలో హృదయ పూర్వకంగా ఎవరిని ఆరాధిస్తారో వారికే మీరు పెట్టే నమస్కారం చెందుతుంది! ఏ నామానికైనా, స్మరణ గొప్పది శివమహేశ్వర,,శంభు,,శ్రీ కంఠోభవ ఈశ్వర,మహాదేవ,, పశుపతి,, నీలకంఠో వృషధ్వజ,,పరమేశ ఇమే రుద్రా, ఏకాదశ సమీరితా,,
అని శివతత్త్వ రత్నాకరం యొక్క అర్ధం దీనిని బట్టి 1. శివుడు, 2. మహేశ్వరుడు, 3. శంభుడు, 4. శ్రీకంఠుడు, 5. భవుడు, 6. ఈశ్వరుడు, 7. మహాదేవుడు, 8. పశుపతి, 9. నీలకంఠుడు, 10. వృషధ్వజుడు, 11. పరమేశుడు అనువారు ఏకాదశరుద్రులు.
మరో పక్షాన్నిఅనుసరించి,, 1)అజుడు, 2. ఏకాపాదుడు, 3. అహిర్భుధ్న్యుడు , 4. త్వష్ట, 5. రుద్రుడు, 6. హరుడు, 7. శంభుడు, 8. త్ర్యంబకుడు, 9. అపరాజితుడు, 10. ఈశానుడు, 11.త్రిభువనుడు ఏకాదశరుద్రులుగా పేర్కొనబడ్డారు.
ఇంకా కొన్ని మతభేదాలు ఉన్నాయి. వాటి ప్రకారం పై పేర్లలో కొన్నింటికి బదులు వృషాకపి, కపర్ది, శర్వుడు మొదలైన పేర్లు వినబడుతున్నాయి.
ఇలాగే ద్వాదశాదిత్యులు అన్న విషయంలో కూడా భేదాలు కనబడుతున్నాయి. ఒక మతాన్ని అనుసరించి ఈ క్రిందివారు ద్వాదశాదిత్యులవుతార 1)ధాత, 2. మిత్రుడు, 3. అర్యముడు, 4. శుక్రుడు, 5. వరుణుడు, 6. అంశుడు, 7. భగుడు, 8. వివస్వంతుడు, 9. పుమ్షుడు, 10. సవిత, 11. త్వష్ట 12. విష్ణువు.
మరోక పక్షంలో వీటిలో కొన్ని పేర్లకు బదులు,,, 1)జయంతుడు,2)భాస్కరుడు, 3. భానుడు, 4. హిరణ్యగర్భుడు, 5. ఆదిత్యుడు ఇత్యాదిగా గల నామాలు పేర్కొనబడి వున్నాయి.
కాశీనాధుని సుబ్రహ్మణ్యం
వారణాసి -యాత్ర ఫలితాలు
ఏ ఆలయానికి వెళ్ళినా, ముందు శిఖర దర్శనం చేయాలి. తర్వాత ధ్వజ స్తంభం, స్వామి వాహన దర్శనం చేయాలి. వారి అనుజ్ఞతో మూల విరాట్ దర్శనం చేసుకోవాలి. ఆ తర్వాత అమ్మవారి దర్శనం ఇతర దేవతాదర్శనం చేయాలి.
కాశీ లో గంగాస్నానం చేసిన వారు గంగ నీటిని ఇంటికి తీసుకొని వెళ్ళవచ్చు. కాని గంగ మట్టిని మాత్రం ఇంటికి తీసుకు వెళ్ళరాదు అని శాస్త్రం చెబుతోంది. కాశీ మహాస్మశానం కనుక ఆ మట్టి నిషిద్ధం అయి ఉంటుంది. మణికర్ణిక ఘాట్ లో రోజూ మధ్యాహ్నం 12-1గంటల మధ్య విధిగా స్నానం చేయాలి. ఆ సమయంలో సకల దేవతలు ఆ ఘాట్లో ఉంటారని పురాణ వచనం. పితృకార్యం చేసేటప్పుడు శిరోముండనం మగవారికి తప్పనిసరి.
ప్రయాగ క్షేత్రంలో ముత్తైదువులు మాత్రమే వేణీదానం చేయాలి అంటే ఒక్క మూడంగులాల జుట్టు మాత్రమే తీయించుకోవాలి. ఎన్నిసార్లు వెళ్ళినా ఒక్కసారి మాత్రమే వేణీదానం చేయాలి. ప్రతీసారీ చేయరాదు.
ఆయతన యాత్ర
నంది పురాణంలో ఈ యాత్ర గురించి ఉంది. మణికర్ణికలో స్నానం చేసి, విశ్వేశ్వర దర్శనం చేసి పూజించాలి. మళ్ళీ మణికర్ణికలోనే ఉన్న చక్రతీర్ధం లో, అంటే మణికర్ణికా కుండంలో స్నానం చేయాలి. మళ్ళీ విశ్వనాధ దర్శనం చేయటాన్ని ఆయతనయాత్ర అంటారు. ఇలా చేస్తే బ్రహ్మ లోక ప్రాప్తి కలుగుతుంది. ద్వి ఆయతన ప్రాప్తి అంటే, పైన చెప్పినవి రెండేసి సార్లు చెయ్యటమే.
త్రిరాయతన, చతురాయతన, పంచాయతన యాత్ర
అవి ముక్తేశ్వర, స్వర్లీనేశ్వర,
మధ్యమేశ్వర లింగాలను మూడింటిని దర్శించి, పూజించటమే, ఈ యాత్ర. శైలేశ్వర, సంగమేశ్వర, స్వర్లీనేశ్వర, మధ్యమేశ్వర లింగాలను నాలుగింటిని దర్శించటమే అది.
ఈ రెండు యాత్రాల్ని లింగపురాణం చెప్పింది. కృత్తివాశేశ్వర మధ్యమేశ్వర, ఓంకారేశ్వర, కపర్దీశ్వర, విశ్వేశ్వర లింగ దర్శనమే, పంచాయతన యాత్ర. ఈ యాత్రలన్నీ సర్వసిద్ధిప్రదం.
ఋతు యాత్ర
వసంత ఋతువు అంటే చైత్ర-వైశాఖ మాసాలలో, చౌక్ ఘాట్ లో ఉన్న మధురాపురి యాత్ర చేయాలి. దీన్నే అలయర్‌పురా అంటారు. ఇది ఉత్తరార్క్ నుండి, వరుణా తీరం మార్గం లో ఉంది.
గ్రీష్మ ఋతువులో అంటే, జ్యేష్ట ,ఆషాఢ మాసాలలో, అయోధ్యా పూరీ యాత్ర చేయాలి. పంచక్రోశ యాత్రలో కనిపించే రామేశ్వరమే ఇది.
వర్షఋతువులో అంటే శ్రావణ-భాద్రపద మాసాలలో, సంఖూ దారా వద్ద ఉన్న, ద్వారకాపూరీ యాత్ర, చేయాలి.
శరదృతువులో అంటే, ఆశ్వయుజ కార్తిక మాసాలలో, – పంచ గంగా ప్రాంతంలోనీ పంచగంగా స్నానం చేయటాన్ని, కాంచీ పూరీ యాత్ర అంటారు.
హేమంత ఋతువు అంటే, మార్గ శిర-పుష్య మాసాలలో, అవంతికా పుర యాత్ర చేయాలి. ఇది వృద్ధ కాళేశ్వరం నుండి, కృత్తివాసేశ్వరుని వరకు ప్రయాణం చేసి దర్శించటమే.
శిశిర రుతువు – అంటే మాఘ-ఫాల్గుణ మాసాలలో, మాయా పూరీ యాత్ర చేయాలి. ఇది అస్సీ సంగమంలో ఉంది.
చివరలో లలితా ఘాట్ లో స్నానం. అంటే ఒకే ఏడాదిలో ఈ ఋతు దర్శనాన్ని ముగించాలి. దీనికే ‘’సప్తరి యాత్ర ‘’అని కూడా అంటారు
మాస యాత్ర
చైత్రమాసంలో కామకుండంలో స్నానించి, కామేశ్వర పూజ చేయాలి. ఇప్పుడిది లేదు. వైశాఖంలో విమలకుండస్నానం విమలేశ్వర పూజా. ఇదీ ఇప్పుడు అలభ్యo. జ్యేష్టం లో రుద్రావాస తీర్ధ స్నానం, రుద్రా వాసేశ్వర పూజ, రుద్రా వాసేశ్వరుడిని దశాశ్వమేధ ఘాట్ లో దర్శించవచ్చు. ఈ మూడు నెలల్లో ముప్పది మూడు కోట్ల దేవతలు స్నానం చేశారని, పురాణ లిఖితం. ఆషాఢంలో లక్ష్మీ కుండ స్నానం, లక్ష్మీ దేవి దర్శనం, గంధర్వులు పదే పదే చేసే యాత్ర ఇది. శ్రావణం లో కామాక్షీ కుండస్నానం, కామాక్షీ దేవి దర్శనం. భాద్రపదంలో కపాల విమోచన తీర్ధ స్నానం కుల స్తంభ దర్శనం. ఇది కిన్నరులు ఎక్కువగా ఇష్టపడే యాత్ర . ఆశ్వయుజ మాసంలో మార్కండేయ తీర్ధస్నానం మార్కండేయేశ్వర దర్శనం. జ్ఞానవాపి దగ్గర ఉంది. కార్తీకం లో పంచగంగా ఘాట్ స్నానం, బిందుమాధవ దర్శనం. మార్గశిరంలో పిశాచ విమోచన తీర్ధ స్నానం, కపర్దీశ్వర స్వామి దర్శనం. విద్యాధరులకీ యాత్ర మహాప్రీతి. పుష్యంలో ధనదకుండ స్నానం, ధనదేశ్వర దర్శనం, దేవతలకు ఇష్టమైన యాత్ర ఇది. ఇప్పుడీ కుండం లేదు. ధనదేశ్వరుడు అన్నపూర్ణా మందిరంలో ఒక మూల ఉంటాడు. మాఘంలో కోటి తీర్ధ స్నానం, కోటీశ్వర స్వామి సందర్శనం. ఈ తీర్ధం గుప్తం. సాఖీ వినాయకస్తానం లో ఉందని అంటారు. ఫాల్గుణ మాసంలో గోకర్ణంలో స్నానం, గోకర్ణేశ్వర స్వామి దర్శనం చేస్తే, మాస యాత్ర పూర్తి అయి నట్లే .
మరి కొన్ని విశేషాలు
జ్యేష్ట శుక్ల పక్షంలో దశాశ్వ మేధ ఘాట్ లో స్నానం విశేష ఫలం ఇస్తుంది . శ్రావణం లో శుక్లపక్షం పది;హేను రోజుల్లో దుర్గాకుండ స్నానం దుర్గాదేవి దర్శనం విశేషం. ఆశ్వయుజం లో కృష్ణ పక్షంలో గంగాజీ ఘాట్ లో తర్పణ శ్రాద్ధాలు విశేష ఫలితాలనిస్తాయి. కార్తీకంలో పూర్ణిమ వరకు ఆది మంగళ వారాలు కాక మిగిలిన రోజుల్లో కాశిలో ఉసిరి చెట్టును పూజించాలి. దానాలు, భోజనాలు శ్రేష్టం. మాఘంలో శుక్ల పక్షంలో వ్యాస పురిలోని, వేద వ్యాస ; లింగదర్శనం అతి ముఖ్యం .భాద్రపదంలో కృష్ణపక్షంలో దశాశ్వమేధ ఘాట్లో పిండ ప్రదానం, తర్పణాలు విశేష ఫలప్రదం
సర్వేజనాః సుఖినోభవంతు
నవ గ్రహముల జననము
1) సూర్యుడు :
శ్రీ కశ్యప మహర్షికి దక్షుని పుత్రికయగు అదితికిని "వివస్వంతుడు (సూర్యుడు)" జన్మెంచెను
ప్రభవ నామ సంవత్సర మాఘ మాస శుద్ద సప్తమి)
కశ్యపుని కొడుకు కనుక "కాశ్యపుడు" అని అదితి కొడుకు కనుక "ఆదిత్యుడు" అని
అండమున మృతము లేనివాడు కనుక "మార్తాండుడు" అని నామములు వచ్చెను
సూర్యునకు సంజ్ఞాదేవికిని "వైవస్వతుడు" "యముడు" "యమున" లు జన్మించెను
సూర్యుని తీక్షతను భరించలేక సంజ్ఞాదేవి తన నీడను (ఛాయను) తనకు బదులుగా వెల్లి పుట్టింటికి వెల్లిపోయెను
తరువాత ఛాయకు "శని" భగవానుడు జన్మించెను
యముడు ధర్మరాజు అను నామముతో పితృలోకపాలకుడయ్యెను శని గ్రహ పదవిని పొందెను
వైవస్వతుడు రాబోవు మన్వంతరాలలో మనువు కాగలడు
2) చంద్రుడు :
అత్రి మహర్షి అనసూయల సంతానం
అత్రి మహర్షి తపస్సు చేయుచుండగా అతని వీర్యము భూమిపై పడెను సోమరూపైన వీర్యమును బ్రహ్మ లోక హితార్థమై తన రథమెక్కించుకొని భూమి చుట్టు ఇరవైఒక్క మారలు ప్రదక్షిణలు గావించెను ఆయన తేజస్సుచే జగదాధారభూతములైన సర్వౌషదులు మొలకెత్తెను
(నందన నామ సంవత్సర కార్తీక శుద్ద చతుర్థశి)
సోముని బ్రహ్మ భూమికి రాజును చేసెను
చంద్రుని పుత్రుడు బుధుడు
3) కుజుడు :
శివుని నిండి వెలువడిన తేజము పార్వతీ దేవి గ్రహించి గర్భవతి అవగా ఆమే అఆ తేజమును భరింపలేక భూదేవికి ఇచ్చెను ఆమే ఆ తేజమును ధరింపగా "కుజుడు"(అంగారకుడు) జన్మించెను
(అక్షయ నామ సంవత్సరం వైశాఖ బహుళ విదియ)
రుద్రుని తేజము విష్ణువు సంరక్షణ భూదేవి ఓర్పు లభించినవాడు కనుక గ్రహమండలమున స్థానమునొందెను
(4) బుధుడు :
సోమునకును రోహిని తారకు బుదుడు జన్మించెను
(సౌమ్య నామ సంవత్సరం భాద్రపద శుద్ద ఏకాదశి)
బుదునికి వైరజకిని పురూరవుడు జన్మించెను
5) బృహస్పతి :
సురూప ఆంగీరసులకు "బృహస్పతి" జన్మించెను
(సౌమ్య నామ సంవత్సరం ఆశ్వీయుజ శుద్ద ద్వాదశి)
ఇతని భార్య "తారాదేవి"ఇతడిని దేవతలకు గురువుని చేసెను కనుక ఇతడిని
"గురుడు" అనెదరు
6) శుక్రుడు :
భృగు ప్రజాపతికిని ఉషనలకు సంతానం
\"ఉశనుడు" జన్మించెను
(మన్మథ నామ సంవత్సరం శ్రావణ శుద్ద దశమి)
కుచేలుని ధనమును హరించుటచే పరమేశ్వరుడు కోపించి అతడిని చంపుటకు రాగా ఉశనుడు తన యోగ శక్తితో శివుని ఉదరమున ప్రవేశించెను
పరమేశ్వరుడు అతడినొ శిశ్నము ద్వార బయటకు విడిచెను అతడు శుక్రము రూపమున విసర్జింపబడెను కనుక అతడిని "శుక్రుడు" అనెదరు
అత్యంత మహా మంత్ర శక్తిని పోందినవాడు కనుక రాక్షసులు శుక్రుడిని వారి గురువుగా పొందిరి
నాటి నుండి "శుక్రచార్యునిగా" పెరుపొందెను
గ్రహమండలమున స్థానంపొందెను
7) శని :
సూర్యునికి ఛాయ దేవికిని కలిగిన సంతానమే "శని" ఇతని వృత్తాంతంము సూర్యుని వృత్తాంతమునందు చెప్పబడెను
(వికారి నామ సంవత్సరం మార్గశిర కృష్ణ నవమి)
ఇతడు మానవ జీవితాలలో అత్యంత ప్రభావము చూపువాడు
త్రిమూర్తుల సైతం ముప్పుతిప్పలు పెట్టినటువంటివాడు
గ్రహమండలమున స్థానం పొందెను
8) రాహువు :
కశ్యప మహర్షికి సింహికకును "రాహువు" జన్మించెను
ఇతడు రాక్షల లక్షణములు కలవాడు కనుక రాక్షసునిగా పరిగణిస్తారు
(రాక్షస నామ సంవత్సరం కృష్ణ చతుర్థశి)
క్షీర సాగర మథనంలొ లబించిన అమృతాన్ని మహావిష్ణువు "మోహిని"అను రూపముతో పంచుతున్నపుడు రాహువు దేవతల రూపం దాల్చి అమృతమును గ్రహించెను సూర్యచంద్రులు చూసి విష్ణువుకి చెప్పగా తన చక్రముతో రాహువు తల ఖండించెను అమృత ప్రభావంతో తల మొండెము జీవముతో ఉండుటచేత పాము శరీరం అతకబడింది
9) కేతువు :
విష్ణువుచే ఖండింపబడిన రాహువు శరీరముకు పాము తల తగిలించి కేతువు అని నామం పెట్టిరి
ఇతని భార్య పేరు చిత్రలేఖ
రాహు కేతువులు ఇరువురు గ్రహమండలమున ఛాయగ్రహములుగా గుర్తింపునొందిరి...
నవ గ్రహ దేవతల జన్మ వృత్తాంతములు చదివిన ఆపదలు తొలిగి మహా యశస్సు పొందెదరు
ఆయుష్యు ఆరోగ్యం సంకల్ప సాఫల్యము కలుగును
నవ గ్రహముల అనుగ్రహము కలిగి సర్వత్రా శుభమగును.
(అని బ్రహ్మ పురాణమందు చెప్పబడెను).
మంత్రపుష్పం అంటే ఏమిటి? దాని విశేషమేమిటి?
జ : సాధారణంగా పుష్పం అనేదానిని పూజలో ఉపయోగించినప్పుడు ఈశ్వరుడు మనకు చెవులు ఇచ్చినందుకు ఆయనకు మనం చెప్పే కృతజ్ఞతకు సాధనంగా వాడతాం. కన్ను ఇచ్చాడు కాబట్టి కృతజ్ఞతగా దీపం పెడతాం. నాలుక ఇచ్చి రుచి చూసే శక్తి ఇచ్చాడు కాబట్టి నైవేద్యం పెడతాం. స్పర్శ ఇచ్చాడు కాబట్టి చందనాన్ని అనులేపనం చేస్తాం. పంచేంద్రియములు ఒక్కొక్క డానికి ఒక్కొక్క శక్తి ఉంటుంది. వాసన చూసే అధికారం ఇచ్చాడు ముక్కుతో. ధూపం వేస్తాం. చెవులు ఇచ్చాడు. ఎన్నో ఉపకారాలు పొందుతున్నావు. అందుకని పువ్వులతో పూజ చేస్తున్నావు. వినడానికి పువ్వుకు సంబంధం ఏమిటి అంటే తుమ్మెదల యొక్క ధ్వనులన్నీ పువ్వుల కోసం. పువ్వు దగ్గరికి వెళ్ళి తేనే తాగేటప్పుడు ధ్వనులన్నీ ఆగిపోయాయి. కాబట్టి ధ్వనులు చెవుల ద్వారా వింటున్నాం కాబట్టి డానికి కృతజ్ఞతగా పువ్వులు వాడతాం. అంతేకాదు పువ్వు జ్ఞానమునకు గుర్తు. జ్ఞానం కలిగితే వికసనం కలుగుతుంది. బుద్ధి వికసిస్తుంది జ్ఞానము చేత. అందుకే పూజ చేసేటప్పుడు పువ్వు. చిట్టచివర చేతిలో పువ్వులు పట్టుకుని లేచి నిలబడతాం. పూజ చేసేటప్పుడు కూర్చుంటాం. అసలు రహస్యం తెలుసుకునేటప్పుడు లేచి నిలబడతాం. అప్పుడు చేతిలో పట్టుకున్న పువ్వులను మంత్రపుష్పం అంటారు. అంటే మంత్రం అనే పుష్పం ద్వారా అందుతున్న జ్ఞానాన్ని లోపలికి తీసుకో. లోపలికి పుచ్చుకున్నాను అనుభవంలోకి వచ్చేటట్లు చేయమని అడగడానికి పువ్వు ఈశ్వరుడి పాదం మీద పెట్టు. అది మంత్రపుష్పం. మంత్రపుష్పంలో ప్రారంభం చేస్తూనే ఒక మాట చెప్తాం – ‘ నాన్యః పంథాయనాయ విద్యతే’ – ఈశ్వరుడిని తెలుసుకోవడానికి ఇంకొక మార్గం లేదు. నీ ఎదురుగుండా పెట్టి నువ్వు ఇప్పటివరకూ ఎవరిని పూజ చేశావో అసలు వాడు ఎక్కడ ఉంటాడో నువ్వు తెలుసుకుంటే అది ఒక్కటే వాడిని తెలుసుకొనే మార్గం. ఎక్కడ ఉన్నాడు అంటే ‘హృదయం చాప్యధోముఖం’ – యోగవిద్యను కలిగిన వాడు తెలుసుకుంటాడు. వంగిన తామర మొగ్గ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అది ‘నాభ్యాం ఉపతిష్టతి’ – చిటికెన వ్రేలు బొడ్డులో పెట్టుకుని బొటనవ్రేలు పైకి పెడితే బొటనవ్రేలు ఎక్కడ తగులుతుందో ఆ వంగిన మొగ్గ అక్కడికి వస్తుంది. దాని చివర ఒక చిన్న బిందువు ఉంటుంది. ‘నీవార సూకవత్తన్వీ పీతాభా స్వస్త్యణూపమా’ ‘తస్య మధ్యే – మధ్యలో ఒక చిన్న ప్రకాశం వెలిగిపోతూ ఉంటుంది. ఆ కాంతి, ఆ వెలుగు ‘ఊర్ధ్వ మూల మధశ్శాయీ’ – దానికాంతి పైకి కొడుతోంది, క్రిందకి కొడుతోంది, ప్రక్కకు కొడుతోంది. ఆ కాంతి ఏదో అది జీవుడు. ‘స బ్రహ్మః స శివః స హరిః సేంద్రః సోక్షరః పరమః స్వరాట్’ – ఏ పేరు పెట్టి పిలు అభ్యంతరం లేదు. కానీ ఆ వెలుగు ఉన్నదే అది పరమాత్మ. అది ఎక్కడ ఉంది? – అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభా’. కాబట్టి నిజంగా ఈశ్వరుడిని చూడాలంటే కళ్ళు తెరిస్తే కనబడడం కాదు. కళ్ళు మూతలుపడి అంతర్ముఖత్వంతో లోపలికి ధ్యానంలో ప్రయాణం చేస్తే వెలుగులకు వెలుగైన వెలుగు కనబడుతుంది. వాడు ఈశ్వరుడు. వాడు సమస్త ప్రాణికోటియందు హృదయ క్షేత్రంలో వెలుగుతున్నాడు. కాబట్టే ఆ తొడుగుకు ఆకలి వేస్తోంది, నిద్రవస్తోంది. అది లేనినాడు ఆ తొడుగు శవం. అది ఉన్ననాడు ఆ తొడుగు శివం. ఆకలి దానివల్లనే వస్తోంది, ఆకలి తీరింది అని దానివల్లే తెలుసుకుంటోంది. జ్ఞాని ఎలా చూస్తాడంటే తనలో ఉన్నవాడిని చూస్తూ ఉంటాడు తప్ప ఆయనకు నామరూపాలు కాదు. లోపల ఉన్నది అన్నింటిలో నేనే. తెలిసో తెలియకో ఎక్కడ ఉన్నాడు అని శాస్త్రాలు చెప్పాయో అక్కడే చూపిస్తాడు ‘నేను’ అని. అంటే ఎవరు ఆ నేను? – భగవంతుడు. ఆ ‘నేను’ అక్కడా ఉంది. ‘నేను’ ‘నువ్వు’ – ఈ ‘నేను’కి, ‘నువ్వు’కి మధ్య స్వార్థం అంతా వస్తుంది. ‘నువ్వు’ పాడైపోయినా పర్లేదు, ‘నేను’బాగుండాలి. కానీ ఇందులో ‘నేను’ అందులో ‘నేను’ ఒక్కటే – జ్ఞానం. ఇక తరతమాలు లేవు, బేధాలు లేవు, అంతటా ఉన్నది పరబ్రహ్మమే. అప్పుడు బ్రహ్మ సత్యం, జగన్మిథ్య. ఉన్నది ఒక్కటే అది ఎరుకలోకి వచ్చింది. అద్వితీయం – రెండవది లేదు. అద్వైతం – రెండు కానిది. ఒక్కటే. ఒక్కటి అంటే అది ఒకటి ఇది ఒకటి అని అంటారేమో అని రెండు కానిది అన్నారు. ఆ అద్వితీయానుభూతిలోకి వెళ్ళడానికి ఇది ఒక్కటే సాధనం. అందుకు అది మంత్రపుష్పం. అది మననాత్ త్రాయతే’ ఎంత ఆలోచించి సాధనలోకి తెచ్చుకుంటావో అంత గొప్పగా అద్వైతానుభూతిలో నిన్ను పెట్టగలదు. అందుకని పూజయందు చివరి భాగమై జ్ఞాన కటాక్షమై మంత్రపుష్పం అయింది. ఇది నా అంత నేను నిలబడితే రాదు, భగవంతుని అనుగ్రహం ఉంటే వస్తుంది. కాబట్టి ఆ వికసనాన్ని నాకు ఇవ్వు అని విన్నదానిని పట్టుకుని ప్రయత్నం కోసం, అనుగ్రహం కోసం అడగడం ఆ పువ్వు భగవంతునికే సమర్పించి నమస్కరించడం. అందుకే పూజ చివరలో మంత్రపుష్పం. పూజ అంతర్భాగంలో పుష్పార్చన.
*నిరంతర భగవన్నామ స్మరణమే*ఆధ్యాత్మిక జీవితానికి* *బంగారుబాట
*ప్రపంచంలో వెలకట్టలేని సంపదలు రెండే రెండు*
*ఒకటి మనశ్శాంతి.* *రెండు సంతృప్తి.*
*ఈ రెండింటిని సంపాదించుకున్న వాళ్ళు ప్రతి క్షణం అఖండమైన ఆనందాన్ని అనుభవిస్తారు.*సంపాదించుకోవటానికి కష్టపడక్కర్లేదు. ఎంతో ఆనందంగా సంపాదించుకోవచ్చు* *కులదైవ(ఇలువేలుపు) నామ స్మరణ చేస్తే చాలు.ఆ వెలకట్టలేని రెండు సంపదలనూ ఇస్తాడు.* *ఆధ్యాత్మికత అనే సరస్సులో నామం అనే రాయి వేసి శబ్దం చేస్తే తరంగాలు మొదలవుతాయి.* *అవి మనసంతా వ్యాపించి శరీరమంతా నిండిపోతాయి.* ఏ నామాన్నయితే మనం స్మరిస్తున్నామో ఆ దేవుడికి సంబంధించిన రూపాన్ని మన మదిలో నిలుపుతాయి.*నామం ఆధ్యాత్మిక శబ్ద తరంగం.*
*”బెల్లం బెల్లం”అంటే బెల్లం రుచి మనకు తెలియదు.*”తేనె తేనె” అంటే కూడా తేనె రుచి
మనకు తెలియదు.* *బెల్లాన్ని కొరికి తినాలి.**తేనెను నోటిలో వేసుకొని చప్పరించాలి.*అప్పుడే ఆ మాధుర్యం మనకు అనుభవమవుతుంది.*
*దైవనామం, దైవం వేరు కాదు.*ఆ పేరు స్మరించగానే అతడు మన దగ్గరుంటాడు.ఇది అనుభవైకవేద్యం.*
*నామం చెబుతాం. శబ్దం వినిపిస్తుంది. మన రూపంలాగా రూపం కనిపించదు.**ఎంతకాలం నిరీక్షించాలి.* *ఎప్పుడు భగవంతుడు కనిపిస్తాడని సందేహం.**అందుకే కొంతకాలం నామస్మరణ చేసి విసిగిపోయి విడిచి పెట్టేస్తారు.* *అక్కడే మనం నిలబడాలి.దైవం ఒక అనుభవం.**ఇనుపముక్కను బాగా కాలిస్తే అందులోకి ఉష్ణం వ్యాపిస్తుంది.ఆ ఉష్ణం ఇనుపముక్క ఎంతవరకు విస్తరించి ఉందో అంతవరకు వ్యాపిస్తుంది.* *అందులో వేడి కనిపించకపోవచ్చు.**ముట్టుకుంటే చుర్రుమనిపిస్తుంది.* *నామస్మరణతో మనసును పదేపదే భక్తిపూర్వకంగా సాధనలో ఉంచుతుంటే దేహమంతా ఆధ్యాత్మిక తరంగ ప్రవాహంగా మారిపోతుంది.*
*నామస్మరణ చేయగా చేయగా వెదురు ముక్క లాంటి శరీరం వేణువవుతుంది.బృందావనంలో శ్రీకృష్ణుడు ఆలపించిన నాదమవుతుంది.ముల్లోకాలూ తిరిగి ‘నారాయణా! నారాయణా!’ అని స్మరించే నారదుడి చేతిలో తంబుర అవుతుంది.**భక్తి-ప్రేమలను నింపి చేసే నామస్మరణకు మించిన యోగం లేదు.పూర్వజన్మ పుణ్యంవల్లనే ఆ భాగ్యం కలుగుతుంది.*
*దాన్ని దక్కించుకున్నవారు తుకారాం, త్యాగయ్య, అన్నమయ్య, రామదాసు, ప్రహ్లాదుడు లాంటి భక్తులు. వారే సజీవ సాక్ష్యంగా కాలంలో నిలిచి నామ మాహాత్మ్యాన్ని విశ్వానికి చాటారు.*
*పురాణాల్లో శాస్త్రాల్లో చదివాము ఆ మహానుభావుల గురించి.* *మనం కూడా అనుభవంలోకి తెచ్చుకోవచ్చు* *అందుకు సాధనయే తరుణోపాయం*
*పూజ కోసం సామగ్రి కొనాలి.**ఎన్నోకొన్ని నియమాలు పాటించాలి. వ్రతాలకు, నోములకు అయితే కఠోర నియమాలుంటాయి.యజ్ఞాలకు, క్రతువులకు శక్తియుక్తులుండాలి. శాస్త్రం తెలిసి ఉండాలి. దోష రహితంగా చెయ్యాలి.*
*అందుకే కలియుగంలో నామస్మరణను మించింది లేదని చెప్పారు.* *ఎక్కడ ఉన్నా ఏ పని చేస్తున్నా మనసును లగ్నం చేసి నామం స్మరించుకోవచ్చు.**పనికి ముందు, పనిచేసుకుంటూ నామస్మరణ, పని తరవాత మళ్ళీ నామస్మరణ చేస్తూ ఉంటే ఆ చేసే పని పవిత్రమవుతుంది.అందులోని దోషాలు హరించిపోతాయి.*
*ఆ విధంగా చేసే కర్మ భగవదర్పణ కర్మ అవుతుందని భగవద్గీత చెబుతోంది.*
*ఎవరి పేరు వాళ్లకు ఇష్టం.* *మనందరికీ మనల్ని సృష్టించినవాడి పేరు ఎందుకు ఇష్టంగా ఉండదు? తప్పక ఉంటుంది.* *భయంలో, బాధలో, సుఖంలో, సంతోషంలో పాలలో తేనెను కలుపుకొన్నట్లు జీవితంలో నామాన్ని కలుపుకోవాలి.*
*దైవం ఎప్పుడూ మనతో కలవడానికి త్వరపడుతూనే ఉంటాడు. నామస్మరణ ఈ రోజు మొదలుపెడితే ఇప్పుడే ఆయన మనకు చేరువవుతాడు.*
*సందేహమే లేదు.*
🌺 *నిరంతర భగవన్నామ స్మరణమే*ఆధ్యాత్మిక జీవితానికి* *బంగారుబాట.*
*శంఖం*
*శం* అంటే మంచి అని... *ఖం* అనగా జలం అని అర్థం.
క్షీరసాగర మధన సమయంలో దేవతలకు వచ్చిన 14 రత్నాలలో *శంఖం* ఒకటి.
*విష్ణుపురాణం ప్రకారం లక్ష్మి సముద్రతనయ*
*శంఖం లక్ష్మికి సోదరి, సోదరుడు కూడాను*
శివుడు, మహావిష్ణువు, శ్రీకృష్ణుడు మొదలైన దేవుళ్ళ చేతిలో శంఖం వుంటుంది.
యుద్ధ భేరి మ్రోగించడానికి, ఏదైనా సందేశం చెప్పడానికి *శంఖాన్ని* వాడుతారు. ఈ *శంఖానాథాన్ని* శుభ సూచకంగా భావిస్తారు.
*శంఖాన్ని* చెవి దగ్గర పెట్టుకుంటే ఓక విధమైన శబ్దం వస్తుంది. *శంఖం సంపదలకు ప్రతీక*
*శంఖాన్ని* పూజా గది యందు వుంచినట్లు అయితే అన్ని అరిష్టాలు మాయమైపోతాయి. సౌభాగ్యాల పంట దక్కుతుంది అని అంటారు.
*శంఖాలలో రకాలు*
దక్షిణావృత శంఖం* *మధ్యావృత శంఖం* *ఉత్తరావృతవ శంఖం*
*దక్షిణావృత శంఖాలను పూజకు మాత్రమే ఉపయోగిస్తారు. ఉత్తరావృతాన్ని ఊదుటకు ఉపయోగిస్తారు* . *శంఖాల పేర్లు*
1. లక్ష్మీ శంఖం, 2. గోముఖ శంఖం, 3. కామధేను శంఖం, 4. దేవ శంఖం, 5. సుఘోష శంఖం, 6. గరుడ శంఖం, 7. మణిపుష్పక శంఖం, 8. రాక్షస శంఖం, 9. శని శంఖం, 10. రాహు శంఖం, 11. కేతు శంఖం, 12. కూర్మ శంఖం.
*శంఖం ఉపయోగాలు*
*శంఖ ధ్వని విజయానికి, సమృద్ధికి, సుఖానికి, కీర్తి ప్రతిష్ఠలకు, లక్ష్మి ఆగమనానికి ప్రతీక* శంఖాన్ని శివపూజకు, పూజలో హారతి ఇచ్చేటప్పుడు, ధార్మిక ఉత్సవాలలో యజ్ఞాలలో రాజ్యాభిషేకాలకు, శుభ సందర్భాలలోనూ, పితృదేవతలకు తర్పణాలు ఇచ్చేటప్పుడు, దీపావళి, హోళి, మహాశివరాత్రి, విశిష్టమైన కర్మకాండలలో శంఖాన్ని స్థాపించి పూజిస్తారు
శుభాలను అందించే శంఖం*
పూజా మందిరంలో దక్షిణావర్త శంఖం ఉంచుకుంటే సకల శుభాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ *శంఖం* ఉన్న చోట *శ్రీమహాలక్ష్మి* కొలువై ఉంటుందని శాస్త్రం. అదే విధంగా *శంఖంలో పోసిన తీర్థాన్ని స్వీకరించడం వల్ల వ్యాధి బాధలు కూడా నశిస్తాయి*
*ఫలితాలు*
శంఖాన్ని ఊదినట్లయితే ప్రాణాయామం చేసినంత వ్యాయామం శరీరానికి కలుగుతుంది. శంఖాన్ని ఊదితే గుండె ఆరోగ్యం బాగుంటుంది. ఊపిరితిత్తుల పనితీరు, శ్వాసక్రియ బాగుంటుంది.
*శ్రీ కృష్ణ పరమాత్మ ధరించిన శంఖం పాంచజన్యం* . *పాంచజన్యం యొక్క విశిష్టత*
పాంచజన్యం శంఖంలో మరో నాలుగు శంఖాలుంటాయి.పాంచజన్యం పురుష శంఖం. ఇది దొరుకుట కష్టం.
వేయి శంఖాలలో ఒకటి మాత్రమే దక్షిణావర్త శంఖం ఉద్భవిస్తుంది. వాటిలో ఒకటి *గోమడి శంఖం*
నూరు లక్షల శంఖాలలో ఒక శంఖం *పాంచజన్యం* శంఖంగా ఆవిర్భవిస్తుంది.
అటువంటి శంఖాన్ని దర్శించడమే పరమ పవిత్రమని పురాణాలు తెలుపుతున్నాయి.
ఇలాంటి *పాంచజన్యం శంఖం* మైసూర్ లోని చాముండేశ్వరీ దేవి ఆలయంలో ఉన్నది.
ఈ శంఖాన్ని మైసూర్ సంస్థానాధీశులు *చాముండేశ్వేరీ దేవి* అమ్మవారికి కానుకగా సమర్పించారు.
అమ్మవారి ఆరాధనోత్సవాలలో ఈ విశేష *పాంచజన్యం శంఖాన్ని* ఉపయోగిస్తారు.
*మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధంలో వివిధ యోధులు పూరించిన శంఖాల పేర్లు ఇలా ఉన్నాయి*
శ్రీకృష్ణుడు... *పాంచజన్యం*అర్జునుడు... *దేవదత్తం*భీముడు... *పౌంఢ్రకం* యుధిష్ఠిరుడు... *అనంత విజయ*\నకులుడు... *సుఘోష*సహదేవుడు... *మణిపుష్పక*కాశీరాజు... *శిఖండి*దృష్టద్యుమ్నుడు, విరాటుడు... *స్వాతిక*
*శంఖం ప్రాశస్త్యం*
శంఖే చంద్ర మావాహయామి కుక్షే వరుణ మావాహయామి మూలే పృధ్వీ మావాహయామి
ధారాయాం సర్వతీర్థ మావాహయామి
ఈ శంఖాలు మానససరోవర్, లక్షద్వీప్, కోరమండల్, శ్రీలంక, భారతదేశంలోను లభిస్తున్నాయి.
అమ్మలగన్నయమ్మ !!!
బెజవాడ ఆలయంలో రాజద్వారంపై ఉండే
ఈ పద్యం గురించి మీకు తెలుసా.........!!
అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ
చాల బెద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ దన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ దుర్గ, మాయమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్ !!
విజయవాడ కనకదుర్గమ్మ తల్లి కోవెలలో ఇప్పటికీ రాజద్వారం మీద ఈ పద్యం రాసి ఉంటుంది. ఈ పద్యం పైకి ఒకలా కనపడుతుంది. మీరు తెలిసికాని, తెలియకకాని పోతనగారు వ్రాసిన పద్యములు కొన్ని నోటికి వచ్చినవి మీరు చదివినట్లయితే అవి సత్ఫలితాన్ని ఇచ్చేస్తాయి. ఎందుకు అంటే మీరు కొన్ని కొన్ని చదవకూడదు. కొన్ని కొన్ని చేయకూడదు. పక్కన గురువు వుంటే తప్ప మేరువుని, శ్రీచక్రమును ఇంట్లోపెట్టి పూజ చెయ్యలేరు. అది మనవల్ల కాదు. మీరు బీజాక్షరములను ఉపాసన చెయ్యలేరు. అది కష్టం. కానీ పోతనగారు ఈ దేశమునకు బహూకరించిన గొప్ప కానుక ఆయన రచించిన భాగవత పద్యములు.
అమ్మలనుకన్న దేవతా స్త్రీలయిన వారి మనస్సులయందు ఏ అమ్మవారు ఉన్నదో అటువంటి అమ్మని మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ ఈ నాలుగింటికోసము నమస్కరిస్తున్నాను. అటువంటి దుర్గమ్మ మాయమ్మ. ఇవీ ఆయన ఈ పద్యంలో చెప్పిన విషయములు, మీరు చెయ్యలేని ఒక చాలా కష్టమయిన పనిని పోతనగారు చాలా తేలికగా మీకు ప్రమాదం లేని రీతిలో మీతో చేయించేయడానికని ఇటువంటి ప్రయోగం చేశారు.
*అమ్మలగన్నయమ్మ* అమ్మలని చెప్పబడ్డవారు ఎవరు? మనకి లలితాసహస్రం *శ్రీమాతా* అనే నామంతో ప్రారంభమవుతుంది. 'శ్రీమాతా’ అంటే 'శ’కార 'ర’కార 'ఈ’కారముల చేత సత్వరజస్తమోగుణాధీశులయిన బ్రహ్మశక్తి, విష్ణుశక్తి రుద్రశక్తులయిన రుద్రాణి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి ఈ ముగ్గురికీ అమ్మ ఈ మూడు శక్తులను త్రిమూర్తులకు ఇచ్చినటువంటి పెద్దమ్మ అమ్మ ఎవరు వున్నదో ఆయమ్మ అంటే 'లలితాపరాభట్టారికా స్వరూపం’ ఆ అమ్మవారికీ దుర్గాస్వరూపమునకు భేదం లేదు అందుకని 'అమ్మలగన్నయమ్మ’ 'ముగ్గురమ్మల మూలపుటమ్మ’ ఆ ముగ్గురు అమ్మలే మనం మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతి స్వరూపములుగా కొలిచే తల్లులు. ఈ ముగురమ్మల మూలపుటమ్మ. 'చాల పెద్దమ్మ’ ఇది చాలా గమ్మత్తయిన మాట. చాల పెద్దమ్మ అనే మాటను సంస్కృతంలోకి తీసుకువెడితే మహాశక్తి అండపిండ బ్రహ్మాండములనంతటా నిండిపోయిన బ్రహ్మాండమయిన శక్తిస్వరూపం. ఈ శక్తి స్వరూపిణి చిన్నపెద్దా భేదంలేకుండా సమస్త జీవరాశులలోను ఇమిడి ఉంది. అలా ఉండడం అనేదే మాతృత్వం. ఇది దయ. దీనిని సౌందర్యం అంటారు. దయకు సౌందర్యం అని పేరు. అది ప్రవహిస్తే సౌందర్యలహరి.
అండపిండ బ్రహ్మాండములనన్నిటినీ నిండిపోయి ఈ భూమిని తిప్పుతూ, లోకములనన్నిటినీ తిప్పుతూ ఇవన్నీ తిరగడానికి కారణమయిన అమ్మవారు ఎవరో ఆ అమ్మ.
'సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ’ సురారి అనగా దేవతలకు శత్రువయిన వాళ్ళ అమ్మ. అనగా దితి. దితి అయ్యో అని ఏడిచేటట్టుగా ఆవిడకు కడుపుశోకమును మిగిల్చింది. అనగా రాక్షసులు నశించడానికి కారణమయిన అమ్మ. దేవతలలో శక్తిగా ఈమె ఉండబట్టే రాక్షసులు మరణించారు.
తన్నులోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ’ ఇదొక గొప్పమాట. అమ్మవారిని మనస్సులో నమ్ముకుని శక్తితో తిరుగుతున్న వారెవరు?
*బ్రాహ్మి, మాహేశ్వరి, వైష్ణవి, మహేంద్ర, చాముండ, కౌమారి, వారాహి, మహాలక్ష్మి*
మనకి సంప్రదాయంలో 'అష్టమాతృకలు’ అని ఉన్నారు. వాళ్ళని మనం ఎనిమిది పేర్లతో పిలుస్తూ ఉంటాము. *బ్రాహ్మి, మహేశ్వరి, వైష్ణవి, మహేంద్రి, చాముండ, కౌమారి, వారాహి, మహాలక్ష్మి*.
ఇలా ఎనమండుగురు దేవతలు ఉన్నారు. వీరిని 'అష్టమాతృకలు’ అని పిలుస్తారు. ఈ అష్టమాతృకలు శ్రీచక్రంలో దేవతలుగా ఉంటారు. వీరు నిరంతరము అమ్మవారిని లోపల కొలుస్తూ, అమ్మవారి వలన శక్తిని పొంది మనని ఉద్ధరిస్తూ ఉంటారు. ఈ ఎనమండుగురునే మనం కొలుస్తూ వుంటాము.
'రక్తాంబరాం రక్తవర్ణాం రక్త సౌభాగ్యసుందరాం వైష్ణవీం శక్తిమద్భుతాం’.
అంటారు దేవీభాగవతంలో వ్యాసభగవానుడు. ఈ ఎనమండుగురికీ శక్తినిచ్చిన అమ్మవారెవరో ఆవిడే వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గమాయమ్మ ఈ దుర్గమ్మ ఉన్నదే లలితాపరాభట్టారిక ఆవిడ లలితా పరాభట్టారిక ఆ అమ్మ మాయమ్మ.
'మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్’ ఇప్పుడు ఆవిడ నాకు దయతో మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదలను ఇవ్వాలి. నాకు అర్హత ఉన్నదని ఇవ్వనక్కరలేదు. దయతో ఇచ్చేయ్యాలి.
అమ్మవారికి 'శాక్తేయప్రణవములు’ అని కొన్ని బీజాక్షరములు ఉన్నాయి. *ఓం ఐం హ్రీం శ్రీ క్లీం సౌః* ఈ ఆరింటిని శాక్తేయ ప్రణవములు అని పిలుస్తారు. దానిని ఎలాబడితే అలా ఉపాసన చెయ్యకూడదు. కాబట్టి బీజాక్షరములను అన్నివేళలా ఉపాసన చేయలేము. కానీ ఇప్పుడు పోతనగారు ఒక గొప్ప ప్రయోగం చేశారు. మహత్వమునకు బీజాక్షరము 'ఓం’, కవిత్వమునకు బీజాక్షరము 'ఐం’, పటుత్వమునకు భువనేశ్వరీ బీజాక్షరము 'హ్రీం', ఆ తర్వాత్ సంపదల్ లక్ష్మీదేవి 'శ్రీం’.
ఇపుడు *'ఓం ఐం హ్రీం శ్రీం’* అమ్మలగన్నయమ్మ *'శ్రీమాత్రేనమః’*.
మీరు బీజాక్షరములతో అస్తమానూ అలా అనడానికి వీలులేదు. కానీ మీరు రైలులో కూర్చున్నా, బస్సులో కూర్చున్నా స్నానం చెయ్యకుండా కూడా ఎక్కడ ఉన్నా కూడా అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ అంటున్నారనుకోండి అపుడు మీరు మరోరూపంలో *'ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రేనమః’* *ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రేనమః* అనేస్తున్నారు.
మీరు అస్తమాననూ అమ్మను తలచుకున్నట్లు అవుతుంది. అపుడు అమ్మవారు చాలా తొందరగా మీకు పలుకుతుంది. అందుకే లలితా సహస్రం 'శ్రీమాతా’ అంటూ అమ్మతనంతో ప్రారంభమవుతుంది.
ఆవిడ రాజరాజేశ్వరి. అయినా ఆవిడముందు అమ్మా అమ్మా అనేసరికి ఆవిడి పొంగిపోతుంది. ఇన్నిమార్లు ఆ పద్యంద్వారా అటూ ఇటూ అమ్మని మీరు పిలుస్తుంటే విసుక్కోవడం చేతకాని దయాస్వరూపిణి అయిన అమ్మ మీకోరికను తీరుస్తుంది. ఇప్పుడు మీరు *'ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః’* అనలేకపోవచ్చు.
కానీ 'అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ' అనడానికి కష్టం ఏమిటి ?
ఈవిధంగా పోతనగారు శ్రీవిద్యా రహస్యములన్నిటిని ఔపోసనపట్టి తెలుగు వారందరికీ ఒక మహత్తరమయిన కానుకను బహూకరించిన మహాపురుషుడు ఆయన ఒక ఋషి. అందుకని ఆ పద్యమును అనుగ్రహించినారు.
ఆ తల్లి అనుగ్రహం అందరికీ లభించాలని ప్రార్థిస్తూ..!
బిల్వపత్రం
బివలన అత్యంత పుణ్యం లభిల్వానాం దర్శనం పుణ్యం! బిల్వపత్ర దర్శనం స్తుంది.
పరమ శివుని పూజించుకునేటప్పుడు మనం "ఏక బిల్వం శివార్పణం" అంటూ మారేడు దళాలను సమర్పించుకుంటూ పూజించుకుంటాము.
ఙ్ఞానస్వరూపమయిన పరమాత్ముడే పరమశివుడు. మనలోని అఙ్ఞానాన్ని రూపుమాపి, ఙ్ఞానజ్యోతిని వెలిగించి, మన మనసులను పవిత్రం చేసి, నిర్మలమైన జీవనాన్ని కలిగించమని, ఙ్ఞానస్వరూపమైన మారేడు దళాలను స్వామికి సమర్పించుకుంటూ ఉంటాము.
మారేడు దళాలను పరిశీలించినప్పుడు మూడు దళాలు కలిసి ఒక్క కాండానికే ఉండాటాన్ని గమనించగలము. అందుకే, దీనికి బిల్వము అనే పేరు వచింది. ఈ మూడు రేకులకు ఆధ్యత్మికంగా పూజకుడు-పూజ్యము- పూజ / స్తోత్రము - స్తుత్యము- స్తుతి/ ఙ్ఞాత - ఙ్ఞ్యేయము - ఙ్ఞానము అనే అర్ధాలను చెబుతున్నారు. ఇలాగ ముడిటిని వేరు వేరుగా భావించటమే త్రిపుటి ఙ్ఞానము. ఒక వృక్షానికి కొమ్మలు వేరు వేరుగా కనిపించి నప్పటికి, ఆధారకాండము ఒకటే అయినట్లు , సృష్టి, స్థిథి, లయ కారకుడైన ఆ మహదేవుడు మారెడు దళాలతో " మూడు పత్రాలుగా వేరు వేరు ఉన్నట్లు గోచరిస్తున్నాడు. కాని ఆయన సర్వాంత్రయామి!
బిల్వపత్ర దర్శనం వలన అత్యంత పుణ్యం లభిస్తుంది. వాటిని స్పృసించడంవలన వలన సర్వ పాపాలు నశిస్తాయి.
ఓక బిల్వ పత్రాన్ని శివునికి భక్తిశ్రద్ధలతో అర్పించతం వలన, ఘోరాతిఘోరమైన పాపాలు సైతం తొలగిపోతూ ఉంటాయి.
అటువంటి త్రిగుణాలుగల బిల్వ దళ్ళాన్ని స్వామికి అర్పించుకుంటే ఆయన అనుగ్రహం సులభంగ కలుగుతుంది.
"పూజకుడవు నీవే ,పూజింబడేది నీవే" - అనే భావంతో శివుని పూజించుతయే ఉత్తమమైన భావం. ఈ ఙ్ఞానరహస్యాన్ని తెలుసుకుని - బిల్వపత్రరూపంతో ' త్రిపుటి ఙ్ఞానాన్ని ' నీ పాదాల చెంత నేను సమర్పిస్తున్నాను అని స్వామికి విన్నపించుకుని " శివోహం, శివోహం " అనే మహావాక్య ఙ్ఞానాన్ని స్థిరపరిచేదే బిల్వార్చన అవుతుంది.
పవిత్రమైన ఈశ్వర పూజకు " బిల్వపత్రం " సర్వశ్రేష్టమైనది. శివార్చన కు మూడు రేకులతోనున్న పూర్తి బిల్వదళాన్ని ఉపయోగించాలి.
బిల్వదళాలు వాడిపోయినప్పటికి పూజర్హత కలిగి ఉంటాయి.
ఏక బిల్వ పత్రంలోని మూడు ఆకులలో ఎడమవైపునున్నది బ్రహ్మ అని, కుడి వైపు ఉన్నది విష్ణువు అని, మధ్యన ఉన్నది శివుడు అని చెప్పబడుతోంది.
ఇంకా బిల్వదళంలోని ముందు భాగం లో అమృతము, వెనుక భాగంలో యక్షులు ఉండటo చేత బిల్వపత్రం యొక్క ముందు భాగాన్ని శివుడి వైపుకు ఉంచి పూజ చెయ్యాలి.
*బిల్వవనం కాశి క్షేత్రంతో సరిసమానం అని శాస్త్రవచనం...*
*మారేడు చెట్ట్లు ఉన్న చోట శివుడు నివసిస్తాడు.*
*ఇంటి ఆవరణ లో,...*
*ఈశన్యభాగంలో మారేడు చెట్టు ఉంటే, ఆపదలు తొలగి, సర్వైశ్వర్యాలు కలుగుతాయి!*
*తూర్పున ఉంటే సుఖప్రాప్తి కలుగుతుంది.*
*పడమర వైపు ఉంటే సుపుత్రసంతాన ప్రాప్తి,*
*దక్షిణ వైపు ఉంటే యమబాధలు ఉండవు*
పంచామృతం అంటే...
హిందూ సంస్కృతి ఆచారాల ప్రకారం.. ఏ శుభకార్యం వచ్చినా.. ఆ కార్యములో పంచామృతం తప్పనిసరిగా ఉపయోగిస్తాము. గుడిలో అభిషేకం చేయవలసి వస్తే.. పంచామృతాలు అక్కడే వుంటాయి. మనం గుడిలోకి దర్శనం కోసం వెళ్లినప్పుడు ప్రసాదంగా కొబ్బరి నీళ్లను ఇస్తారు. వీటితోపాటు మనం పంచామృతాన్ని స్వీకరిస్తాం. పంచామృతంతో అభిషేకం చేయడం వల్ల కొన్ని దోషాలు సవరింపబడతాయని సూచిస్తారు కొందరు జ్యోతిష్యవేత్తలు, పండితులు. దీన్ని బట్టి మనం ఈ పంచామృత ప్రాముఖ్యత ఏంటో అర్థం చేసుకోవచ్చు.
పంచామృతం అంటే...
స్వచ్ఛమైన ఆవుపాలు, తీపిగా వున్న పెరుగు, స్వచ్ఛమైన నేయి, తేనె, చక్కెర మిశ్రమమే ఈ పంచామృతం. భక్తిపరమైన విషయాలను పక్కనబెడితే... ఈ పంచామృతంలో వున్న ఐదు పదార్థాలూ ఆరోగ్యానికి ఎంతో మేలును చేకూరుస్తాయి. అది ఎలాగో ఒకసారి క్లుప్తంగా తెలుసుకుందాం...
ఆవుపాలు : ఆవులను ‘‘గోమాత’’ పూజిస్తారు మన తెలుగువారు. ఎందుకంటే.. ఆవు పాలు తల్లిపాలతో సమానమైనవి, ఎంతో శ్రేష్ఠమైనవి కూడా. గేదె పాలలో ఏ విధంగా అయితే కాల్షియం వుంటుందో.. అదే విధంగా ఆవులలో కూడా కాల్షియం ఎక్కువగా వుంటుంది. ఈ ఆవు పాలు తొందరగా జీర్ణం అవుతాయి. చిన్న పిల్లల్లోనూ, పెద్ద పిల్లల్లోనూ ఈ ఆవుపాలు ఎముకల పెరుగుదలకు నిజంగానే అమృతంలా పనిచేస్తాయి. పాలను అధిక మొత్తంలో తీసుకోవడం ద్వారా బరువు తగ్గుతారని పరిశోధనలలో వెల్లడైంది. పాలలో వున్న ‘‘విటమిన్ ఏ’’ త్వరగా అంధత్వం రాకుండా నివారిస్తుంది.
పెరుగు : పెరుగులో ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో ఔషద విలువలున్నాయి. పెరుగు కూడా త్వరగా జీర్ణం అవుతుంది. శరీరంలో వేడి (ఉష్ణతత్వం) ఎక్కువగా వున్నవారికి పెరుగు అద్భుతమైన ఔషదంగా పనిచేస్తుంది. జీర్ణ సంబంధమైన వ్యాధులను నిరారించే విషయంలో పెరుగు అత్యంత శక్తివంతంగా పనిచేస్తుందని పరిశోధనలలో తేలింది. కేశ సంరక్షణలో కూడా పెరుగుకే అగ్రాస్థానం వుంది. ప్రతిరోజు ఉదయం పూట పెరుగు తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. మన పూర్వీకులు కూడా పెరుగుతో అన్నం తినే పొలం పనులకు వెళ్లేవారు.
నెయ్యి : మేధాశక్తిని పెంపొందించడంలో నెయ్యే అగ్ర తాంబూలం. ఆయుర్వేదం ప్రకారం నెయ్యితో కూడిన ఆహారపదార్థాలను (జీడిపప్పు వంటివి) తీసుకోవడం ద్వారా పిల్లల్లో జ్ఞాపకశక్తిని పెంపొందించుతాయి. ఇలా ప్రతిరోజూ తీసుకోవడం వల్ల ముఖం కాంతివంతంగా అవుతుంది. అయితే నెయ్యిని పరిమితంగానే వాడాల్సి వుంటుంది. ఇందులో ‘‘విటమిన్ ఏ’’ వుంటుంది.
తేనె : కొన్ని తరాల నుంచి మానవులు తేనెను పౌషకాహారంగానే ఉపయోగిస్తున్నారు. ఇది సూక్ష్మజీవులతో శక్తివంతంగా పోరాడటమే గాక, ఎటువంటి ఇన్ఫెక్షన్లు రానివ్వకుండా మనల్ని కాపాడుతుంది. తేనెలో ఖనిజాలు చాలా ఎక్కువ స్థాయిలోవుంటాయి. జీర్ణకోశానికి తేనె ఎంతో మేలు చేస్తుంది. చర్మసౌందర్య సాధనంగా కూడా తేనెను ఉపయోగిస్తున్నారు. తేనె చర్మ సంరక్షణలో ఆద్వితీయమైన పాత్ర పోసిస్తుంది.
ఇకపోతే... చక్కెర మన శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. దీన్ని బట్టి ఇన్ని సుగుణాలున్న ఈ అయిదింటి కలయికతో తయారైన పంచామృతం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అర్థం చేసుకోవచ్చు.
భద్రకాళీ సమేత వీరభద్రస్వామి కవచం...
ఓం. అస్య శ్రీ వీరభద్ర కవచ మహామంత్రస్య, పశుపతిః ఋషిః, అనుష్టుప్ ఛందః, శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రో దేవతా..హ్రాం బీజం, హ్రీం శక్తిః, క్లీం కీలకం, శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రశ్వర స్వామి ప్రసాద సిద్యర్ధే జపే వినియోగః..
ధ్యానం.
రుద్రం, రౌద్రావతారం, హుతవహనయనం, ఊర్ధ్వకేశం, సుదంష్ట్రం, వ్యోమాంగం, భీమరూపం,కిణికిణి రభసత్ జ్వాలమాలావృతాంగం, భూతప్రేతాధినాధం, కరకమల యుగే ఖడ్గ పాత్రే వహంతం వందే లోకైక వీరం, త్రిభువన వినుతం శ్యామలం, వీరభద్రం నమామి....
ఓం లలాటం వీరభద్రో, వాక్ చక్షుషీచోర్ధ్వకేశ భృత్, భ్రూమధ్యం భూతనాధో, వ్యాగ్ నాసికాం వీరవిగ్రహః, కపాలీ కర్ణ యుగళం, కంధరం నీలకంధరః వదనం భద్రకాళీశో చుబుకం చంద్రకండ భృత్, కరౌపాశ కరత్పాతు, బాహూన్పాతు మహేశ్వరః, ఊరుస్థరోంచోగ్ర దంష్ట్రహః ఆనందాత్మ హృతం భుజమ్ రుద్రమూర్తిర్నాభి మధ్యే, కటిం మే పాతు శూలభృత్, మూర్ధానం పంచమూర్ధాన్యా నిటలం నిర్మలేందుభృత్, కపోలయుగ్మం కాపాలీ, జిహ్వాన్మే జీవనాయకః, శ్వశద్వయం పశుపతిం, లింగమ్మే లింగరూపభృత్, సర్వాంగుళేః సర్వనాధో నఖాన్మే నాగభూషణః, పార్ష్వయుగ్మం శక్తి హస్తో, సర్వాంగన్ దేవ వల్లభః, సర్వ కార్యేషుమాన్పాయాత్ పాయాద్భద్రకాళీ మనోహరబ్రహ్మ రాక్షసపైశాచ, భేతాళ రణ భూమిషు, సర్వేశ్వరస్సదా పాతు, సర్వదేవ మదాపహః, శీతోష్ణయోశ్చాన్ధకారే, నిమ్నోన్నత భువిస్థలే, కంఠకేస్వపి దుర్గేశు, పర్వతేపిచ దుర్గమే, శస్త్రాస్త్ర ముఖ భల్లూక వ్యాఘ్ర చోర భయేశుచ, రాజాద్యుపద్రవే చైవ, పాయాచ్ఛరపరోప్రధృత్,
య ఏతత్ వీరభద్రస్య కవచం పఠతేన్నరః,
సోమ మృత్యు భయం ముక్తా, సుఖం ప్రాప్నోతి నిశ్చయం, మోక్షార్ధి మోక్షమాప్నోతి, ధనార్ధి లభతే ధనం, విద్యార్ధి లభతే విద్యాం, జయార్ధి జయమాప్నుయాత్ దేహాంతే శివ సాయుజ్య మవాప్నోతి న సంశయః, ఏతత్ కవచ మీశాన్నినదే యస్య, కస్య చిత్,సుకూలినాయ శాంతాయ, శివ భక్తి రతాయచ, శిష్యాయ గురుభక్త్యాయ దాతవ్యం పరమేశ్వరి, తపస్నేహాన్మయ ప్రోక్తామ్,. ఏతత్తే కవచం మహత్, గోపనీయం ప్రయత్నేన త్వవైం కులసుందరీ......
ఇతి ఆకాశ భైరవకల్పే శ్రీ వీరభద్ర కవచంనామ చత్వారిశంత్పటలః సమాప్తః !!
శివుని ఆత్మలింగం నిజరూప దర్శనం, గోకర్ణ క్షేత్రం
కర్ణాటక రాస్త్రములోని ఉత్తర కన్నడ జిల్లాలో అరేబియా సముద్రము కార్వార్ పట్టణ బీచ్ ఒడ్డున గోకర్ణనందు కల మహా బలేశ్వర ఆలయం నాలుగవ శతాబ్దమునకు చెందినది. యాత్రికులు ఈ ఆలయమునందు దేముని అర్చించుటకు పవిత్రముగా వస్తారు. ఉత్తర భారత దేశములోగంగా నది ఒడ్డున ఉన్న వారణాశినందు కల విశ్వనాధుని ఆలయముతో సమానముగా ఈ ఆలయము పవిత్రమైనదిగా భావిస్తారు .అందువలన గోకర్ణ నందలి మహాబలేశ్వర్ ఆలయమునకు దక్షణ కాశీ అనిపేరు. నలు చదరపు శాలిగ్రామ పీఠముపై మధ్యలో ఆరు అడుగుల ప్రణవలింగము అనబడు ఆత్మలింగము కలదు. భక్తులు నలభై సంవత్సరములకు ఒక పర్యాయము వచ్చు కుంభాభిషేకము రోజున తప్ప లింగము పై భాగమే కానీ లింగము పూర్తిగా దర్శించుకొనుటకు వీలుకాడు 1500 సంవత్సరముల క్రిందటి పురాతనమైన రాతి శివుని విగ్రహము మిక్కిలి మనోహరముగా ఉంటుంది. అరేబియా సముద్రపు కార్వార్బీచ్ నకు పశ్చిమాభి ముఖముగా ఉన్నఈ పవిత్రమైన మహాబలేశ్వర్ ఆలయం దర్శించుటకు ముందు ఆచారప్రకారము ఈ బీచ్ నందు స్నానముచేసి బీచ్నకు దగ్గరలో కల మహాగణపతి ఆలయము సందర్శించ వలయును. కర్ణాటక నందు కల ఏడు ముక్తి స్థలములు ఉడుపి, సుబ్రహ్మణ్య (కుక్కి), కొల్లూరు, కుంభాసి, శంకరనారాయణ మరియు కోడేశ్వరలతో పాటు ఏడవది. భక్తులు మరణించిన తమ బంధువుల కర్మలను మహాబలేశ్వర్ ఆలయములో చేయుట సర్వ సాధారణము. జగద్గురు ఆదిశంకరాచార్య స్థాపించిన రామచంద్రపురమఠం వారి ఆధ్వర్యములో ఈ ఆలయము నిర్వహించబడుచున్నది. సుమారు 1700 సంవత్సరముల క్రిందట ఈ ఆలయము నిర్మించబడి పూజాధికములు నిర్వహించుటకు కాంచీపురము నుండి బ్రాహ్మణ కుటుంభములు తీసుకురాబడినవి. మహాకవి కాళిదాసు రఘువంశమునందు గోకర్ణ మహాబలేశ్వర్ గురించి వ్రాసినాడు. రావణుడు ఆత్మలింగ మును భూమినుండి పెకలించుటకు ప్రయత్నించి విఫలుడైనాడు. అత్యంత అరుదైన ఆత్మలింగం దర్శనం. శివుడు రావణునికి ఇచ్చిన ఆత్మ లింగం గోకర్ణ క్షేత్రంలో వినాయకుని ద్వార ప్రతిష్టితమై మహాబలేశ్వర లింగం పేరుతో పూజలందుకుంటోంది. లింగం పూర్తిగా దర్శనం ఇవ్వదు, కేవలం పై భాగం మాత్రమే మనం దర్శించగలం, స్పర్శించగలం మహాబలేశ్వర్ ఆలయము ఉదయం 6 నుండి 12 వరకు సాయంత్రం 5 నుండి 8 వరకు తెరచి ఉంటుంది. మాహాశివరాత్రి ముఖ్యమైన పండుగ. మహాగణపతి ఆలయం: గణేశునికి చెందిన ఈ ఆలయం రావణుడు ఆత్మలింగము ను ఆతని లంకా రాజ్యమునకు తీసుకొని పోవు ఉద్దేశమును ఉపసంహరించుటలో పోషించిన పాత్రకు గుర్తుగా నిలచి ఉంది. రెండు చేతులు జోడించి ఉన్న స్థితిలో అయిదు అడుగుల గణేశుని విగ్రహము ఈ ఆలయమందు కలదు.
పంచాయతన పూజ విధానం
ఆదిత్యం అంబికామ్ విష్ణుం గణనాథం మహేశ్వరం
పంచదేవాన్ స్మరేన్నిత్యం పూజయేత్ పాపనాశనం
ఆదిత్యం – సూర్యుడు,
అంబికా – అమ్మవారు,
విష్ణుం – మహావిష్ణువు
గణనాథం – గణపతి
మహేశ్వరం – ఈశ్వరుడు
ఈ ఐదుగురినీ పంచాయతన దేవతలని అంటారు. హిందూ ధర్మశాస్త్రాలు వీరిని ప్రధాన దేవతలుగా పేర్కొన్నాయి.
‘*ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్” అన్నారు. సూర్యుడు ప్రత్యక్ష దైవం. కర్మ సాక్షి. యావత్ సృష్టికీ శక్తిని ప్రసాదించగల మహా తేజస్వి, ఓజస్వి. ఆయనను ఆరాధించడం ద్వారా ధృఢ ఆయురా రోగ్యాలను పొందుతారు.
‘*సాహిశ్రీరమృతాసతాం* – అమ్మ వారిని మహాలక్ష్మీ, మహాకాళీ, మహాసరస్వతీ రూపమైన లలితాంబికగా ఆరాధించాలి. అమ్మవారి ఆరాధన వలన అఖండమైన వాక్ శుద్ధి, సంపద, భాగ్యం, త్రికాల దర్శనం, దివ్యదృష్టి వంటి అతీంద్రియ శక్తులు సంప్రాప్తిస్తాయి. వీటన్నింటి కన్నా అంతఃకరణ శుద్ధి కలిగి మానసిక పరిణతి పొందుతారు.
‘*మోక్షమిచ్చేత్ జనార్ధనాత్’* – మొక్షాన్నిచ్చే వాడు మహావిష్ణువు. విష్ణువు యొక్క దశావతారాలలో ప్రధానమైనది శ్రీకృష్ణా వతారం. ‘కృష్ణస్తు భగవాన్ స్వయం’ అని అంటారు. ఆయన ఆవిర్భావం దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం. శిష్టులను రక్షించడం అంటే కేవలం దుష్టుల నుండి కాపాడడమే కాక పతనమయ్యే మార్గం నుంది వారిని రక్షించి మోక్షమార్గాన్ని ఉపదేశించే భగవద్గీతా శాస్త్రాన్ని మానవ జాతికి ప్రసాదించాడు.
‘*ఆదౌపూజ్యో గణాధిప*’ ఏ కార్యమును ప్రారంభించినా మొదటగా పూజించబడేది గణపతే. మహా గణపతి యొక్క ఆరాధన ప్రధానంగా యోగసాధనకు ఉపకరిస్తుంది. దీనివలన సాధనలో ప్రతిబంధకములు తొలగడమే కాకుండా ఐహిక, ఆముష్మిక వాంచలు కూడా నెరవేరుతాయి.
‘*ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్*’! ఈశ్వరానుగ్రహం వలన ఆయుష్షు వృద్ధి పొంది, సకలైశ్వర్యాలూ సంప్రాప్త మౌతాయి. రుద్రాభిషేకాలు, రుద్రజపం మొదలగు వాటి వాళ్ళ సకల దుహ్ఖ నివారణ కలిగి, గ్రహ బాధలు తొలగి స్వాంతన, ఐశ్వర్యసిద్ధి, అంతఃకరణ శుద్ధి కలుగుతుంది.
కావున నిత్యం ఈ దేవతలనారాధించే వారికి సకల శుభములు చేకూరుతాయని ధర్మశాస్త్రాల యొక్క ప్రతిజ్ఞానువచనం.
అయితే మనకు వంశపారం పర్యంగా, సంప్రదాయ సిద్ధంగా సంప్రాప్తమైన దైవం ఎవరైతే వారిని ప్రధానంగా మధ్యలో పెట్టి, మిగిలిన నలుగురు దేవతలను నాల్గు దిశలలో స్థాపించి ఆరాధించాలి. అంటే మన ఇంటి ఇలవేల్పు విష్ణువైతే విష్ణువుని మధ్యనుంచాలి. ఈశ్వరుడైతే ఆయనను మధ్యలో వుంచాలి.
" సర్వదేవకృత లక్ష్మీ స్తోత్రం"
_క్షీర సాగరం నుండి లక్ష్మీ దేవి ఉద్భవించినప్పుడు దేవతలందరూ కలిసి అమ్మవారిని స్తోత్రం చేశారు_...
*కనుక దీనిని " సర్వదేవకృత లక్ష్మీ స్తోత్రం " అంటారు*...
_అమ్మవారి అనుగ్రహం పొందడానికి ఈ స్తోత్రం అత్యంత శక్తి వంతమైనదని కూడా చెబుతారు...
క్షమస్వ భగవత్యంబ క్షమా శీలే పరాత్పరే
శుద్ధ సత్వ స్వరూపేచ కోపాది పరి వర్జితే!
ఉపమే సర్వ సాధ్వీనాం దేవీనాం దేవ పూజితే
త్వయా వినా జగత్సర్వం మృత తుల్యంచ నిష్ఫలమ్!
సర్వ సంపత్స్వరూపాత్వం సర్వేషాం సర్వ రూపిణీ
రాసేశ్వర్యధి దేవీత్వం త్వత్కలాః సర్వయోషితః!
కైలాసే పార్వతీ త్వంచ క్షీరోధే సింధు కన్యకా
స్వర్గేచ స్వర్గ లక్ష్మీ స్త్వం మర్త్య లక్ష్మీశ్చ భూతలే!
వైకుంఠేచ మహాలక్ష్మీః దేవదేవీ సరస్వతీ
గంగాచ తులసీత్వంచ సావిత్రీ బ్రహ్మ లోకతః!
కృష్ణ ప్రాణాధి దేవీత్వం గోలోకే రాధికా స్వయమ్
రాసే రాసేశ్వరీ త్వంచ బృందా బృందావనే వనే!
కృష్ణ ప్రియా త్వం భాండీరే చంద్రా చందన కాననే
విరజా చంపక వనే శత శృంగేచ సుందరీ!
పద్మావతీ పద్మ వనే మాలతీ మాలతీ వనే
కుంద దంతీ కుందవనే సుశీలా కేతకీ వనే!
కదంబ మాలా త్వం దేవీ కదంబ కాననేపిచ
రాజలక్ష్మీః రాజ గేహే గృహలక్ష్మీ ర్గృహే గృహే!
ఇత్యుక్త్వా దేవతాస్సర్వాః మునయో మనవస్తథా
రూరూదుర్న మ్రవదనాః శుష్క కంఠోష్ఠ తాలుకాః!
ఇతి లక్ష్మీ స్తవం పుణ్యం సర్వదేవైః కృతం శుభమ్
యః పఠేత్ప్రాతరుత్థాయ సవైసర్వం లభేద్ధ్రువమ్!
అభార్యో లభతే భార్యాం వినీతాం సుసుతాం సతీమ్
సుశీలాం సుందరీం రమ్యామతి సుప్రియవాదినీమ్!
పుత్ర పౌత్ర వతీం శుద్ధాం కులజాం కోమలాం వరామ్
అపుత్రో లభతే పుత్రం వైష్ణవం చిరజీవినమ్!
పరమైశ్వర్య యుక్తంచ విద్యావంతం యశస్వినమ్
భ్రష్టరాజ్యో లభేద్రాజ్యం భ్రష్ట శ్రీర్లభేతే శ్రియమ్!
హత బంధుర్లభేద్బంధుం ధన భ్రష్టో ధనం లభేత్
కీర్తి హీనో లభేత్కీర్తిం ప్రతిష్ఠాంచ లభేద్ధ్రువమ్!
సర్వ మంగళదం స్తోత్రం శోక సంతాప నాశనమ్
హర్షానందకరం శాశ్వద్ధర్మ మోక్ష సుహృత్పదమ్!
ఇతి సర్వ దేవ కృత లక్ష్మీ స్తోత్రం సంపూర్ణం!!
శ్రీ శరభేశ్వరస్వామి
హిరణ్యకశిపుడిని చంపి, ప్రహ్లాదుణ్ణి రక్షించటానికి మహావిష్ణువు నరసింహావతారం ఎత్తినట్లు మనందరికీ తెలిసిన విషయమే. హిరణ్యకశిపుణ్ణి చంపిన తర్వాత మన కధల ప్రకారం నరసింహుడి ఉగ్ర రూపాన్ని మహాలక్ష్మి శాంతింప చేస్తుంది. కానీ తమిళ నాట ప్రచారములో నున్న కధ ప్రకారం...
హిరణ్యకశిపుడి రక్తం నరసింహస్వామి శరీరంమీద, లోపల వుండి ఆయనని చాలా రౌద్రంగా చేసిందిట. హిరణ్యకశిపుడి రక్తం నేల మీద పడితే అనేక మంది హిరణ్యకశిపులు జన్మిస్తారుట. దానితో వాళ్ళు భయపడ్డారు. దానిని ఆపటానికి ఆయనని చల్లబరచటానికి దేవతలు శివుణ్ణి ప్రార్ధించారుట.శివుడు వింత రూపాన్ని ధరించాడు. సింహ ముఖం, మానవ శరీరం, పక్షి రెక్కలు, 8 కాళ్ళు, 4 చేతులతో ఆయన రూపం ప్రత్యక్షమయింది. ఆయన రెండు రెక్కలలో ఒక రెక్క ప్రత్యంగరాదేవి, రెండవది శూలిని దుర్గ అవతరించారు. ఆయన నరసింహుణ్ణి ఆకాశంలో భూమ్యాకర్షణ శక్తి పని చేయనంత ఎత్తుకు తీసుకెళ్ళాడు. ఆ ప్రదేశంలో శరభేశ్వరుడు నరసింహుడి శరీరాన్ని నొక్కి చెడ్డ రక్తమంతా బయటకి పోయేటట్లు చేశాడు. భూమ్యాకర్షణ శక్తి లేక పోవటంతో ఆ రక్తం కింద పడలేదు. శరీరంలోంచి చెడు రక్తం పోగానే నరసింహుడు శాంతించి శివుణ్ణి పూజించాడుట.శరభేశ్వురుణ్ణి పూజిస్తే నలుగురు దేవతలని పూజించినట్లే. శరభేశ్వరుని ఆకారంలో నలుగురు దేవతా మూర్తులు, శివుడు, కాళి, దుర్గ, విష్ణు వున్నారు. శరభేశ్వరస్వామిని పూజించటంవల్ల ఆరోగ్యం,మనసు చికాకులు,గ్రహదోషాలు తొలగిపోతాయి.
*పూజ-పరమార్థాలు:*
*పూజ* --> పూర్వజన్మవాసనలను నశింపచేసేది. జన్మమృత్యువులను లేకుండాచేసేది సంపూర్ణఫలాన్నిచ్చేది.
*అర్చన*--> అభీష్ట ఫలాన్నిచ్చేది చతుర్విధ పురుషార్థ ఫలానికి ఆశ్రయమైనది, దేవతలను సంతోషపెట్టేది.
*జపం*--> అనేక జన్మలలో చేసిన పాపాన్ని పోగొట్టేది, పరదేవతను సాక్షాత్కరింప చేసేది జపం.
\*స్తోత్రం*-->నెమ్మది నెమ్మదిగా మనస్సు కి ఆనందాన్ని కలిగించేది, సాధకుని తరింపజేసేది స్తోత్రం.
*ధ్యానం*-> ఇంద్రియ సంతాపాన్ని మనస్సుతో నియమింప చేసేది, ఇష్టదేవతను చింతింపచేసేది ధ్యానం.
*దీక్ష* ->దివ్యభావాలను కల్గించేది, పాపాలను కడిగివేసేది, సంసార బంధాలనుండి విముక్తిని కల్గించేది దీక్ష.
*అభిషేకము*--> అహంభావాన్ని పోగొట్టేది, భయాన్ని మథించేది, పవిత్రోదకాన్నిచల్లేది, ఆనందాదులను కల్గించేది.
*మంత్రం*-->తత్త్వం పై మననం చేయడం వల్ల భయాల నుండి రక్షించేది మంత్రం.
*ఆసనం*--> ఆత్మసిద్ధి కల్గించేది, రోగాలను పోగొట్టేది, క్రొత్తసిద్ధిని, లేదా నవసిద్ధులను కల్గించేది ఆసనం.
*తర్పణం*--> పరివారంతో కూడిన పరతత్త్వానికి క్రొత్త ఆనందాన్ని కల్గించేది.
*గంధం*-->అంతంలేని దౌర్భాగ్యాన్ని, క్లేశాన్ని నశింపుచేసేది ధర్మఙ్ఞానాలనిచ్చేది.
*అక్షతలు*--> కల్మషాలను పోగొట్టడం వల్ల తత్ పదార్ధంతో తదాత్మ్యాన్ని కల్గించేవి.
*పుష్పం*--> పుణ్యాన్నివృద్ధిచేసేది, పాపాన్ని పోగొట్టేది, పుష్కలార్ధాన్ని ఇచ్చేది.
*ధూపం*--> చెడువాసనలవల్ల వచ్చు అనేక దోషాలను పోగొట్టేది, పరమానందాన్ని ప్రసాదించేది.
*దీపం*--> సుదీర్ఘమైన అఙ్ఞానాన్ని పొగొట్టేది, అహంకారం లేకుండా చేసేది, పరతత్త్వాన్ని ప్రకాశింప చేసేది.
*నైవేద్యం*-->ఆరు రుచులతో నున్న నాల్గు విధాల పదార్ధాలను,దేవతకు తృప్తినిచ్చేదానిని నివేదన చేయుటయే.
*ప్రసాదం*--> ప్రకాశానందాల నిచ్చేది, సామరస్యాన్ని కల్గించేది, పరతత్త్వాన్ని దర్శింపచేసేది ప్రసాదం.
*ఆచమనీయం*--> లవంగ, జాజి, తక్కోలములతోకూడిన ద్రవ్యం ఆచమనీయం .
*ఆవాహనం*--> పూజ కొరకు దేవతను పిలుచుటయే ఆవాహనం.
*స్వాగతం*-->దేవతను కుశలప్రశ్నవేయుట.
*పాద్యం*--> చామలు, గరికలు, పద్మాలు, విష్ణుక్రాంతలతో కూడిన ద్రవ్యం పాద్యం, పాదాలు కడుగుటకు ఇచ్చే జలం.
*మధుపర్కం*--> తేనె, నెయ్యి, పెరుగులతో కూడినది.
*స్నానం*--> గంధం, కస్తూరి, అగరు మొవాటితో స్నానం.....
*వందనం*--> అష్టాంగాలతో కూడిన నమస్కారం వందనం ఉరస్స(వక్షస్థలం, శిరస్సు, మనస్సు, మాట, పాదాలు, కరములు, కర్ణాలు, నేలకుతాకించి చేసే వందనం సాష్టాంగం)......
*ఉద్వాసన*--> దేవతను, ఆవరణ దేవతలను పదహారు ఉపచారాలచే పూజించి పంపడాన్ని ఉద్వాసనమని అంటారు..
చమకం చదవడం రానివారు తాత్పర్యం చదువుకున్నా చాలా పుణ్యం లభిస్తుంది.
భక్తుడు తనకు ఏమి కావలెనో ఆ రుద్రుని చమక రూపంలో అడగబడింది. నమకంలో లాగానే దీనిలో కూడా పదకొండు అనువాకములు. నమక చమకాలు కలిపి చదివితేనే అభిషేకం సంపూర్ణం. చమకాన్ని భక్తుని వాక్కులో రుద్రుని ఆశీర్వచనంగా వ్యాఖ్యానించ బడింది.
మొదటి అనువాకము: ఓం అగ్నా’విష్ణో సజోష’సేమావ’ర్ధన్తు వాం గిరః’ | ద్యుమ్నైర్-వాజే’భిరాగ’తమ్ | వాజ’శ్చ మే ప్రసవశ్చ’ మే ప్రయ’తిశ్చ మే ప్రసి’తిశ్చ మే ధీతిశ్చ’ మే క్రతు’శ్చ మే స్వర’శ్చ మే శ్లోక’శ్చ మే శ్రావశ్చ’ మే శ్రుతి’శ్చ మే జ్యోతి’శ్చ మే సువ’శ్చ మే ప్రాణశ్చ’ మేஉపానశ్చ’ మే వ్యానశ్చ మేஉసు’శ్చ మే చిత్తం చ’ మ ఆధీ’తం చ మే వాక్చ’ మే మన’శ్చ మే చక్షు’శ్చ మే శ్రోత్రం’ చ మే దక్ష’శ్చ మే బలం’ చ మ ఓజ’శ్చ మే సహ’శ్చ మ ఆయు’శ్చ మే జరా చ’ మ ఆత్మా చ’ మే తనూశ్చ’ మే శర్మ’ చ మే వర్మ’ చ మేஉఙ్గా’ని చ మేஉస్థాని’ చ మే పరూగ్‍మ్’షి చ మే శరీ’రాణి చ మే || ౧ ||
తాత్పర్యము : ఓ దేవా! అగ్ని విష్ణు రూపమైన వాడ! మీరు నా పట్ల సంతుష్టులై ఉండుటకు నేను నుతించే ఈ పదములు ఎల్లప్పుడూ అభివృద్ధి చెందుతుండు గాక. నాకు ఎల్లపుడు ఆహారము, ధనము సమృద్ధిగా నుండు గాక.
రెండవ అనువాకము: జైష్ఠ్యం’ చ మ ఆధి’పత్యం చ మే మన్యుశ్చ’ మే భామ’శ్చ మేஉమ’శ్చ మేஉమ్భ’శ్చ మే జేమా చ’ మే మహిమా చ’ మే వరిమా చ’ మే ప్రథిమా చ’ మే వర్ష్మా చ’ మే ద్రాఘుయా చ’ మే వృద్ధం చ’ మే వృద్ధి’శ్చ మే సత్యం చ’ మే శ్రద్ధా చ’ మే జగ’చ్చ మే ధనం’ చ మే వశ’శ్చ మే త్విషి’శ్చ మే క్రీడా చ’ మే మోద’శ్చ మే జాతం చ’ మే జనిష్యమా’ణం చ మే సూక్తం చ’ మే సుకృతం చ’ మే విత్తం చ’ మే వేద్యం’ చ మే భూతం చ’ మే భవిష్యచ్చ’ మే సుగం చ’ మే సుపథం చ మ ఋద్ధం చ మ ఋద్ధిశ్చ మే క్లుప్తం చ’ మే క్లుప్తి’శ్చ మే మతిశ్చ’ మే సుమతిశ్చ’ మే || ౨ ||
తాత్పర్యము : నేను రుద్రుని అర్చించుట వలన - ఆహారము, దాన్ని ఇచ్చే మనసు, ఉత్సాహము, కాపాడుకునే శక్తి, ఆహారాన్ని సంపాదించే శక్తి, దోషములు లేకుండా మంత్రోచ్చారణ చేసే సామర్థ్యం, యశస్సు, ఉచ్చారణ, వివేకము, స్వర్గము, ఆత్మ శక్తి, అపాన వ్యానాదులు, ఆత్మ, ఆలోచన, ఆలోచనచే గ్రహించ బడేవి, వాక్కు, మనస్సు, ఇంద్రియములు, జ్ఞానమును పొందుటకు కావలసిన ఇంద్రియ శక్తి, ఆత్మ బలము, శత్రువులను సంహరించే శక్తి, ఆయుష్షు, వృద్ధాప్యం, ఆరోగ్యకరమైన శరీరము, ఆనందము, శరీరాన్ని కాపాడటానికి ఆయుధాలు, బలమైన, స్థిరమైన అవయవములు, ఎముకలు, కీళ్ళు మొదలగు అవయవములు - నాతో, నాలో ఉండు గాక.
మూడవ అనువాకము: శం చ’ మే మయ’శ్చ మే ప్రియం చ’ మేஉనుకామశ్చ’ మే కామ’శ్చ మే సౌమనసశ్చ’ మే భద్రం చ’ మే శ్రేయ’శ్చ మే వస్య’శ్చ మే యశ’శ్చ మే భగ’శ్చ మే ద్రవి’ణం చ మే యన్తా చ’ మే ధర్తా చ’ మే క్షేమ’శ్చ మే ధృతి’శ్చ మే విశ్వం’ చ మే మహ’శ్చ మే సంవిచ్చ’ మే ఙ్ఞాత్రం’ చ మే సూశ్చ’ మే ప్రసూశ్చ’ మే సీరం’ చ మే లయశ్చ’ మ ఋతం చ’ మేஉమృతం’ చ మేஉయక్ష్మం చ మేஉనా’మయచ్చ మే జీవాతు’శ్చ మే దీర్ఘాయుత్వం చ’ మేஉనమిత్రం చ మేஉభ’యం చ మే సుగం చ’ మే శయ’నం చ మే సూషా చ’ మే సుదినం’ చ మే || ౩ ||
తాత్పర్యము : ఓ రుద్రా! నిన్ను అర్చించుట వలన - కీర్తి, నాయకత్వము, క్రోధము, చలించని మనసు, చల్లని నీరు, గెలిచే మరియు గౌరవము పొందే సామర్థ్యము, స్థిరాస్తులు, పుత్ర పౌత్రాదులు, అప మృత్యువు లేని సంతానము, ధన ధాన్యములు, పెరిగే జ్ఞానము, సత్యము, వివరము పట్ల ధ్యాస, ఆకట్టుకునే సామర్థ్యము, శరీర సౌందర్యము, క్రీడలు ఇతర విషయముల వలన కలిగే ఆనందము, చేసేది, చేయబడేది, దేవతలా ఆశీర్వాదము, సత్కార్యములు, ఖజానా, నిలిచే సంపాదన, ఎక్కువ సంపాదించే సామర్థ్యము, ఎక్కడికైనా వెళ్ళగలిగే శక్తి, మంచి మార్గములు, మంచి యజ్ఞ ఫలము, పుణ్యము, సత్సంపాదన, పని చేయ గలిగిన మంచి సామర్థ్యము, ముందు చూపు, నిలకడ - నాకు కలిగి, నాతో ఉండు గాక.
నాలుగవ అనువాకము: ఊర్క్చ’ మే సూనృతా’ చ మే పయ’శ్చ మే రస’శ్చ మే ఘృతం చ’ మే మధు’ చ మే సగ్ధి’శ్చ మే సపీ’తిశ్చ మే కృషిశ్చ’ మే వృష్టి’శ్చ మే జైత్రం’ చ మ ఔద్భి’ద్యం చ మే రయిశ్చ’ మే రాయ’శ్చ మే పుష్టం చ మే పుష్టి’శ్చ మే విభు చ’ మే ప్రభు చ’ మే బహు చ’ మే భూయ’శ్చ మే పూర్ణం చ’ మే పూర్ణత’రం చ మేஉక్షి’తిశ్చ మే కూయ’వాశ్చ మేஉన్నం’ చ మేஉక్షు’చ్చ మే వ్రీహయ’శ్చ మే యవా”శ్చ మే మాషా”శ్చ మే తిలా”శ్చ మే ముద్గాశ్చ’ మే ఖల్వా”శ్చ మే గోధూమా”శ్చ మే మసురా”శ్చ మే ప్రియఙ్గ’వశ్చ మేஉణ’వశ్చ మే శ్యామాకా”శ్చ మే నీవారా”శ్చ మే || ౪ ||
తాత్పర్యము : ఓ రుద్రా! నిన్ను అర్చించుట వలన - ఇహ లౌక, పారలౌకిక ఆనందాలు, కోరిక, దాని ఫలము, ప్రీతి కలిగించే బంధు జనము, రక్షణ, యశస్సు , కీర్తి, మంచి అలవాట్లు, అదృష్టము, సంపద, తండ్రి వలె నన్ను నడిపించే సద్గురువు, ఆస్తులను కాపాడుకునే శక్తి, స్థైర్యము, మంచితనము, గుర్తింపు, వేద శాస్త్రాల జ్ఞానము, అధ్యాపకత, పని చేసే, చేయించ గలిగే సామర్థ్యము, ఆజ్ఞాపించే అధికారము, పశు సంపద, అవరోధము లేని మార్గము, మంచి అగ్నిహోత్రము, ద్రవ్యములు, వాటి వలన కలిగే శుభములు, క్షయ వ్యాధి నుంచి రక్షణ, జ్వరములనుండి రక్షణ, ఔషధ సేవ లేని జీవితం, దీర్ఘాయుష్షు, అందరితో స్నేహంగా ఉండే వాతావరణము, నిర్భయము, సత్ప్రవర్తన, మంచి నిద్ర, మంచి ఉదయము, మంచి రోజులు - నాతో ఉండు గాక.
అయిదవ అనువాకము: అశ్మా చ’ మే మృత్తి’కా చ మే గిరయ’శ్చ మే పర్వ’తాశ్చ మే సిక’తాశ్చ మే వనస్-పత’యశ్చ మే హిర’ణ్యం చ మేஉయ’శ్చ మే సీసం’ చ మే త్రపు’శ్చ మే శ్యామం చ’ మే లోహం చ’ మేஉగ్నిశ్చ’ మ ఆప’శ్చ మే వీరుధ’శ్చ మ ఓష’ధయశ్చ మే కృష్ణపచ్యం చ’ మేஉకృష్ణపచ్యం చ’ మే గ్రామ్యాశ్చ’ మే పశవ’ ఆరణ్యాశ్చ’ యఙ్ఞేన’ కల్పన్తాం విత్తం చ’ మే విత్తి’శ్చ మే భూతం చ’ మే భూతి’శ్చ మే వసు’ చ మే వసతిశ్చ’ మే కర్మ’ చ మే శక్తి’శ్చ మేஉర్థ’శ్చ మ ఏమ’శ్చ మ ఇతి’శ్చ మే గతి’శ్చ మే || ౫ ||
తాత్పర్యము : ఓ రుద్రా! నిన్ను అర్చించుట వలన - భుక్తి, మంచి వాక్కు, పాలు, మీగడ, నెయ్యి, తేనె, బంధువులతో భోజనము, పానము, వ్యవసాయము, వర్షములు, విజయ భూమి, వృక్షములు, మొక్కల సేద్యము, స్వర్ణము, రత్నములు, సంపదతో వచ్చే కీర్తి, ఆరోగ్యము, విలువైన పంట, మంచి పంట తెచ్చే ఇతర శుభములు, దినదినాభి వృద్ధి, పూర్ణత్వము, ఉత్కృష్టము కన్నా ఉన్నతమైనది, మరణము లేని స్థితి, బియ్యము, సజ్జలు, గోధుమలు, రాగులు, మినుములు, పెసలు మొదలగు ధాన్యములు, నూనె గింజలు, పప్పు దినుసులు - అన్ని నా వద్ద సమృద్ధిగా ఉండు గాక.
ఆరవ అనువాకము: అగ్నిశ్చ’ మ ఇన్ద్ర’శ్చ మే సోమ’శ్చ మ ఇన్ద్ర’శ్చ మే సవితా చ’ మ ఇన్ద్ర’శ్చ మే సర’స్వతీ చ మ ఇన్ద్ర’శ్చ మే పూషా చ’ మ ఇన్ద్ర’శ్చ మే బృహస్పతి’శ్చ మ ఇన్ద్ర’శ్చ మే మిత్రశ్చ’ మ ఇన్ద్ర’శ్చ మే వరు’ణశ్చ మ ఇన్ద్ర’శ్చ మే త్వష్ఠా’ చ మ ఇన్ద్ర’శ్చ మే ధాతా చ’ మ ఇన్ద్ర’శ్చ మే విష్ణు’శ్చ మ ఇన్ద్ర’శ్చ మేஉశ్వినౌ’ చ మ ఇన్ద్ర’శ్చ మే మరుత’శ్చ మ ఇన్ద్ర’శ్చ మే విశ్వే’ చ మే దేవా ఇన్ద్ర’శ్చ మే పృథివీ చ’ మ ఇన్ద్ర’శ్చ మేஉన్తరి’క్షం చ మ ఇన్ద్ర’శ్చ మే ద్యౌశ్చ’ మ ఇన్ద్ర’శ్చ మే దిశ’శ్చ మ ఇన్ద్ర’శ్చ మే మూర్ధా చ’ మ ఇన్ద్ర’శ్చ మే ప్రజాప’తిశ్చ మ ఇన్ద్ర’శ్చ మే || ౬ ||
తాత్పర్యము : ఓ రుద్రా! నిన్ను అర్చించుట వలన - రాళ్ళు, మట్టి, కొండలు, పర్వతాలు, ఇసుక, భూమి యందు పెరిగే అన్ని వస్తువులు, అన్ని రకముల ఖనిజములు, లవణాలు, అగ్ని, నీరు, తీగ మొక్కలు, ఔషధపు మొక్కలు, పెంచేవి, పెంచని మొక్కలు, గ్రామాలలో, అరణ్యాలలో ఉండే సంపద, పశుసంపద, అగ్నిహోత్రములో వాడే ద్రవ్యములు, పిత్రార్జితములు, సంతానము మరియు ఇతరులకు చెందిన ఆస్తులు, స్థిర, చరాస్తులు, నా ధర్మమునకు చెందిన కర్మలు, కర్మలు చేయుటకు కావలసిన శక్తి, వాటి ఫలము, ఆనందము పొందే సాధనములు, వాటి ఫలితములు - నాతో ఉండు గాక.
ఏడవ అనువాకము: అగ్ంశుశ్చ’ మే రశ్మిశ్చ మేஉదా”భ్యశ్చ మేஉధి’పతిశ్చ మ ఉపాగ్ంశుశ్చ’ మేஉన్తర్యామశ్చ’ మ ఐన్ద్రవాయవశ్చ’ మే మైత్రావరుణశ్చ’ మ ఆశ్వినశ్చ’ మే ప్రతిప్రస్థాన’శ్చ మే శుక్రశ్చ’ మే మన్థీ చ’ మ ఆగ్రయణశ్చ’ మే వైశ్వదేవశ్చ’ మే ధ్రువశ్చ’ మే వైశ్వానరశ్చ’ మ ఋతుగ్రహాశ్చ’ మేஉతిగ్రాహ్యా”శ్చ మ ఐంద్రాగ్నశ్చ’ మే వైశ్వదేవశ్చ’ మే మరుత్వతీయా”శ్చ మే మాహేన్ద్రశ్చ’ మ ఆదిత్యశ్చ’ మే సావిత్రశ్చ’ మే సారస్వతశ్చ’ మే పౌష్ణశ్చ’ మే పాత్నీవతశ్చ’ మే హారియోజనశ్చ’ మే || ౭ ||
తాత్పర్యము : ఓ రుద్రా! నిన్ను అర్చించుట వలన - అగ్ని మరియు ఇంద్రుడు, చంద్రుడు మరియు ఇంద్రుడు, సూర్యుడు మరియు ఇంద్రుడు, సరస్వతి మరియు ఇంద్రుడు, పూషా మరియు ఇంద్రుడు, బృహస్పతి మరియు ఇంద్రుడు, మిత్రుడు మరియు ఇంద్రుడు, వరుణుడు మరియు ఇంద్రుడు, త్వష్ట మరియు ఇంద్రుడు, ధాత మరియు ఇంద్రుడు, అశ్వినీ దేవతలు మరియు ఇంద్రుడు, మరుత్ దేవతలు మరియు ఇంద్రుడు, వసువులు మరియు ఇంద్రుడు, భూమి మరియు ఇంద్రుడు, అంతరిక్షము మరియు ఇంద్రుడు, స్వర్గము మరియు ఇంద్రుడు, నాలుగు దిక్కులు మరియు ఇంద్రుడు, మూర్ధ్నము మరియు ఇంద్రుడు, ప్రజాపతి మరియు ఇంద్రుడు - నన్ను ఆశీర్వదించు గాక.
ఎనిమిదవ అనువాకము: ఇధ్మశ్చ’ మే బర్హిశ్చ’ మే వేది’శ్చ మే దిష్ణి’యాశ్చ మే స్రుచ’శ్చ మే చమసాశ్చ’ మే గ్రావా’ణశ్చ మే స్వర’వశ్చ మ ఉపరవాశ్చ’ మేஉధిషవ’ణే చ మే ద్రోణకలశశ్చ’ మే వాయవ్యా’ని చ మే పూతభృచ్చ’ మ ఆధవనీయ’శ్చ మ ఆగ్నీ”ధ్రం చ మే హవిర్ధానం’ చ మే గృహాశ్చ’ మే సద’శ్చ మే పురోడాశా”శ్చ మే పచతాశ్చ’ మేஉవభృథశ్చ’ మే స్వగాకారశ్చ’ మే || ౮ ||
తాత్పర్యము : ఓ రుద్రా! నిన్ను అర్చించుట కొరకు - సోమయాగమునకు కావలసిన పాత్రలు, ఆజ్య పాత్రలు, ఘ్రుత పాత్రలు, ఇంద్రాది దేవతలకు సమర్పించ వలసిన సోమరస పాత్రలు, ఆశ్వినాది ఇతర దేవతలకు సోమరస పాత్రలు, వైశ్వదేవాది దేవతలకు సోమరస పాత్రలు మొదలగునవి నా చేత ఉన్నాయి.
తొమ్మిదవ అనువాకము: అగ్నిశ్చ’ మే ఘర్మశ్చ’ మేஉర్కశ్చ’ మే సూర్య’శ్చ మే ప్రాణశ్చ’ మేஉశ్వమేధశ్చ’ మే పృథివీ చ మేஉది’తిశ్చ మే దితి’శ్చ మే ద్యౌశ్చ’ మే శక్వ’రీరఙ్గుల’యో దిశ’శ్చ మే యఙ్ఞేన’ కల్పన్తామృక్చ’ మే సామ’ చ మే స్తోమ’శ్చ మే యజు’శ్చ మే దీక్షా చ’ మే తప’శ్చ మ ఋతుశ్చ’ మే వ్రతం చ’ మేஉహోరాత్రయో”ర్-దృష్ట్యా బృ’హద్రథంతరే చ మే యఙ్ఞేన’ కల్పేతామ్ || ౯ ||
తాత్పర్యము : ఓ రుద్ర! నేను నీ భక్తుడనయినందు వలన - మర్రి చెట్టు చిదుగులు, దర్భలు, యాగశాల, సహాయమునకు స్త్రీలు, సోమరస పాత్రలు, సోమ తీగ చిగుళ్ళు నూరుటకు రాళ్ళు, సమిధలు, చెక్కలు, అగ్ని సృష్టించుటకు భూమిలో రంధ్రములు, ద్రోణము, వాయవ్యసము, ఇతర పవిత్రమైన పాత్రలు,యాగ ద్రవ్యములు ఉంచుటకు, స్త్రీలు ఆసీనులు అగుటకు, ఇతరులు వీక్షించుటకు ప్రదేశము, చెరువు (హోమములో హుతమునకు), బలి, అనంతరము స్నానమునకు ప్రదేశము, సమిథలతో పాటు హవానములో వేసే ఇతర ద్రవ్యములు నా చెంత ఉండు గాక.
పదవ అనువాకము: గర్భా”శ్చ మే వత్సాశ్చ’ మే త్ర్యవి’శ్చ మే త్ర్యవీచ’ మే దిత్యవాట్ చ’ మే దిత్యౌహీ చ’ మే పఞ్చా’విశ్చ మే పంచావీ చ’ మే త్రివత్సశ్చ’ మే త్రివత్సా చ’ మే తుర్యవాట్ చ’ మే తుర్యౌహీ చ’ మే పష్ఠవాట్ చ’ మే పష్ఠౌహీ చ’ మ ఉక్షా చ’ మే వశా చ’ మ ఋషభశ్చ’ మే వేహచ్చ’ మేஉనడ్వాం చ మే ధేనుశ్చ’ మ ఆయు’ర్-యఙ్ఞేన’ కల్పతాం ప్రాణో యఙ్ఞేన’ కల్పతామ్-అపానో యఙ్ఞేన’ కల్పతాం వ్యానో యఙ్ఞేన’ కల్పతాం చక్షు’ర్-యఙ్ఞేన’ కల్పతాగ్ శ్రోత్రం’ యఙ్ఞేన’ కల్పతాం మనో’ యఙ్ఞేన’ కల్పతాం వాగ్-యఙ్ఞేన’ కల్పతామ్-ఆత్మా యఙ్ఞేన’ కల్పతాం యఙ్ఞో యఙ్ఞేన’ కల్పతామ్ || ౧౦ ||
తాత్పర్యము : ఓ రుద్రా! నేను నీ భక్తుడనయినందు వలన యాగామునకు కావాల్సిన అగ్ని, అగ్ని కార్యమునకు కావాల్సిన ఇతర పూర్వ కార్యక్రమములు, దిక్పాలకులకు, పంచాభూతములకు చేయవలసిన సమర్పణ (ఆశ్వాది బలులు), వేద పారాయణ , ప్రాయశ్చిత్తము, శాంతి హోమములు, పూర్ణాహుతి ముహూర్త నిర్ణయం, పూర్ణాహుతి కార్యక్రమము, ఇతర క్రియలు నా చేతుల మీదుగా జరుగు గాక. (ఇక్కడ గో స్తన్యము నుండి పాలు త్రాగుట, అశ్వాన్ని బలి ఇవ్వటం, వివిధ దేవతలకు బలి సమర్పించటం, శుద్ధి, ప్రాయశ్చిత్తం వివరాలు పై రెండు అనువాకాల్లో పేర్కొన బడ్డాయి)
పదకొండవ అనువాకము: ఏకా’ చ మే తిస్రశ్చ’ మే పఞ్చ’ చ మే సప్త చ’ మే నవ’ చ మ ఏకా’దశ చ మే త్రయోదశ చ మే పఞ్చ’దశ చ మే సప్తద’శ చ మే నవ’దశ చ మ ఏక’విగ్ంశతిశ్చ మే త్రయో’విగ్ంశతిశ్చ మే పఞ్చ’విగ్ంశతిశ్చ మే సప్త విగ్‍మ్’శతిశ్చ మే నవ’విగ్ంశతిశ్చ మ ఏక’త్రిగ్ంశచ్చ మే త్రయ’స్త్రిగ్ంశచ్చ మే చత’స్-రశ్చ మేஉష్టౌ చ’ మే ద్వాద’శ చ మే షోడ’శ చ మే విగ్ంశతిశ్చ’ మే చతు’ర్విగ్ంశతిశ్చ మేஉష్టావిగ్‍మ్’శతిశ్చ మే ద్వాత్రిగ్‍మ్’శచ్చ మే షట్-త్రిగ్‍మ్’శచ్చ మే చత్వారిగ్ంశచ్చ’ మే చతు’శ్-చత్వారిగ్ంశచ్చ మేஉష్టాచ’త్వారిగ్ంశచ్చ మే వాజ’శ్చ ప్రసవశ్చా’పిజశ్చ క్రతు’శ్చ సువ’శ్చ మూర్ధా చ వ్యశ్ని’యశ్-చాన్త్యాయనశ్-చాన్త్య’శ్చ భౌవనశ్చ భువ’నశ్-చాధి’పతిశ్చ || ౧౧ ||
ఓం ఇడా’ దేవహూర్-మను’ర్-యఙ్ఞనీర్-బృహస్పతి’రుక్థామదాని’ శగ్ంసిషద్-విశ్వే’-దేవాః సూ”క్తవాచః పృథి’విమాతర్మా మా’ హిగ్ంసీర్-మధు’ మనిష్యే మధు’ జనిష్యే మధు’ వక్ష్యామి మధు’ వదిష్యామి మధు’మతీం దేవేభ్యో వాచముద్యాసగ్ంశుశ్రూషేణ్యా”మ్ మనుష్యే”భ్యస్తం మా’ దేవా అ’వన్తు శోభాయై’ పితరోஉను’మదన్తు ||
ఓం శాంతిః శాంతిః శాంతిః
తాత్పర్యము : గర్భిణీలు అయిన గోవులు, గోవులు, దూడలు, ఒకటిన్నర, రెండు, రెండున్నర, మూడు, మూడున్నర, నాలుగు సంవత్సరములున్న గోవులు, ఎద్దులు, వీర్యమున్న ఎద్దులు, బాలింతలైన గోవులు, గొడ్లు అందుబాటులో ఉండుగాక. ఈ అగ్నిహోత్రములోని అగ్ని నాకు పూర్ణాయుష్షు, ఉచ్చ్వాశ నిశ్శ్వాసలు, ఆరోగ్యకరమైన కళ్ళు, చెవులు, మనసు, వాక్కు, ఆత్మను ఇచ్చు గాక. ఇటువంటి కార్యములు ఇంకా చేయుటకు శక్తిని ఇచ్చు గాక. ఒకటి, మూడు, ఐదు, ఏడు, తొమ్మిది, పదకొండు, పదమూడు, పదిహేను, పదిహేడు, పంతొమ్మిది, ఇరవై ఒకటి, ఇరవై మూడు, ఇరవై ఐదు, ఇరవై ఏడు, ఇరవై తొమ్మిది, ముప్ఫై ఒకటి, ముప్ఫై మూడు నాతో ఉండు గాక. నాలుగు, ఎనిమిది, పన్నెండు, పదహారు, ఇరవై, ఇరవై నాలుగు, ఇరవై ఎనిమిది, ముప్ఫై రెండు, ముప్ఫై ఆరు, నలభై, నలభై నలుగు, నలభై ఎనిమిది నాతో ఉండు గాక. ఆహారము, ధాన్యము, ధన్యోత్పత్తి, దాని వృద్ధి, అగ్నిహోత్రము నాతో ఉండు గాక. దీనికొరకు నేను పంచ భూతములను, దిక్పాలకులను నాయందు కరుణ చూపవలసినదిగా ప్రార్థిస్తున్నాను.
(ఇక్కడ చెప్పబడిన సంఖ్యలు సరి సంఖ్యలు భూలోక సంబంధమైనవి గా, బేసి సంఖ్యలు దేవలోక సంబంధమైనవిగా వ్యాఖ్యానించ బడినది. ఇంకొక వ్యాఖ్యానం - ఒక ప్రకృతి, మూడు గుణములు, పంచ భూతములు, ఏడు ఇంద్రియములు, నవ రంధ్రములు...ఇలా ప్రతి ఒక సంఖ్య ఒక విశేషమైన ప్రాధాన్యత సంతరించు కొన్నట్లు)
కామధేనువు దేవతలను ఆహ్వానించు గాక; మనువు కార్యము చేయు గాక. బృహస్పతి మంత్రములు చదువు గాక. విశ్వ దేవుడు పధ్ధతి చెప్పు గాక. ఓ భూమాత! మాకు ఆటంకములు కలిగించకు. నేను ఎల్లప్పుడూ మంచి ఆలోచనలతో, సత్కార్యములు చేస్తూ, దేవతలకు ప్రీతికరమైన వస్తువులు తెచ్చి సమర్పిస్తాను. సజ్జనులారా! నేను ఈ విధంగా చేసినందు వలన ఆ దేవతలు, పితరులు నన్ను రక్షింతురు గాక. ఓం శాం తి శాంతి శాంతి ఇది కృష్ణ యజుర్వేదములోని, నాలుగవ కాండ, ఏడవ ప్రపాఠకములోనిది.
* ఇష్టకామేశ్వరి *
కోరిన కోర్కెలు తీర్చే ఇష్టకామేశ్వరి:
భారతదేశంలో ఇష్టకామేశ్వరి దేవి పేరుతో శ్రీశైల క్షేత్రంలో తప్ప మరెక్కన్నా మరో ఆలయం కనిపించదు. శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించే ప్రతి ఒక్కరూ ఇష్టకామేశ్వరిదేవి దర్శనం చేసుకోలేరు. అదృష్టవంతులు మాత్రమే ఇష్టకామేశ్వరి అమ్మవారి గురించి తెలుసుకుని అక్కడికి వెళ్లే ప్రయత్నం చేస్తారు. భక్తులు మనస్ఫూర్తిగా కోరుకునే ఎటువంటి కోరికలు అయినా ఈ అమ్మవారు నెరవేరుస్తుందనే నమ్మకం ఇక్కడ ఎంతో బలంగా ఉంది. భక్తులు ఈ అమ్మవారి నుదుట బొట్టుపెట్టి తమ కోరికలు కోరుకుంటారు. ఆ సమయంలో అమ్మవారి నుదురు మెత్తగా, ఓ మానవ శరీరాన్ని తాకిన అనుభూతిని ఇస్తుంది. భక్తులు ఈ మహత్యాన్ని చూసి తన్మయత్వానికి లోనవుతారు.
పూర్వం అటవీ ప్రాంతంలో సిద్ధులచే మాత్రమే కొలవబడే ఈ అమ్మవారు నేడు సామాన్య ప్రజల చేత కూడా పూజలందుకుంటున్నారు. శ్రీశైలంలో ఉన్న గొప్ప రహస్యాల్లో ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయం కూడా ఒకటి. ఎంత గొప్ప కోరికనైనా ఈ అమ్మవారు తీరుస్తుంది కాబట్టి ఆమెను ఇష్టకామేశ్వరి దేవిగా కొలుస్తారు. పరమశివుడు, పార్వతి దేవిల ప్రతిరూపంగా ఈ అమ్మవారి విగ్రహాన్ని భావిస్తారు.
ఇష్టకామేశ్వరి దేవి చతుర్భుజాలను కలిగి ఉంటుంది. రెండు చేతులతో తామర మొగ్గలను, మరో రెండు చేతుల్లో ఓ చేతిలో శివలింగాన్ని, మరో చేతిలో రుద్రాక్షమాలతో తపస్సు చేస్తున్నట్లు అమ్మవారు కనిపిస్తారు. ఓ గుహలాంటి దేవాలయంలో దీపపు వెలుగు మధ్య అమ్మవారి దర్శనం ఆధ్యాత్మిక భావనను పెంచుతుంది. ఇక్కడ పరిసరాల్లో కూర్చుకుని కాసేపు ధ్యానం చేస్తే మనసుకు ఎంతో ప్రశాంతత చేకూరుతుంది. స్థానికంగా నివసించే చెంచులచే అమ్మవారు పూజలందుకుంటున్నారు.
సాహసోపేత ప్రయాణం: శ్రీశైలం కూడలి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో దట్టమైన నల్లమల అడవుల మధ్య ఇష్టకామేశ్వరి దేవి ఆలయం ఉంటుంది. ఇక్కడికి ప్రయాణం ఎంతో సాహసంతో కూడుకుని ఉంటుంది. ఎటువంటి కార్లు వెళ్లలేని ఈ ప్రదేశానికి శ్రీశైలం నుంచి పరిమిత సంఖ్యలో కొన్ని జీపులు మాత్రమే నడుస్తాయి.
శ్రీశైలం వద్ద ప్రయాణికులతో జీపు నిండిన తరువాత మాత్రమే వాహనం బయలుదేరుతుంది. డోర్నాల్ మార్గంలో దాదాపు 12 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తరువాత ఓ అటవీ మార్గం కనిపిస్తుంది. అక్కడ ఫారెస్ట్ అధికారుల అనుమతితో జీపులు లోపలికి వెళతాయి. ఈ అడవిలో సౌకర్యవంతమైన రోడ్డు మార్గం లేకపోవడంతో దారిలో ఉండే అనేక బండరాళ్లను దాటుకుని జీపు వెళ్లాల్సి ఉంటుంది. కొన్ని సమయాల్లో జీపు పల్టీ కొడుతుందేమో అన్న భయం కూడా కలుగుతుంది. కాకపోతే డ్రైవర్లు ఈ మార్గంలో ఎంతో నేర్పు కలిగిన వారు కావడంతో సురక్షితంగానే గమ్యస్థానానికి చేరుస్తారు.
దాదాపు 40 నిమిషాల పాటు కుదుపుల మధ్య సాగే ఈ ప్రయాణం వృద్ధులకు అంత శ్రేయస్కరం కాదు. మార్గ మధ్యంలో జంతువుల అరుపులు, జలపాతాల సవ్వళ్లు కూడా వినిపిస్తాయి. ఇష్టకామేశ్వరి దేవి ఆలయానికి ఒక కిలోమీటరు దూరంలో జీపులను నిలిపి వేస్తారు. జీపు నుంచి కింది దిగే ప్రయాణికులు అక్కడి ప్రకృతి అందాలను చూసి తమ కష్టాన్ని మరచిపోతారు. అటవీ మార్గంలో ఒక కిలోమీటరు నడక తరువాత పర్యాటకులకు చెంచు ప్రజల గూడాల మధ్య అమ్మవారి ఆలయం కనిపిస్తుంది. స్థానికులు పర్యాటకులకు అమ్మవారి విశిష్టతను, ఆ ప్రాంత ప్రత్యేకతలను తెలియజేస్తారు.
రాత్రి సమయంలో ఈ అటవీ మార్గంలో మృగాలు సంచరించడంతో సాయంత్రం 5 దాటిన తరువాత అడవిలోకి జీపులను అనుమతించరు. కోరిన కోర్కెలు తీర్చే ఎంతో మహిమ గల ఈ రహస్య ఆలయాన్ని శ్రీశైలం వెళ్లే పర్యాటకులు తప్పక దర్శించాలి._
శివుడు శ్మశానంలో కొలువై వుండటానికి కారణమేంటి?
శివుడికి ఇష్టమైన ప్రాంతం శ్మశానం. శవాలను దహనం చేసే ఈ ప్రాంతంలో శివుడు ఎందుకు కొలువై ఉంటాడో సాక్షాత్ పార్వతీదేవికి సందేహం వచ్చింది......ఇదే విషయాన్ని మహాశివుడి వద్ద పార్వతీ దేవి స్వయంగా ప్రస్తావిస్తుంది. దీనికి శివుడు ఏమని సమాధానం ఇచ్చారంటే.......
పార్వతీ........శ్మశానంలో నేనేమీ ప్రయత్న పూర్వకంగా కూర్చోవడం లేదు. లోకంలో ఉగ్రమైన భూతములన్నీ కొలువైవున్న ప్రాంతం శ్మశానం.....ఇక్కడ ఏ ఒక్క పుణ్యకార్యం జరుగకుండా భూత ప్రేతాత్మలు అడ్డుకుంటున్నాయి. దీన్ని గమనించిన బ్రహ్మ......స్వయంగా నా వద్దకు వచ్చి ఓ విన్నపం చేశారు......
లోకంలో మంగళ కార్యాలేవీ జరగడం లేదు. దీనికి కారణం ఉగ్రభూతములన్నీ లోకంలో కొలువై ప్రతి మంగళకార్యాన్ని అడ్డుకుంటున్నాయి......
పైగా, ఈ లోకంలో సంచరించే ప్రతి బిడ్డా మీ బిడ్డలే కదా..అన్ని ప్రాణులకు తల్లిదండ్రులు మీరే కదా.......మీ పిల్లలు చేసే తప్పొప్పులను సరిదిద్దుతూ వారిని అదుపు ఆజ్ఞల్లో ఉంచేందుకు శ్మశానం లోనే కొలువై వుండాలని ప్రార్థించాడు. అందువల్లే నేను శ్మశానంలో కొలువై వున్నాను అని చెప్పాడు.
ఇది మొదటి కారణం కాగా, మరో రెండు కారణాలు కూడా ఉన్నాయి......
జీవించి వున్న సమయంలో నేనే గొప్ప అని జబ్బలు చరుచుకునే ధనవంతుడు, ఆకలితో అలమటించే కడు పేదవాడు చనిపోయాక వచ్చేది శ్మశానానికే... అంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ సమానమే.....ఈ విషయాన్ని లోకానికి చాటి చెప్పేందుకే శ్మశానంలో ఉంటున్నాడు పరమేశ్వరుడు.....జీవించి వున్నంతకాలం నావాళ్లూ నావాళ్లూ అంటుంటారు. తీరా చనిపోయాక శ్మశానంలో ఒంటరిగా వదిలిపెట్టి వెనక్కి కూడా తిరిగి చూడకుండా వెళ్ళిపోతారు...... అలా శ్మశానంలో వదిలి వెళ్లిన వారికి తోడుగా నేనున్నాను అని చెప్పేందుకే అక్కడ నివశిస్తున్నట్టు పార్వతికి శివుడు చెపుతాడు........
అసలు ఈ లోకమే ఓ శ్మశానం. చనిపోయేవాడు శ్మశానంలోకి వచ్చి చనిపోతున్నాడా? లేదు కదా.. గృహాల్లో, ఆస్పత్రుల్లో, రోడ్లపై, పార్కుల్లో ఇలా ఎక్కడ పడితే అక్కడ చనిపోతున్నారు. అంటే ఈ లోకమంతా ఓ శ్మశానమే........ఇలా చనిపోయిన ప్రాణులన్నీ ఈ బ్రహ్మాండంలో కలిసిపోయే ప్రాంతం శ్మశానం. ఈ ప్రాంతంలో నేను నివశిస్తున్నాను కాబట్టే శ్మశానం అన్నారు. పైగా, ఈ లోకంలో మృత్యుభీతి లేకుండా చనిపోయే ప్రాంతమేదైనా ఉందంటే అది కాశీ అని పార్వతికి శివుడు వివరిస్తాడు..
ఓం నమఃశివా య..
ప్రత్యంగిరామాత
ప్రత్యంగిరామాత మహామంత్రభీజాలను మొట్ట మొదట దర్శించిన ఋషి శ్రేష్టులు ఆంగీరస, ప్రత్యంగిరా .ఈ ఇరువురు మహాఋషులు గాడమైన తపోసాధనలో వుండగా అగమ్య గోచరమైన అనంత శూన్యము నుండి ఉద్భవించిన ప్రత్యంగిర భీజాక్షరాలను తమ యోగ దృష్టి తో దర్శించారు ఈ ఋషిపుంగవులిద్ధరు. అందుకే ఇరువురు ఋషోత్తముల పేర్ల మేలి కలయకతో ఆ భీజాక్షరాలకు ఇలా ప్రత్య +అంగీర= ప్రత్యంగిర అనే పేరు స్ఠిరపడింది .ఈ ప్రత్యంగిరా మహామంత్రము అధర్వణ వేదములోని మహాకాళీ కాండములో మహాప్రత్యంగిర సూక్తములో అంతర్భాగంగా వుంది . ప్రత్యంగిరామాత పుట్టినవైనము ;-కృతయుగములో హిరణ్యకశ్యుపుని సం హరించటానికి శ్రీహరి నరసిం హా అవతారములో రాతి స్ఠంభంలోనుండి ఉద్భవించి అసురసంద్యవేళ గడప పై తన పదునైన గోళ్ళతో కడుపు చీల్చి సం హరించాడు రాక్షసాధమున్ని అయినా నరసిం హ మూర్తి కోపం చల్లారలేదు నరసిం హుని క్రోధానికి సర్వ జగత్తు నాశనమౌతుందని భయపడ్డ దేవతలు నరసిం హుని కోపాన్ని చల్లార్చటానికి పరమేశ్వరున్ని ప్రార్ధించారు. అంతట పరమేశ్వరుడు వీరభధ్రావతారములో నరసిం హుని ముందుకు వచ్చి జ్ఞానభోధతో నరసిం హుని కోపాన్ని చల్లార్చాలని ప్రయత్నిస్తాడు. కానీ నరసిం హ మూర్తి మరింత కోపంతో అష్టముఖగండభేరుండమూర్తి అవతారంతో వీరభద్రుని పైకి వురుకుతాడు. అంతట వీరభద్రుడు శరభా అవతారం దాలుస్తాడు.శరభుని రెండు రెక్కలలో ఒక రెక్కలొ శూలిని ,మరో రెక్కలో మహాప్రత్యంగిరా శక్తులు దాగి వుంటాయి. అష్టముఖగండభేరుండమూర్తి తనవాడి అయిన ముక్కుతో శరభేశ్వరున్ని ముక్కలు చేయ్యటానికి యత్నిస్తాడు. శరభేశ్వరుని శూలిని శక్తి దాగివున్న రెక్క అష్టముఖగండబేరుండమూర్తి ముక్కుకి చిక్కుతుంది రెండో రెక్క నుండి మహాప్రత్యంగిరాదేవి ఉద్భవించింది.
మహాప్రత్యంగిరరూపవర్ణన: నేలనుండి నింగిని తాకేటట్లుండే మహాభారీకాయంతో కూడిన స్త్రీదేహం ఆ స్త్రీ దేహము కారుఛీకటితోకూడిన నల్లనివర్ణం మగసిం హపు వేయ్య తలలతో ఓకవైపు ఏర్రన్ని నేత్రాలు మరోవైపు నీలి నేత్రాలతో రెండు వేల ముప్పైరెండు చేతులతో ఉద్భవిస్తుంది ప్రత్యంగిరామాత మొదటి నాలుగు చేతులలో ఒకచేతిలో త్రిశూలము మరోచేతిలో సర్పము అలంకారంగాచుట్టుకున్న డమురుకము,మరో చేతిలో ఈటె వంటి కత్తి మరోచేతిలో అసురుని శిరస్సు మిగితా అన్ని చేతులలో విభిన్న ఆయుధాలతో మెడలో కపాల మాలతో అత్యంత పొడువైన కేశాలతో కేశాల చివర శక్తి తోకూడిన తంతువులు నాల్గు సిం హల స్వర్ణ రధంపై[ఈ నాల్గు సింహలను నాల్గు వేదాలు గా కొందరు మరికొందరు నాల్గు పురుషార్ధాలుగానూ ఇంకొందరు నాల్గు ధర్మాలగానూ విశ్లేషిస్తారు సాధకులు} ఉద్బవించింది.ఈమె ఉద్బవించిన సరస్సు నేటికి హిమాచల్ ప్రదేశ్ లోని ఒక రహస్య ప్రదేశములోవుంది ఆ సరస్సులో నీళ్లు పసుపు పచ్చని వర్ణంలో వుంటాయి ఈ సరస్సు కు ఎల్లప్పుడు సిం హాల గుంపు కాపలాగావుంటుంది అని ఎంతో మంది సిద్ధ సాదకులు నిక్కచ్చగా చెపుతున్నారు
మహామాత మహా ప్రత్యంగిర స్వరూపాన్ని చూసి నరసిం హ మూర్తి అహంకారాన్ని వీడి తన అవతార రహస్యాన్ని గుర్తెరిగి ఉగ్ర నరసిం హ అవతారాన్ని చాలించి యోగ నరసిం హ మూర్తిగా కొలువు తీరుతాడు. అందుకే మహా ప్రత్యంగిరను కాళీ సహస్రనామస్తోత్రంలో నృసిం హిక అంటూ వర్ణించారు !!
అన్నపూర్ణా దేవి
అక్షయ తృతీయ నాడే అన్నపూర్ణా దేవి ఆవిర్భావ దినోత్సవం
ప్రతీ ఆస్తీకునికి ఈ చిత్తరువు సుపరిచితమే. “భిక్షాం దేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి” అని ఆది శంకరాచార్యులు కీర్తించిన అన్నపూర్ణాష్టకం అందరూ నోరారా పాడుకుని అమ్మవారి కరుణగా అన్నం తింటున్నాము. మనలాంటి అల్పులకు అన్నం పెట్టింది అమ్మవారు సరే మరి సంపూర్ణ పరబ్రహ్మ అయిన ఈశ్వరునికి అమ్మవారు భిక్ష ఇవ్వడం ఏమిటి? అసలేది అవసరం లేని భవుడు దేహి అని అమ్మవారిని అడగడం ఏమిటి? ఆదిభిక్షువు గా అలా ఎందుకు అవతారం ఎత్తవలసి వచ్చింది? అంటే అంతా ఆయన లీల. శివ, శక్తి అవిభాజ్యం, కానీ లీలావినోదంగా ఇద్దరూ కలిసి ఆడిన నాటకం ఏమిటో ఒకసారి చూద్దాం.
ఒకానొక శుభోదయంనాడు అమ్మవారు అయ్యవారు కైలాశశిఖరం మీద సుఖాశీనులై ఉండగా ఎప్పటిలాగానె పార్వతీదేవి శివుని ప్రకృతి పురుషులలో ఎవరు అధికులు అని ప్రశ్న సంధించింది. శుద్ధసత్త్వమైన పురుషుని వలననే ప్రకృతికి అస్తిత్వం ఉన్నదని శివుడు చెప్పగా ఇరువురి మధ్య చిన్న వాదోపవాదాలు జరిగి ఆఖరకు అమ్మవారు ప్రకృతి ప్రాభవం తెలియజేయసంకల్పించి అమ్మవారు శక్తిని ఉపసంహారం చేసి అంతర్ధానం అవుతుంది. దానితో పోషణ లేక లోకాలన్నీ అల్లకల్లోలం అయిపోతాయి. కానీ తన సృష్టిలో ఉన్న జీవులన్నీ ఆకలితో అలమటిస్తుంటే తట్టుకోలేక అమ్మవారు కాశీ పట్టణంలో తానే గరిట పట్టుకుని వండి కోటానుకోట్ల జీవులకు వండి పెట్టడం మొదలుపెట్టింది. శివగణమంతా ఆకలికి తట్టుకోలేక హాహాకారాలు చేస్తుంటే తనను నమ్ముకున్న వారి బాధ చూడలేక ఏ ఆకలి దప్పులు లేని నిరతిఆనందస్వరూపుడు శివుడు భిక్షాటనకై భిక్షపాత్ర తీసుకుని కాశీకి వెళ్లి అన్నపూర్ణ చేతిలో అన్నం స్వీకరిస్తాడు. అప్పుడు ఇద్దరిలో ఎవరూ అధికులు కారని, ప్రకృతి పురుషులిద్దరూ అన్నింటా సమానమని చాటి చెప్పి మరల కైలాశానికి వెళ్ళిపోతారు. కాశీ లో అన్నపూర్ణగా అమ్మ శక్తి నిలుస్తుంది.
లౌకికంగా చూస్తె ఏమిటి వీరు పోట్లాడుకోవడం ఏమిటి ఆధిక్యం కోసం పోటీ పడ్డట్టు అనిపిస్తుంది కానీ వారు ఆడిన నాటకం ద్వారా చెప్పబోయిన పరమసత్యం మనం అర్ధం చేసుకోవాలి. పురుషాధిక్య ప్రపంచంలో ఎవరైనా పురుషుడే అధికుడని అనుకుని పొరబడే అవకాశం ఉండడం వలన అందరికీ తగు పాఠం చెప్పడానికి దివ్యదంపతులిద్దరూ కలిసి ఆడిన నాటకం ఇది. శక్తి లేకపోతే స్థూల శరీరం ఉండి లాభం లేదు. ఎవరైనా శక్తి హీనుడు అంటారు కానీ విష్ణుహీనుడు, శివహీనుడు అని అనరు. శరీరం లేని శక్తి నిరర్ధకం. శక్తి ఉన్న శరీరం శివం లేకపోతే శవం. కాబట్టి రెండూ సమపాళ్లలో ఉంటేనే మనుగడ అని చాటి చెప్పడానికి ఇద్దరిగా ఉన్న ఒక్కరు ఆడిన నాటకం.
ఓం శ్రీ అన్నపూర్ణా దేవ్యై నమః
శివుడు-ఏకాదశ రుద్రులు
శివుడు మనకు పదకొండు అవతారాలతో ఏకాదశ రుద్రులుగా దర్శనమిచ్చును. ఓంనమస్తేస్తు భగవన్ "విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయనమః" అని రుద్రనమకంలో చెప్పబడింది. దీనిప్రకారం ఏకాదశ రుద్రులపేర్లు 1. విశ్వేశ్వరుడు, 2.మహాదేవుడు,3. త్ర్యంబకుడు, 4.త్రిపురాంతకుడు, 5.త్రికాగ్నికాలుడు, 6.కాలాగ్నిరుద్రుడు, 7.నీలకంఠుడు, 8.మృత్యుంజయుడు, 9.సర్వేశ్వరుడు,10. సదాశివుడు, 11. శ్రీమన్మహాదేవుడు. ఏకాదశ రుద్రులు,
ఓం శ్రీ మాత్రే నమః -శక్తిపీఠాలు
*శక్తిపీఠాలు అంటే ఎన్ని వున్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి*---*పురాణ కథ*
*ఒకప్పుడు దక్షుడు బృహస్పతియాగం చేయదలంచి అందరినీ ఆహ్వానించాడు, కానీ తనకిష్టం లేని శివుడిని పెళ్ళాడిందన్న కోపంతో తన కూతురైన సతీదేవి (దాక్షాయణి) ని, అల్లుడైన శివుడిని పిలవలేదు,
ఈ కార్యక్రమ విషయం తెలిసిన సతీదేవి, శివుడు వారించినా వినకుండా, పుట్టింటివారు ప్రత్యేకంగా పిలవాలేమిటి? అని ప్రమథగణాలను వెంటబెట్టుకొని యాగానికి వెళ్ళింది గాని, అక్కడ తన తండ్రి వల్ల అవమానానికి గురయ్యింది.
ముఖ్యంగా తండ్రి చేస్తున్న శివనింద సహించలేక ఆమె యాగాగ్నిలోకి దూకి మరణించింది.దీనికి ఆగ్రహించిన శివుడు తన గణాలతో యాగశాలను ధ్వంసం చేశాడు. . సతీవియోగదుఃఖంతీరనిశివుడుఆమెమృతశరీరాన్నిఅంటిపెట్టుకొనిఉండి తన జగద్రక్షణాకార్యాన్ని మానివేశాడు. దేవతల ప్రార్థనలు మన్నించి విష్ణువు సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండాలుగా చేసి, శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు.
సతీదేవి శరీరభాగాలు పడిన స్థలాలు శక్తి పీఠాలుగా భక్తులకు, ముఖ్యంగా తంత్ర సాధకులకు ఆరాధనా స్థలాలు అయినాయి.
ప్రతీ శక్తిపీఠంలోనూ, దాక్షాయణీ, భైరవుని (శివుని) తోడుగా దర్శనమిస్తుంది.శక్తిపీఠాలు ఉన్న స్థలాలను గుర్తించడంలో భిన్నాభిప్రాయాలు, భేదాభి ప్రాయాలున్నాయి.
ఒక వివరణ ప్రకారం ఈ స్థలాలు ఇలా ఉన్నాయి:
*18 శక్తిపీఠాలు*
అష్టాదశ శక్తిపీఠాలు ఏవి అనే విషయానికి ప్రామాణికంగా చెప్పబడే ప్రార్థనా శ్లోకం.
*లంకాయాం శాంకరీదేవీ, కామాక్షీ కాంచికాపురే
ప్రద్యుమ్నే శృంఖళాదేవీ, చాముండీ క్రౌంచపట్టణే
అలంపురే జోగుళాంబా, శ్రీశైలే భ్రమరాంబికా
కొల్హాపురే మహాలక్ష్మీ, మాహుర్యే ఏకవీరికా
ఉజ్జయిన్యాం మహాకాళీ, పీఠిక్యాం పురుహూతికా
ఓఢ్యాయాం గిరిజాదేవి, మాణిక్యా దక్షవాటికే
హరిక్షేత్రే కామరూపా, ప్రయాగే మాధవేశ్వరీ
జ్వాలాయాం వైష్ణవీదేవీ, గయా మాంగళ్యగౌరికా
వారణాస్యాం విశాలాక్షీ, కాష్మీరేషు సరస్వతీ
అష్టాదశ సుపీఠాని యోగినామపి దుర్లభమ్
సాయంకాలే పఠేన్నిత్యం, సర్వశతృవినాశనమ్
సర్వరోగహరం దివ్యం సర్వ సంపత్కరం శుభమ్*
1. శాంకరి - శ్రీలంక
ఈ మందిరం ఎక్కడుందో స్పష్టమైన ఆధారాలు లేవు. కాని ఒక వివరణ ప్రకారం ఇది దేశం తూర్పుతీరంలో ట్రిన్‌కోమలీలో ఉండవచ్చును. 17వ శతాబ్దంలో పోర్చుగీసు వారి ఫిరంగుల వల్ల మందిరం నాశనమయ్యిందంటారు. ప్రస్తుతం ఆ ప్రదేశంలో ఒక స్తంభం మాత్రం ఉంది. దగ్గరలో 'త్రికోణేశహవర స్వామి' అని పిలువబడే శివుని మందిరం ఉంది. ఆ మందిరం ప్రక్కనే ఒక దేవీ మందిరం కూడా ఉంది. ట్రిన్‌కోమలీ నగరంలో కాళీమందిరం ప్రసిద్ధమైనది.
2. కామాక్షి - కాంచీపురం.
తమిళనాడు - మద్రాసు నగరానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది.
3. శృంఖల ప్రద్యుమ్ననగరం.
పశ్చిమ బెంగాల్ ఇది కొలకత్తాకు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాని ఇప్పుడు ఏ విధమైన మందిరం గుర్తులూ లేవు. అయితే కొలకత్తాకు 135 కిలోమీటర్ల దూరంలోని గంగాసాగర్ కూడా ఒక శక్తిపీఠంగా పరిగణింపబడుతున్నది.
4. చాముండి - క్రౌంచ పట్టణం.
మైసూరు, కర్ణాటక - అమ్మవారు చాముండేశ్వరీ దేవి.
5. జోగుళాంబ-అలంపూర్.
తెలంగాణ 'తుంగభద్ర' & కృష్ణ నదుల సంగమ క్షేత్రంలో ఉంది.
6. భ్రమరాంబిక - శ్రీశైలం.
ఆంధ్రప్రదేశ్ - కృష్ణానదీ తీరాన అమ్మవారు మల్లికార్జునస్వామి సమేతంగా ఉంది. శ్రీశైలం 12 జ్యోతిర్లింగాలలో కూడా ఒకటి.
7. మహాలక్ష్మి - కొల్హాపూర్..
మహారాష్ట్ర - ఆలయంలో ప్రధాన దేవత విగ్రహం స్వచ్ఛమైన మణిశిలతో చేయబడింది. అమ్మవారి తలపైన ఐదు తలల శేషుని ఛత్రం ఉంది. ప్రతి సంవత్సరం మూడు మార్లు అమ్మవారి పాదాలపై సూర్యరశ్మి పడుతుంది.
8. ఏకవీరిక - మాహుర్యం..
లేదా మహార్, నాందేడ్ జిల్లా, మహారాష్ట్ర - ఇక్కడి అమ్మవారిని 'రేణుకా మాత'గా కొలుస్తారు. షిరిడీ నుండి ఈ మాతనుదర్శించుకొనవచ్చును.
9. మహాకాళి - ఉజ్జయిని..
మధ్య ప్రదేశ్ - ఇదే ఒకప్పుడు అవంతీ నగరం అనబడేది. ఇది క్షిప్రా నది తీరాన ఉంది. మహాకవి కాళిదాసుకు విద్యను ప్రసాదించిన అమ్మవారు మహాకాళియే.
10. పురుహూతిక - పీఠిక్య..
లేదా పిఠాపురం, ఆంధ్ర ప్రదేశ్ - కుకుటేశ్వర స్వామి సమేతయై ఉన్న అమ్మవారు.
11. గిరిజ - ఓఢ్యదేశం ఒడిశా..
జాజ్‌పూర్ కే రోడ్ నుండి 20 కిలోమీటర్లు - వైతరిణీ నది తీరాన ఉంది.
12. మాణిక్యాంబ - దక్షవాటిక..
లేదా ద్రాక్షారామం, ఆంధ్ర ప్రదేశ్ - కాకినాడ నుండి 20 కిలోమీటర్ల దూరంలో.
13. కామరూప-హరిక్షేత్రం..
అసోం, గౌహతి నుండి 18 కిలోమీటర్లు, అసోం - బ్రహ్మపుత్రా నదీతీరాన వుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో అంబవాచి ఉత్సవం జరుగుతుంది.
14. మాధవేశ్వరి -ప్రయాగ..
(అలహాబాదు), ఉత్తర ప్రదేశ్, త్రివేణీ సంగమం సమీపం -
ఈ అమ్మవారిని అలోపీదేవి అని కూడా అంటారు.
15. వైష్ణవి - జ్వాలాక్షేత్రం..
కాంగ్రా, హిమాచల్ ప్రదేశ్ -
ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉండదు. ఏడుజ్వాలలు పురాతన కాలంనుండి వెలుగుతున్నాయి.
16. మంగళ గౌరి - గయ.
బీహారు - పాట్నా నుండి 74 కిలోమీటర్లు.
17. విశాలాక్షి - వారణాసి..ఉత్తర ప్రదేశ్.
18. సరస్వతి - జమ్ముకాష్మీరు.
అమ్మవారిని కీర్ భవాని అని కూడా అంటారు.పాక్ ఆక్రమిత కాశ్మీరులో ముజఫరాబాద్ కు 150 కి.మీ.ల దూరంలో ఉందంటారు.
*51 శక్తి పీఠాలు*--------1- సంఖ్య-స్థలము 2- శరీరభాగము / ఆభరణము 3- శక్తిరూపము
4- శివరూపము
1. హింగుళ, కరాచీ నుండి 125 కి.మీ., పాకిస్తాన్ బ్రహ్మరంథ్రము (శిరోభాగము)...కొత్తారి...భీమలోచనుడు
2. షర్కారె,సుక్కార్ స్టేషను వద్ద, కరాచీ, పాకిస్తాన్...కన్నులు.. మహిషమర్దిని...... క్రోధీశుడు
3. సుగంధ, షికార్ పూర్, బారిసాల్ నుండి 20 కి.మీ., బంగ్లాదేశ్ - సోంధ్ నది ఒడ్డున.... ముక్కు ... సునంద.. త్ర్యంబకేశ్వరుడు
4. అమరనాధ్ శ్రీనగర్ నుండి 94 కి.మీ, కాష్మీర్ ..గొంతు ..మహామాయ..-త్రిసంధ్యేశ్వరుడు
5.జ్వాలాముఖి, కాంగ్రా, పఠాన్ కోట్ వద్ద ..నాలుక ..సిద్ధిద (అంబిక)..ఉత్తమ భైరవుడు
6. జలంధర్ (దేవీ తాలాబ్)
ఎడమ స్తనము
త్రిపురమాలిని
భీషణుడు
7. వైద్యనాధం, దేవోగర్, ఝార్ఖండ్
గుండె
జయదుర్గ
వైద్యనాథుడు
8. గుజ్యేశ్వరి మందిరము, పశుపతినాథ మందిరం వద్ద, నేపాల్
మోకాళ్ళు
మహాశిర
కపాలి
9. మానస, టిబెట్కు దగ్గర, కైలాసపర్వత సమీపమున మానస సరోవరంలో ఒక శిల
కుడి చేయి
దాక్షాయిని
అమరుడు
10. బిరాజా, ఒడిషా
నాభి
విమల
జగన్నాథుడు
11. ముక్తినాథ మందిరం, గండకి నది ఒడ్డున, పోఖ్రా, నేపాల్
నుదురు
గండకీ చండి
చక్రపాణి
12. బహుళ, అజయ నది ఒడ్డున, కేతుగ్రామ్, కటువా దగ్గర, బర్ద్వాన్, పశ్చిమ బెంగాల్
ఎడమ చేయి
బహుళా మాత
భిరుకుడు
13. ఉజ్జయిని, గుస్కురా స్టేషను, బర్ద్ వాన్, పశ్చిమ బెంగాల్
కుడి మణికట్టు
మంగళ చండిక
కపిలాంబరుడు
14. ఉదయపూర్ వద్ద, త్రిపుర, మతబారి కొడలపైన, రాధాకిషోర్ గ్రామం
కుడి కాలు
త్రిపురసుందరి
త్రిపురేశుడు
15. ఛొట్టోగ్రామ్, చంద్రనాధ్ కొండలపైన, సీతాకుండ్ స్టేషను వద్ద, చిట్టగాంగ్ జిల్లా, బంగ్లాదేశ్
కుడి చేయి
భవాని
చంద్రశేఖరుడు
16. త్రిస్రోత, శల్బారి గ్రామం, జల్పాయ్ గురి జిల్లా, పశ్చిమబెంగాల్
ఎడమ కాలు
భ్రామరి
అంబరుడు
17. కామగిరి, కామాఖ్య, నీలాచల పర్వతాల వద్ద, గౌహతి, అస్సాం
యోని
కామాఖ్య
ఉమానందుడు
18. జుగాద్య, ఖీర్ గ్రామ్, బర్ద్వాన్ జిల్లా, పశ్చిమబెంగాల్
కుడి పాదము
జుగాద్య
క్షీర ఖండకుడు
19. కాళిపీఠ్, కాళీఘాట్, కొలకత్తా
కుడి బొటనవేలు
కాళిక
నకులీషుడు
20. ప్రయాగ, త్రివేణీ సంగమము, అలహాబాదు, ఉత్తర ప్రదేశ్
కుడి వేళ్ళు
లలిత
భవుడు
21. జయంతి, కాలాజోర్ బోర్ భోగ్, ఖాసి గ్రామం, జయంతియా పరగణాలు, సిల్హెట్ జిల్లా, బంగ్లాదేశ్
ఎడమ తొడ
జయంతి
క్రమదీశ్వరుడు
22. కిరీత్, కిరీత్ కొండ గ్రామం, లాల్ బాగ్ కోర్ట్ స్టేషను వద్ద, ముషీరాబాద్ జిల్లా, పశ్చిమ బెంగాల్
కిరీటము
విమల
సంవర్తుడు
23. వారణాసి (కాశి), గంగానది ఒడ్డున మణికర్ణికా ఘట్టము, ఉత్తరప్రదేశ్
చెవిపోగు
విశాలాక్షి, మణికర్ణి
కాలభైరవుడు
24. కన్యాశ్రమము, కన్యాకుమారి, కుమాఱి మందిరం ప్రాంగణంలో భద్రకాళి గుడి, తమిళనాడు
వీపు
శర్వాణి
నిమీశుడు
25. కురుక్షేత్రం, హర్యానా
మడమ ఎముక
సావిత్రి
స్థాణువు
26. మణిబంధ్, పుష్కర్, గాయత్రి కొండల వద్ద, ఆజ్మీర్, రాజస్థాన్
రెండు చేతి కడియాలు
గాయత్రి
సర్వానందుడు
27. శ్రీశైల్, జైన్ పూర్, సిల్నెట్, బంగ్లాదేశ్
మెడ
మహాలక్ష్మి
సంబరానందుడు
28. కంచి, కొపై నది వద్ద, బోల్పూర్ స్టేషను, బీర్బమ్, పశ్చిమబెంగాల్
ఎముక
దేవగర్భ
రురుడు
29. కల్మాధవ్, శోన్ నది ఒడ్డున కొండ గుహలో, అమరకంటక్, మధ్యప్రదేశ్
ఎడమ పిరుదు
కాళి
అసితాంగుడు
30. షోన్ దేశ్, నర్మదా నది మూలము వద్ద, అమరకంటక్, మధ్యప్రదేశ్
కుడి పిరుదు
నర్మద
భద్రసేనుడు
31. రామగిరి, చిత్రకూటం, ఝాన్సీ, మాణిక్ పూర్ వద్ద, ఉత్తరప్రదేశ్
కుడి స్తనం
శివాణి
చందుడు
32. వృందావనం, భూతేశ్వర మాధవ మందిరం, ఉత్తరప్రదేశ్
కేశాభరణం
ఉమ
భూతేశ్
33. శుచి, శుచితీర్థం శివమందిరం, కన్యాకుమారి వద్ద, తమిళనాడు
పై దవడ పండ్లు
నారాయణి
సంహరుడు
34. పంచసాగరం (స్థలం తెలియదు)
క్రింది దవడ పండ్లు
వారాహి
మహారుద్రుడు
35. కార్తోయతాత్, భవానీపూర్ గ్రామం, సెర్పూర్, బగురా జిల్లా, బంగ్లాదేశ్
ఎడమకాలి పట్టీ
అర్పణ
వమనుడు
36. శ్రీ పర్వతం, లడక్ వద్ద, కాష్మీర్ - (శ్రీ శైలం, ఆంధ్రప్రదేశ్ అని కూడా చెబుతారు)
కుడికాలి పట్టీ
శ్రీ సుందరి
సుందరానందుడు
37. విభాష్, తమ్లుక్ వద్ద, తూర్పు మేదినీపూర్ జిల్లా, పశ్చిమ బెంగాల్
ఎడమ కాలి మణికట్టు
కపాలిని (భీమరూప)
సర్వానందుడు
38. ప్రభాస్, వీరవల్ స్టేషను, సోమనాథ్ మందిరం వద్ద, జునాగధ్ జిల్లా, గుజరాత్
ఉదరం
చంద్రభాగ
వక్రతుండుడు
39. భైరవ పర్వతం, శిర్పా నది ఒడ్డున, ఉజ్జయిని, మధ్య ప్రదేశ్
పై పెదవి పైభాగం
అవంతి
లంబ కర్ణుడు
40. జనస్థానం, గోదావరీ లోయ, నాసిక్ వద్ద, మహారాష్ట్ర
చుబుకం
భ్రామరి
వికృతాక్షుడు
41. సర్వశైలం, గోదావరీ తీరం, రాజమండ్రి వద్ద, కోటిలింగేశ్వర మందిరం, ఆంధ్రప్రదేశ్
బుగ్గలు
రాకిణి / విశ్వేశ్వరి
వత్సనాభుడు / దండపాణి
42. బిరత్, భరత్ పూర్ వద్ద, రాజస్థాన్
ఎడమ కాలి వేళ్ళు
అంబిక
అమృతేశ్వరుడు
43. రత్నావళి, రత్నాకర నది ఒడ్డున, ఖనకుల్-కృష్ణనగర్ వద్ద, హూగ్లీ జిల్లా, పశ్చిమ బెంగాల్
కుడి భుజం
కుమారి
శివుడు
44. మిథిల, జనక్ పూర్, భారత్-నేపాల్ సరిహద్దులో
ఎడమ భుజం
ఉమ
మహోదరుడు
45. నల్హతి, కొడపైన, బీర్భమ్ జిల్లా, పశ్చిమ బెంగాల్
కాలి పిక్క ఎముకలు
కాళికా దేవి
యోగేశుడు
46. కర్ణాట్ (స్థలం తెలియదు)
చెవులు
జయదుర్గ
అభీరుడు
47. వక్రేశ్వరి, పాపహర నది ఒడ్డున, దుబ్రాజపూర్ స్టేషను వద్ద, బీర్ భమ్ జిల్లా, పశ్చిమ బెంగాల్
కనుబొమల మధ్య భాగము
మహిష మర్దిని
వక్రనాథుడు
48. జెస్సోర్ (యశోరి), ఈశ్వరిపుర్ వద్ద, ఖుల్నా జిల్లా, బంగ్లాదేశ్
చేతులు, కాళ్ళు
యశోరేశ్వరి
చందుడు
49. అత్థాస్, లాభపూర్ వద్ద, బీర్ భమ్ జిల్లా, పశ్చిమ బెంగాల్
పెదవులు
ఫుల్లార
విశ్వేశుడు
50. నందిపూర్, సైంతియా రైల్వే స్టేషనులో ఒక మఱ్ఱి చెట్టు క్రింద, బీర్ భమ్ జిల్లా, పశ్చిమ బెంగాల్
మెడలో హారం
నందిని
నందికేశ్వరుడు
51. శ్రీలంక (ట్రింకోమలి లో, హిందూమహాసాగర తీరాన ఉన్న ఈ మందిరం శిథిలమైనదనీ, కేవలం ఒక స్తంభం మాత్రమే మిగిలి ఉన్నదనీ ఒక వివరణ)
కాలి పట్టీలు
ఇంద్రాక్షి
రాక్షసేశ్వరుడు.
సర్వేజనా సుఖినోభవంతు !
*జ్యోతిష్య శాస్త్రం లో నక్షత్ర వృక్షాలు*
జ్యోతిష్య శాస్త్రం లో 27 నక్షత్రాలకు ప్రత్యేక దేవతలు , అధిదేవతలు ఉన్నట్లుగానే , వాటికి సంబంధించిన వృక్షాలు/చెట్లు కూడా ఉన్నాయి
జన్మ నక్షత్రాన్ని అనుసరంచి మనం పెంచాల్సిన వృక్షాలు మరియు వాటి వల్ల మనకు కలిగే ఫలితాలు
అశ్వని నక్షత్రం - వారు విషముష్టి లేదా జీడిమామిడిని పెంచడం, పూజించడం వలన జననేంద్రియాల, మరియు చర్మ సంబంధిత సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. ఈ చెట్లని పెంచి పూజించడం ద్వారా సంతాన అబివృద్ది కలుగుతుంది. అలాగే, అన్ని విషయాలలోనూ సూటి గా వ్యవహరించడం, సమయాన్ని వృదా చేయకుండా అన్ని పనులను సమర్ధవంతంగా నిర్వహించడం కొరకు చక్కగా ఉపయోగపడుతుంది.
భరణి నక్షత్రం - వారు ఉసిరి చెట్టును పెంచడం, పూజించడం ద్వారా జీర్ణ వ్యవస్థ , ఉదర సంబంధిత, పైత్యము , పైల్స్ వంటి బాధల నుండి ఉపశమనం పొందగలరు. అలాగే వీరికి క్రియేటివిటి ఎక్కువ గా ఎక్కువగా ఉన్న వృత్తులను ఎంచుకొని చక్కగా రాణించడానికి ఉపకరిస్తుంది
కృత్తిక నక్షత్రం - వారు అత్తి/మేడి చెట్టును పెంచడం పూజించడం ద్వారా గుండె సంబంధిత సమస్యల నుండి రక్షింపబడతారు, అలాగే సంపూర్ణ ఆరోగ్యం కూడా చేకూరుతుంది. అలాగే చక్కటి వాక్చాతుర్యం, ఏదైనా చేయాలనీ సంకల్పిస్తే ఎటువంటి విమర్శలనైన తట్టుకొని నిలబడే శక్తి కలుగుతాయి.
రోహిణి నక్షత్రం - వారు నేరేడు చెట్టుని పెంచడం, పూజించడం ద్వారా చక్కెర వ్యాధి మరియు నేత్ర సంబంధిత సమస్యల నుండి బయటపడగలరు. అలాగే మంచి ఆకర్షణీయమైన రూపం , సత్ప్రవర్తన ఎక్కువ గా కలుగుతాయి. వ్యవసాయం, వాటికి సంబందించిన వృత్తులలో చక్కగా ఎదగడానికి ఉపయోగపడుతుంది
మృగశిర నక్షత్రం - వారు మారేడు లేదా చండ్ర చెట్టుని పెంచడం, పూజించడం ద్వారా గొంతు, స్వరపేటిక, థైరాయిడ్ మరియు అజీర్తి సమస్యల నుండి బయటపడతారు. ముఖ్యంగా బుధవారం రోజు పూజించడం వలన ఆర్దికపరమైన చిక్కుల నుండి బయటపడగలరు.
ఆరుద్ర నక్షత్రం - వారు చింత చెట్టుని పెంచడం, పూజించడం ద్వారా గొంతు, స్వరపేటిక సంబంధిత సమస్యల నుండి బయటపడతారు, అంతే కాకుండా విషజంతువుల బాధ కుడా వీరికి కలగదు. వీరి మనస్తత్వాన్ని అనుకూలమైన దిశగా మార్చుకొని విజయాలు సాధించడానికి ఉపయోగపడుతుంది
పునర్వసు నక్షత్రం - వారు వెదురు లేదా గన్నేరు చెట్టు ను పెంచడం , మరియు పూజించడం ద్వారా ఊపిరితిత్తుల కి సంబందించిన వ్యాధులు క్షయ, ఉబ్బసం శ్వాసకోస బాధల నుండి, మరియు రొమ్ము క్యాన్సర్ నుండి ఉపశమనం పొందుతారు. బాలింతలు దీనిని పెంచడం వలన ముఖ్యం గా పాల కి లోటు ఉండదని చెప్పవచ్చు. పెద్ద పెద్ద సమస్యలు వచ్చినా , చక్కటి చాకచక్యం తో మెలిగి బయటపడడానికి ఉపయోగపడుతుంది.
పుష్యమి నక్షత్రం - వారు రావి లేదా పిప్పిలి చెట్టును పెంచడం, పూజించడం వలన నరాల సంబంధిత బాధలు నుండి విముక్తి పొందుతారు. అలాగే శత్రువుల బారి నుండి రక్షణ కలుగుతుంది. రోగ, రుణ భాధల నుండి విముక్తి లభిస్తుంది . స్త్రీలు సంతానవతులవుతారు.
ఆశ్లేష నక్షత్రం - వారు సంపంగి లేదా చంపక వృక్షాన్ని పెంచడం , పూజించడం వల్ల శ్వేతకుష్ఠు మరియు చర్మ సంబంధిత వ్యాదుల నుండి రక్షణ పొందగలరు అలాగే ముందు చూపు తో వ్యవహరించి జీవితం లో ముందుకు సాగడానికి ఎంతటి విషమ పరిస్థితుల్లోనైన తట్టుకోవడానికి చక్కగా ఉపయోగపడుతుంది.
మఖ నక్షత్రం - వారు మర్రి చెట్టుని పెంచడం, పూజించడం ద్వారా ఎముకల సంబంధిత మరియు అనుకోని వ్యాదుల నుండి రక్షింపబడతారు. అలాగే భార్య భర్తలు ఎంతో అన్యోన్యం గా ఉండడానికి, తల్లితండ్రులకు, సంతానానికి కూడా మేలు జరుగుతుంది. జీవితం లో వీరు తలపెట్టే ముఖ్యమైన కార్యాలలో ఆటంకాలు కలగకుండా ఉంటాయి
పుబ్బ నక్షత్రం - వారు మోదుగ చెట్టు ని పెంచడం, పూజించడం ద్వారా సంతానలేమి సమస్యల నుండి బయటపడతారు. అలాగే మంచి సౌందర్యం కూడా చేకూరుతుందని చెప్పవచ్చు .ప్రశాంతవంతమైన జీవితాన్ని గడపడడానికి ఎటువంటి వ్యవహారాలలోనైన తొందరపడకుండా వ్యవహరించడానికి ఉపయోగపడుతుంది.
ఉత్తర నక్షత్రం – వారు జువ్వి చెట్టు ని పెంచడం, పూజించడం ద్వారా హృదయ సంబంధిత వ్యాధుల నుండి బయటపడతారు. ఇతరులకు సహాయ సహకారాలని వారి చేతనైనంతగా అందించడానికి. మంచి ప్రవర్తనతో చుట్టూ స్నేహితులను చేసుకోవడానికి ఉపయోగపడుతుంది
హస్త నక్షత్రం - వారు సన్నజాజి , కుంకుడు చెట్లను పెంచడం, పూజించడం వలన ఉదర సంబంధిత బాధల నుండి ఉపశమనం పొందుతారు. పరిస్థితులను తట్టుకొని అన్నిటికీ ఎదురీది విజయం సాధించడానికి . దైవభక్తి కలగడానికి ఉపయోగపడుతుంది.
చిత్త నక్షత్రం - వారు మారేడు లేదా తాళ చెట్టు ను పెంచడం, పూజించడం ద్వారా పేగులు, అల్సర్ మరియు జననాంగ సమస్యల నుండి బయటపడగలరు. ఎవరిని నొప్పించకుండా వారి తెలివి తేటలతో ఇతరులను చిత్తు చేయగలిగిన నైపుణ్యం కలగడానికి ఉపయోగపడుతుంది.
స్వాతి నక్షత్రం - వారు మద్ది చెట్టు ను పెంచడం, పూజించడం ద్వారా స్త్రీలు గర్భసంచి సమస్యల నుండి బయట పడగలరు అలాగే ఉదర సంబంధిత సమస్యలు దరిచేరవు. అన్ని రకములైన విద్యలలోను రాణిస్తారు, ఆత్మవిశ్వాసం అధికం గా ఉంటుంది. భావోద్వేగాలు అధికం గా ఉన్నా తొందరపడకుండా వ్యవహరించడానికి ఉపయోగపడుతుంది.
విశాఖ నక్షత్రం - వారు వెలగ , మొగలి చెట్లను పెంచడం ద్వారా జీర్ణసంబంధిత సమస్యల నుండి బయటపడతారు. ఎటువంటి పరిస్థితులనైన తట్టుకొని నిలబడడానికి, ముందు చూపు తో అన్ని విషయాలను గ్రహించి ముందుకు సాగడానికి, వృత్తిరీత్యా మంచి గౌరవ మర్యాదలు సంపాదించుకోవడానికి ఉపయోగపడుతుంది.
అనురాధ నక్షత్రం - వారు పొగడ చెట్టు ని పెంచడం, పూజించడం ద్వారా కాలేయ సంబంధిత సమస్యల నుండి బయటపడగలరు. పదిమంది లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకోవడానికి, పరోపకారం చేయడానికి, విద్యలో ఎటువంటి ఆటంకాలు ఎదురైనా, పట్టుదలతో వాటిని అధిగమించి ముందుకు సాగడానికి, ఆలోచనా శక్తి అబివృద్ది చెందడానికి ఉపయోగపడుతుంది.
జ్యేష్ఠ నక్షత్రం - వారు విష్టి చెట్టు ని పెంచడం, పూజించడం ద్వారా కాళ్ళు, చేతుల సమస్యలు, వాతపు నొప్పుల నుండి ఉపశమనం పొందుతారు. చిన్నతనం నుండే బరువు భాద్యతలు సమర్దవంతం గా మొయగలగడానికి. ఆత్మవిశ్వాసం తో ముందుకు సాగడానికి ఉపయోగపడుతుంది.
మూల నక్షత్రం - వారు వేగి చెట్టు ని పెంచడం, పూజించడం ద్వారా పళ్ళ కి సంబంధించిన , మధుమేహం, కొలస్ట్రాల్ వంటి వ్యాధులు అదుపు లో ఉంటాయి. అలాగే జుట్టు రాలడం కూడా నియంత్రణ లో ఉంటుంది. శాస్త్ర ప్రవీణం, మంచి వ్యక్తిత్వము, ఔన్నత్యం కలగడానికి, సంతానం వల్ల జీవితం లో ఆనందాన్ని ఆనందం పొందడానికి ఉపయోగపడుతుంది.
పూర్వాషాడ నక్షత్రం - వారు నిమ్మ లేదా అశోక చెట్లను పెంచడం, పూజించడం ద్వారా కీళ్ళు, సెగగడ్డలు , వాతపు నొప్పులు మరియు జననేంద్రియ సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. దాపరికం లేకుండా వ్యవహరించడానికి పరోపకార బుద్ది . వినయవిదేతలు కలగడానికి ఉపయోగపడుతుంది.
ఉత్తరాషాడ నక్షత్రం - వారు పనస చెట్టు ని పెంచడం, పూజించడం ద్వారా చర్మ సంబంధిత వ్యాధులు దరి చేరవు. అలాగే ఆర్దికం గా కూడా ఎటువంటి సమస్యలు తలెత్తవు. భూముల కి సంబంధించిన వ్యవహారాలు బాగా కలసి వస్తాయి. సంతానపరమైన సమస్యలు ఉన్న వారికి అవి తొలగి వారు మంచి అబివృద్ది లోకి రావడానికి ఉపయోగపడుతుంది.
శ్రవణం నక్షత్రం - వారు జిల్లేడు చెట్టును పెంచడం, పూజించడం ద్వారా మానసిక సమస్యలు దూరమవుతాయి. అలాగే ధనపరమైన సమస్యలు తొలగుతాయి న్యాయం, ధర్మం పాటించేడానికి. కార్యజయం సిద్దించడానికి ఉపయోగపడుతుంది.
ధనిష్ఠ నక్షత్రం - వారు జమ్మి చెట్టును పెంచడం, పూజించడం ద్వారా మెదడు కి సంబంధించిన సమస్యలు రావు. అలాగే వీరికి తెలివి తేటలు, మంచి వాక్చాతుర్యం, ధైర్యం కలగడానికి, కుటుంబ సభ్యుల అండదండల కొరకు, సంతానాబివృద్ధి కొరకు ఉపయోగపడుతుంది.
శతభిషం నక్షత్రం - వారు కడిమి చెట్టు లేదా అరటి చెట్టు ను పెంచడం ద్వారా శరీర పెరుగుదల కి సంబంధిచిన , మోకాళ్ళ సమస్యల నుండి బయటపడతారు. మంచి శరీర సౌష్టవం , చక్కటి ఉద్యోగం కొరకు, జీవితం లో చక్కగా స్థిరపడడానికి ఉపయోగపడుతుంది.
పూర్వాభాద్ర నక్షత్రం - వారు మామిడి చెట్టు ని పెంచడం ద్వారా కండరాలు, పిక్కలకి సంబంధించిన సమస్యలు రావు. వృత్తి ఉద్యోగాలలో మంచి స్థితి ని పొందడానికి . కళలు, సాంస్కృతిక రంగాలలో విశేషమైన పేరును తెచ్చుకోవడానికి, విదేశాల లో తిరిగే అవకాశం కొరకు, ఆర్ధిక స్థిరత్వం కొరకు, రాజకీయాల లో రాణించడానికి ఉపయోగపడుతుంది.
ఉత్తరాభాద్ర నక్షత్రం - వారు వేప చెట్టు ని పెంచడం ద్వారా శ్వాస కోశ బాధలు, కాలేయ సంబంధిత బాధల నుండి రక్షణ లభిస్తుంది. అలాగే విదేశాలలో ఉన్నత విద్యల ను అభ్యసించడానికి, ఉన్నత పదవులు, సంతానం వల్ల మంచి పేరు ప్రతిష్ఠలు కొరకు, వైవాహిక జీవితం ఎంతో ఆనందం గా ఉండడం కొరకు ఉపయోగపడుతుంది.
రేవతి నక్షత్రం - వారు విప్ప చెట్టు ని పెంచడం, పూజించడం ద్వారా థైరాయిడ్ వంటి వ్యాధులు అదుపు లో ఉంటాయి. మంచి విజ్ఞానం, విన్నూతమైన వ్యాపారాలలో నైపుణ్యం కొరకు, కీలక పదవులు, సంతాన ప్రేమ , గౌరవం అప్యాయతలు వృద్ది చెందడానికి, జీవితం లో అందరి సహాయ సహకారాలు లభించడానికి ఉపయోగపడుతుంది.
*ఆదిదేవుని ప్రమధ గణాలు ఎవరు ..?*
'ప్రమథ' అంటే బాగా మథించగలిగె వారని అర్థం. వీరు దేవతల కన్నా ఎక్కువ శక్తి గలవారు. దేవతలను కూడా శిక్షించ గలవారు.
వీరంటే దేవతలకు భయము, మరియు భక్తి. దేవతలు తప్పు ద్రోవ పడితే వారిని నిగ్రహించే వారు ప్రమథులు. వీరు విశ్వమంతా వ్యాపించే నిగ్రహ శక్తులై సంచరిస్తాడు.
రుద్ర సూక్తం లోని ఏకాదశ అనువాకంలో " సహస్రాణి సహస్రశో యే రుద్రా అది భూమ్యాం .."
అంటే వీరు అన్నిచోట్లా వ్యాపించి ఉండే రుద్రశక్తులుగా ప్రార్థించబడ్డారు. కోట్లకొలది గణాలు ఉంటారు.
మహాభక్తులై శివలోకానికి చేరే జీవులు కూడా శాశ్వత శివ సాయుజ్యం పొంది రుద్ర గణాలుగా ఉండి పోతారని ప్రతీతి.
అయితే వారికి నాయకులు లేదా గణాధిపతులు కూడా ఉంటారు. వీరిలో ముఖ్యులు:
🌷వీరభద్రుడు: 🌷
దక్షయజ్ఞంలో శివాపచారం చేసిన దక్షుణ్ణి, విష్ణ్వాది దేవతలను శిక్షించిన శివ జటోధ్భవుడు. తిరుగు లేని పరాక్రమవంతుడు. సాక్షాత్ శివస్వరుపంగా పోగడబడే వాడు. అందరికన్నా ముఖ్యమైన గణాధిపతి.
🌷ఆది వృషభం: 🌷
ధర్మదేవత. శివున్ని మోయ గలిగె వరం పొంది, అతని సమీపంలో ఎప్పుడు సంచరించే తెల్లని వృషభ మూర్తి. విష్ణు బ్రహ్మాదుల సృష్టికి పూర్వమే శివుడు ద్వితీయ శంభునిగా ధర్మ దేవతను వృషభ రూపంలో సృష్టిస్తాడు.
🌷 నందీశ్వరుడు:🌷
శిలాదుని పుత్రుడు. అది వృషభం యొక్క అవతారం. శివునికి రక్షగా, ఆంతరంగికునిగా ఉండే గణ మూర్తి. కైలాసానికి ఎవరు వచ్చినా ఇతని అనుమతి పొందితే గానీ శివదర్శనం లభించదు.
🌷 భృంగి:🌷
శివుని యొక్క పరమ భక్తుడు. భ్రమరము లాగా శివుని చుట్టూ ప్రదక్షణం చేయడం పనిగా ఉన్న వాడు కాబట్టి భృంగి అని పిలవబడ్డాడు.కేవలం శివున్ని ఆరాధిస్తూ పార్వతీ దేవిని విస్మరించి శాపగస్తుడై తల్లి వల్ల వచ్చే రక్త, మాంసములను కోల్పోయి పడిపోతే శివుడు మూడవ కాలు ప్రసాదించాడు.
స్కందుడు: 🌷
కుమారస్వామి శివకుమారుడు. దేవసేనాధిపతి. బ్రహ్మజ్ఞాని.
పై ఐదుగురు వీరమహేశ్వర గురువులు. వారి గోత్ర పురుషులు. నేటికీ వీరశైవులు ఈ గోత్రములతో ఉన్నారు.
రేణుక, దారుక, ఘంటకర్ణ, విశ్వకర్ణ, ధేనుకర్ణ:
\శివుని పంచముఖాల నుండి ఉద్భవించిన గణశ్రేష్ఠులు. భూమిపైకి అయోనిజులై లింగమునుంది వచ్చి పంచ మఠములను స్థాపించి, శివాద్వైతాన్ని బోధించారు. మరల లింగైక్యు లయ్యారు.
🌷కాలాగ్నిరుద్రుడు లేదా కాలభైరవుడు: 🌷
బ్రహ్మ ఐదవ తలను తీసేసిన రుద్రుడు. కపాల హస్తుడు. కాశీ పురాధీశుడు
🌷రిటి: 🌷
ఉద్దాలకుని పుత్రుడు. శివకృప చేత పరమ జ్ఞానిగా మారి శివ గణములలో చేరాడు.
🌷బాణుడు: 🌷
శివుని పరమభక్తుడు. శివునితోనే యుద్ధం కోరాడు. తత్సముడైన వానితో నీ అభీష్టం నెరవేరుతుందని వరం పొందాడు.
శ్రీ కృష్ణునితోయుద్ధం చేసి సహస్ర బాహువులు పోగొట్టుకొని శివగణాలలో చేరాడు. నర్మదా నదిలో బాణలింగాలు ఇతనికి ఇచ్చిన వరం వల్ల బాణ లింగాలని పిలువ బడతాయి.
🌷 చండీశుడు: 🌷
ఒక గోప బాలుడు. శివపూజకు గుడిలో అనుమతించరు అని, గొర్రె పెంటికను శివలింగంగా భావించి గొర్రె పాలతో పూజించాడు. భక్తి తన్మయత్వంలో ఆ పెంటిక శివలింగంపై పడబోతున్న తన తండ్రి కాలినే నరికేసాడు. కైలాసం నుండి శివుడు పరుగున వచ్చి ఆ బాలునికి గణ ఆధిపత్యాన్ని, శివ ఉచ్చిష్టంపై అధికారాన్ని కలిగించాడు. శివ నింద చేసేవారికి అతడు చండశాసనుడు.
.ఇలా ఎందరో ప్రమథ నాయకులు.:: దదీచి, అగస్త్యుడు, ఉపమన్యుడు, పప్పిలాదుడు, దుర్వాసుడు మొదలైన అనేక మంది ఋషులు కూడా శాంభవ దీక్ష స్వీకరించి గణములలో స్థానం పొందినారు. అంతే గాక విభూతి, రుద్రాక్షలు, శివలింగాన్ని ధరించి శాంభవ దీక్షలో ఉంటూ సంచరిస్తూ ఉండే ఎంతో మంది శివయోగులు కూడా ప్రమథ కులము వారే.
బ్రహ్మ సృష్టి పరంపరలో వచ్చే వర్ణాశ్రమ ధర్మములకు, అగ్నిష్టోమాది క్రతువులకు వీరు అతీతులు. కేవలం శివకర్మ మాత్రమే విధిగా సంచరిస్తారు. ...::అనన్యశివభక్తి ఉన్నవారు అందరూ సమానులని వీరి విశ్వాసము. ఈనాటికీ వీరు వీరమాహేశ్వరులని, జంగమదేవతలని పిలువబడతారు.
ఇక జంగమలు గురుపరంపరలో ఉంటే, శిష్య పరంపర చెందిన శివశరణలు కూడా గణములలో స్థానం పొందారు.
ఎంతో మంది స్త్రీలు శరణలయ్యారు. అక్క మహాదేవి, హేమరెడ్డి మల్లమ్మ వంటి వారు. 12వ శతాబ్దానికి చెందిన బసవ, అల్లమ ప్రభు, చెన్నబసవ, సిద్ధరామ ఇత్యాది శరణలెళ్లరు శివగణాల అవతారాలు అని బసవ పురాణం చెబుతుంది.
గణాలలో ఎన్నో రకాల వారు ఉంటారని బసవ పురాణం వివరిస్తుంది. కొందరు శివ సారూప్యం తో ఉంటారు, కొందరు ఇచ్చాధార రూపాలతో ఉంటారు.రకరకాల ముఖాలతో, రక రకాల శరీరాలతో, అవయవాలలో ;;వింతగా ఉంటారు ప్రమథ గణాలు. వీరి శక్తుల, లీలల గురించి తెలుసుకోవాలంటే పాల్కురికి సోమనాథుని బసవ పురాణం చదవాల్సిందే!!వీరి పేర్లు తలచుకోవడమే మహా ప్రసాదము.
సర్వం శివమయం.. హరహర మహాదేవ శంభోశ
శివుడికి_ప్రీతికరమైనపుష్పాలు
పరమశివుడికి యే పుష్పాలతో అర్చన ఇష్టమంటే
కరవీరార్క మందార శమీ వకుళ కింశుకమ్!
మధూక బృహతీ బిల్వ మపామార్గం చ పాటలమ్!!
అశోకాగస్త్య దత్తూర కర్ణికార కదంబకమ్!
బాణపున్నాగ తిలకం కోవిదారం చ చంపకమ్!!
మల్లికా మాధవీ జాతిః ద్రోణం చ శతపత్రకమ్!
కమలం కైరవం చైవ తథానీలోత్పలాని చ!!
తమాలం తులసీపత్ర మిత్యేతాని శివార్చనే!
పుష్పపత్రాణి శస్తాని సర్వపాప హరాణి చ!! (శివతత్త్వ సార సంగ్రహం)
శివార్చనకు*;;కరవీరం (గన్నేరు),.. *అర్కం (జిల్లేడు),;;*మందారం,*శమీ (జమ్మి),*బొగడ,*మోదుగ,*ఇప్ప,*వెంపలి,*బిల్వం(మారేడు),*అపామార్గం (ఉత్తరేణి),*కలిగొట్టు,*అశోకం,*అవిసె,*ఉమ్మెత్త,*కొండగోగు,*కడిమి,*నల్ల గోరింట,*సురపొన్న,*ఎర్రగోరింట,*ఎర్ర దేవకాంచనం,*సంపెంగ,*మల్లి,*పండు గురివింద,*జాజి,*తుమ్మి,*నూరు రేకుల పద్మం,*వెయ్యి రేకుల పద్మం,*తెల్లకలువ,*నల్లకలువ,*తాపింఛం,*తులసి -
వీటికి సంబంధించిన పుష్పపత్రాలు సర్వదా శ్రేష్ఠాలు. వీటితో పరమ శివుణ్ణి పూజిస్తే, సమస్త పాపాలూ నశిస్తాయి.
దక్షిణామూర్తి స్వరూపం
"దక్షిణామూర్తి" విగ్రహాన్ని పరిశీలిస్తే "కుడిచెవి"కి "మకరకుండలం"... ఎడమ చెవికి "తాటంకం' అలంకారాలుగా కనిపిస్తాయి. "మకరకుండలం" పురుషుల శ్రవణాలంకారం. "తాటంకం" స్త్రీల అలంకృతి...\దక్షిణామూర్తిగా సాక్షాత్కరించినది "శివశక్తుల" సమైక్య రూపమేనని తెలియజేస్తాయి...
ఈ రెండు అలంకారాలు. సనకసనందనాదులకు ముందు రెండుగా కనబడిన శివశక్తులే... ఇప్పుడు ఏకాకృతిగా దర్శనమిచ్చాయి. అందుకే దక్షిణామూర్తి అయ్యరూపమే కాక, అమ్మమూర్తి కూడా..
ఈ విషయాన్నే "లలితాసహస్రం"లో దక్షిణామూర్తి రూపిణీ సనకాదిసమారాధ్యా శివజ్ఞాన ప్రదాయినీ"
అని వివరిస్తోంది.
స్వామి ఉత్తరాభిముఖులై ఉంటారు.
ఉత్తరం జ్ఞానదశ.... ఆ దిశలో కూర్చున్న స్వామిని చూస్తూ ఉన్నవారికి....
వెనుక భాగాన ( పృష్ట భాగాన ) దక్షిణ దిశ. ;;అంటే యమ (మృత్యు) దిశ.
దీని భావం ఎవరు దేవుని వైపు చూస్తారో... వారు యముని ( మృత్యువుని ) చూడరు.
యముని చూపు మనపై పడకుండా స్వామి చూపు 'నిఘా', వేస్తుంది.
ప్రమాదం వై మృత్యుమహం బ్రవీమి' ;;యముని సైతం శాసించిన మృత్యుంజయుడే దక్షిణామూర్తి
దక్షిణ' అంటే 'దాక్షిణ్య భావం'.ఏ దయవలన దుఃఖం పూర్తిగా నిర్మూలనం అవుతుందో ఆ 'దయ'ను 'దాక్షిణ్యం' అంటారు.
ఈ లోకంలో శాశ్వతంగా దుఃఖాన్ని నిర్మూలించగలిగే శక్తి (దాక్షిణ్యం)... భగవంతునికి మాత్రమే ఉంది.
ఆ దాక్షిణ్య భావం ప్రకటించిన రూపమే... "దక్షిణామూర్తి"
అన్ని దుఃఖాలకీ కారణం అజ్ఞానం.
అజ్ఞానం పూర్తిగా తొలగితేనే శాశ్వత దుఃఖ విమోచనం. .. ఆ అజ్ఞానాన్ని (అవిద్యను) తొలగించే...జ్ఞాన స్వరూపుని దాక్షిణ్య విగ్రహమే "దక్షిణామూర్తి"
గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణామ్ నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమ:
"దక్షిణామూర్తి" సకల జగద్గురు మూర్తి కనుక స్వామి ఆరాధన సకల విద్యలను ప్రసాదిస్తుంది. ఐహికంగా బుద్ధి శక్తిని వృద్ధి చేసి విద్యలను ఆనుగ్రహించే ఈ స్వామి...
పారమార్థికంగా తత్త్వ జ్ఞానాన్ని ప్రసాదించే దైవం.
"పుష్కర్" బ్రహ్మ మందిరము
జైపూర్ నుంచి అజ్మేర్ సుమారు 130 కిలోమీటర్లు NH-8 పై వెళ్లొచ్చు . ఢిల్లీ నుంచి అహమ్మదాబాదు వెళ్లే రోడ్డు చాలా విశాలంగా కట్టిన రోడ్డు కాబట్టి ప్రయాణం చాలా బాగా సాగుతుంది .
అజ్మేరు నగరానికి సుమారు 14 కిలో మీటర్ల దూరంలో వున్న గ్రామం పుష్కర్ . ఇది హిందువులకు పరమపవిత్రమైన ప్రదేశాలలో ఒకటి .
శివ పురాణం ప్రకారం సతీ దేవి వియోగానికి తట్టుకోలేకపోయిన శివుడు రుద్రతాండవమాడుతూ దుఃఖించేడుట , ఆ కన్నీరు నేల పై పడి ఆ నీటితో పెద్ద సరస్సు యేర్పడింది . అలా శివుని ఒక కంటి నుంచి పడ్డ నీటితో పుష్కర సరస్సు యేర్పడగా రెండవది పాకిస్థాన్ లో వున్న కేతాస్ రాజ్ . కేతాస్ రాజ్ అనే పదం సంసృత పదమైన ' కేతాక్షి ' నుండి వచ్చిందని పండితుల అభిప్రాయం . కేతాక్షి అంటే ' వర్షించే కళ్లు ' అని అర్ధం . శివుని కళ్లనుండి వర్షించిన నీరు పడ్డ ప్రదేశం కాబట్టి వీటిని పాకిస్థాన్ లో వున్న సరస్సు కేతాక్షి రాజ్ అని అజ్మేర్ లో వున్న సరస్స తీర్థరాజ్ గా పిలువబడుతున్నాయి . ఒక సర్వే ప్రకారం దేశం లో యెక్కువ విదేశీ యాత్రీకులను ఆకర్షించే ముఖ్య పర్యాటక స్థలంగా పుష్కర్ గుర్తించబడింది .
సత్యయుగంలో బ్రహ్మ దేవుడు యాగం చెయ్యాలని అనువైన ప్రదేశం కొరకు వెతుకుతూ తన చేత నున్న నీలి కలువను భూమి పైకి జారవిడిచి ఆ పుష్పం పడ్డ ప్రదేశంలో యాగం చెయ్య నిశ్చయించుకుంటాడు .
పుష్కర అంటే పుష్పం + కరం అంటే చెయ్యి , బ్రహ్మ దేవుని చేతి నుంచి తామర పుష్పం జారిపడిన ప్రదేశం కాబట్టి పుష్కర గా పేరు వచ్చింది అనేది ఒక కథ .
పుష్కరం పక్కన యేర్పడ్డ గ్రామం కావడంతో ఈ గ్రామం కూడా పుష్కర్ గా పిలువబడుతోంది .
ఈ పుష్కర్ సత్య యుగానికి చెందినది అయినా యిక్కడ వున్న మందిరాలు చాలా కొత్తగా వున్నాయి . మొఘల్ రాజుల ఆగ్రహానికి బలైన చాలా మందిరాలలో యివి కొన్ని . చాలా మందిరాలను ఈ శతాబ్దం లో నిర్మించడం జరిగింది .
పుష్కర్ లో వున్న ఘాట్లు బ్రహ్మ కోవెల , గాయత్రీదేవి మాత మందిరం లాంటి చాలా మందిరాలు మూలవిరాట్టును అలాగే వుంచి మిగతా ప్రదేశమంతా కొత్తగా అంటే సుమారు 1985 తరువాత కట్టబడ్డవి . యెందకంటే ఆ ప్రాంతాలలో మేము వెళ్లినప్పుడు యింత పెద్ద మందిరాలు లేవు . అలాగే పుష్కర్ సరస్సు ఒకటి రెండు ఘాట్స్ తో కలుషితమైన నీటితో వుండేది . ఇప్పుడు గవర్నమెంటు నీటిని తరచుగా శుభ్రపరచి భక్తులు నీటిలో విడిచే పూలను ప్రసాదాలను సరస్సునుంచి బయటకు తీయటం తో తేడా బాగా తెలుస్తోంది .
ప్రస్తుతం పాలరాతి తో మెట్లు కట్టి , టికెట్టు తీసుకున్న భక్తులకు వారి అభీష్టం ప్రకారం విధులను పూజారులు నిర్వహించే సౌలభ్యం కలుగజేసేరు . ఈ సరస్సులో మధ్యన బ్రహ్మ చతుర్ముఖునిగా వున్న విగ్రహం వుంది . యెక్కడైతే బ్రహ్మ విగ్రహం వుందో అక్కడ సర్వ మంత్ర మాతృమూర్తి అయిన గాయత్రీదేవి వుధ్బవించిన ప్రదేశం . ఈ సరస్సుకు నాలుగు వైపులా మొత్తం 52 ఘాట్స్ నిర్మించేరు .
పుష్కర్ సరస్సుకు సంబంధించిన మరోకథ యిలా చెప్తారు . ఈ సరస్సు పుష్కరుడు నివసించే ప్రదేశం . ఈ పుష్కరుడు యెవరు అంటే యితను వరుణుని కుమారుడు , బ్రహ్మ గురించి తపస్సుచేసి సర్వ నదులూ భక్తుల పాపప్రక్షాళన వలన పోగొట్టుకున్న పవిత్రతను ఆ నదులకు తిరిగి కలుగజేసేరు వరం పొందుతాడు . గరుగ్రహం రాశిమారినపుడు ఆయా నదులలో ప్రవేశంచి వాటికి పవిత్రతను కలుగ జేస్తాడు . ప్రతి రోజూ ప్రాతఃకాలములో అన్ని పుణ్యక్షేత్రాల దగ్గరవున్న తటాకాలలోను వుండి పాప విముక్తులను చేస్తూ వుంటాడు , మరి మిగతా సమయాలలో ఈ పుష్కరుడు యెక్కడ వుంటాడు అంటే యీ పుష్కర్ రాజ్ లో వుంటాడు . అందుకే యిది పుష్కర్ అని పిలువ బడుతోంది .
గాయత్రీదేవి పుట్టుకకి సంభందించిన పురాణ గాథ యీవిధంగా చెప్తారు .
యాగం చెయ్యదలచిన బ్రహ్మ పవిత్ర స్థలం కొరకు వెతుకుతూ తన వాహనమైన హంసకు నీలికమలాన్ని యిచ్చి తగు ప్రదేశంలో నీలీ కమలాన్ని జారవిడివమని చెప్తాడు . పూవు నేలను తాకిన తాకిడికి రేకులు మూడు ప్రదేశాలలో వెదజల్లబడతాయి , వీటిని జేష్ట పుష్కర్ , మధ్యపుష్కర్ , కనిష్ట పుష్కర్ అని పిలుస్తారు . ఆ పూవు పడ్డ ప్రదేశానికి వచ్చి చూడగా ఆ ప్రదేశంలో వజ్రాశనుడు లేక వజ్రనాభుడు అని పిలువ బడే రాక్షసుడు ప్రజలను నాన్నా హింసలకు గురి చెయ్యడం చూసిన బ్రహ్మ మంత్రించిన కలువపువ్వు తో రాక్షసుని సంహరించి , యాగ ప్రదేశమును దుష్ట శక్తుల నుంచి రక్షించుటకు నాలుగువైపులా నాలుగు పర్వతాలను కాపలాగా పెడతాడు . అవి వుత్తరాన నీలగిరి , దక్షిణాన రత్నగరి , తూర్పున సూర్యగిరి , పడమటన సంచూరా అని పిలువబడుతున్నాయి . ఆ ప్రదేశంలో యాగం నిర్వహిస్తాడు .
యాగానంతరం పూర్ణాహుతిని శాస్త్ర ప్రకారం భార్యాసమేతుడై నిర్వహించాలి , పూర్ణాహుతి కొరకు బ్రహ్మ భార్య అయిన సావిత్రీ దేవికి పిలుపును పంపగా స్త్రీ సహజమైన అలంకరాశక్తితో అలంకరణకు అధిక సమయం వెచ్చించ సాగింది . ఋత్విక్కులు సమయము మించిపోవుచున్నదనే హెచ్చరికతో సమీపమున సంచరించుచున్న గరిజన కన్యను గడ్డితో కలిపి కామధేనువుకు తినిపించి మలద్వారము ద్వారా బయటకు తీసి , యిలా ముమ్మారు చేసి శుద్ధి పరచి బ్రహ్మ తో వివాహము చేసి పూర్ణాహుతిని నిర్వహిస్తారు .
గోవుతో శుధ్ది చేయబడినది కాబట్టి ఆమెకు గాయత్రి అని నామకరణం చేసి నాలుగు వేదాలూ నాలుగు ముఖాలుగా , బ్రహ్మ , విష్ణు , మహేశ్వరులు వారి ఆయుధాలను యివ్వగా , లక్ష్మి , పార్వతీ , సరస్వతులు తమతమ శక్తులను ప్రసాధించగా బ్రహ్మ వాహనమైన తెల్లని హంసను వాహనముగా పొంది , యెనిమిది కన్నులతో యెనిమిది దిక్కులూ చూస్తూ తన నిజముఖానికి గల కన్నులతో ఆకాశమును , పాతాళములను వీక్షిస్తూ బ్రహ్మకు సృష్టి కార్యంలో తోడ్పడుటకు కావలసిన జ్ఞానమును బ్రహ్మ నుండి పొందుతుంది . సర్వమంత్రాలకు , సర్వతంత్రాలకు మాతృమూర్తి ని చేస్తారు . గాయత్రి ని వేదమాతగా స్తుతిస్తారు .
యాగానంతరము సావిత్రి వచ్చి బ్రహ్మ ప్రక్కన కూర్చొని దేవతల అశీస్సులు పొందుతున్న గాయత్రి ని చూచి జరిగిన విషయం యెరిగినదై బ్రహ్మ పై కోపగించుకొని బ్రహ్మ కు భూలోకంలో పూజర్హత లేకుండునట్లు నట్టు , విష్ణు మూర్తి కి భార్యా వియోగం కలగాలని , ఇంద్రుడు యధ్దములలో యెప్పుడూ పరాజయం పొందాలని , ఆహుతి స్వీకరించిన అగ్ని యెప్పుడూ ఆకలితో వుండాలని , యాగం చేయించిన ఋత్వికులు దారిద్ర్యం తో బాధ పడాలని శపించి కోపముతో రత్నగరి పర్వతము పై నివసించసాగింది .
సర్వ మంత్రమాత అయిన గాయత్రి బ్రహ్మ కు పుష్కర్ లో జరిగే పూజలకు అర్హుడుగానూ , ఇంద్రుడు యుధ్దంలో వోడినా కూడా స్వర్గవాసము నందే వుండునట్లు , విష్ణుమూర్తి కి రామావతారములో మాత్రమే భార్యా వియోగములు కలుగునట్లు , ఋత్వికులకు సర్వశాస్త్ర పారంగత , అఖండ జ్ఞానం వుండేటట్టుగా శాపములను మార్చి వేస్తుంది .
పుష్కర్ లో చూడతగ్గ మరికొన్ని మందిరాలు
1) జగత్పిత బ్రహ్మ కోవెల 2) పాప విమోచన గాయత్ర 3) మహదేవ్ కోవెల4)వరాహ కోవెల
5) సావిత్రి దేవి మందిరం 6) ఆత్పతేశ్వర్ మహదేవ్ మందిర 7) పుష్కర్ పశువుల సంత
1) జగత్పిత బ్రహ్మ కోవెల ---
ఈ కోవెల మొత్తం పాలరాయితో నిర్మించ బడింది . పూర్వం నుంచి వున్న మందిరం యెర్రరాతి కట్టడానికి పాలరాతి కట్టడం చేర్చి విశాలంగా ఈ మధ్యకాలంలో అంటే సుమారు 1990 ప్రాంతాలలో కట్టేరు . పాలరాతి తో పెద్ద పెద్ద మెట్లు యెక్కి పైకి వెళితే విశాలమైన వరండా అక్కడ రాజస్థాన్ శిల్పకళ తో కట్టిన కట్టడాలు , ఒకవైపున నల్లచలువరాతి యేనుగుపై కుబేరుడు మరో ప్రక్కన తెల్ల చలువరాతి యేనుగుపై బృహస్పతి వున్న విగ్రహాలు జీవకణ వుట్టిపడుతూ వుంటాయి . అక్కడే గరుత్మంతుడి విగ్రహం వుంటుంది . విశాలమైన ప్రాంగణం దాటుకొని లోపలి గర్భగుడిలోకి వెళితే అక్కడ కాలుమడిచి కూర్చొని వున్న సృష్టి కర్త విశ్వకర్మ రూపంలో ఆదిశంకరులచే పూజింపబడ్డ విగ్రహం వుంటుంది . కోవెల శిఖరం బ్రహ్మదేవుని వాహనమైన హంసకు ప్రతీక , మధ్య నుండే మూల విరాట్టు నాలుగు ముఖాలు , నాలుగు చేతులు కలిగి వున్న నిలువెత్తు బ్రహ్మ విగ్రహం చూపరులను మంత్ర ముగ్ధులను చేస్తుంది . నాలుగు చేతుల్లో అక్షరమాల , వేదాలు , కుశం, కమండలం ధరించి యెడమవైపు గాయత్రి , కుడి వైపు సావిత్రి లతో హంసపై ఆశీనుడై దర్శనమిస్తాడు . గోడలపై వివిధ దేవతామూర్తులు , నెమలి , హంసల మూర్తులు చెక్కబడి వుండడాన్ని చూడొచ్చు . గర్భగుడి వెలుపల నిలువెత్తు ద్వారపాలకులను చూడొచ్చు . విష్ణుమూర్తి విగ్రహం వుంటుంది . పాలరాతి తో చెక్కిన మకరతోరణాలు , నగిషీలతో వుండే కిటికీలు చూస్తే ఆ శిల్పులకు జోహార్లు చెప్పాలనిపిస్తుంది . గర్భగుడికి ప్రదక్షిణ చేసేటప్పుడు వెనుకవైపున వున్న కిటికీలలోంచి చూస్తే సావిత్రీమాత కోవెల కనిపిస్తుంది .
బ్రహ్మ కోవెలలో " గుజ్జర్ " జాతి కి చెంది బ్రహ్మచర్యం అవలంభించిన పరాశరగోత్రీకులకు మాత్రమే మూలవిరాట్టును తాకి పూజాది కార్యక్రమాలు నిర్వహించే అర్హత వుంది . ఈ ఆచారం బ్రహ్మ కోవెల నిర్మించినప్పటి నుంచి అమలులో వుంది .
2) పాపమోచన గాయత్రి మందిరం ------
పుష్కర్ సరస్సు కి తూర్పు వైపున మార్వార్ బస్సుస్టాండు వెనుకవైపున వుంటుందా మందిరం . పుష్కర్ గట్టుమీంచి అర కిలోమీటరు నడిచి వెడితే చేరుకోవచ్చు . మామూలుగా వుండే చిన్న మందిరం . గాయత్రీ దేవి విగ్రహం భక్తులు పిలిస్తే పలికి వరాలిచ్చేంత సజీవంగా వుంటుంది . బ్రహ్మ హత్యా పాతకం నుంచి విముక్తులను గావిస్తుంది యీ గాయత్రీమాత .
3) మహదేవ్ మందిరం -----
నేపాల్ లోని పశుపతి నాథ్ విగ్రహాన్ని పోలిన పాలరాతి విగ్రహం అయిదు తలలతో వుంటుంది . కోవెలలో మరో ముఖ్యమైన ఆకర్షణ యేమిటంటే గర్భగుడిలో ప్రతిష్టించిన అష్టోత్తర శివలింగాలు .
4) వరాహ కోవెల----
హిరణ్యాక్షుని సంహరించేందుకు వరాహ అవతారంలో వెడుతున్న విష్ణుమూర్తి కాస్త సేపు యిక్కడ విశ్రమించినట్లుగా స్థలపురాణం . 12 వ శతాబ్దానికి చెందిన మందిరాన్ని ఔరంగజేబు పడగొట్టగా 1724 లో సవాయ్ జై సింగు గర్భగుడి లోపల చక్కని శిల్పకళతో నిర్మించేడు . నిలువెత్తు జీవకళ వుట్టిపడుతున్న విగ్రహాన్ని ప్రతిష్టించేడు .
5) సావిత్రి దేవి మందిరం ------
యజ్ఞ పూర్ణాహుతి సమయంలో తనకొరకు వేచియుండక గాయత్రీ దేవి ని వివాహ మాడిన బ్రహ్మ పై అలిగిన సావిత్రి రత్నగరి పర్వతం పైన నివసించసాగింది . పుష్కర్ వచ్చే భక్తులు ముందుగా సావిత్రి మాత మందిరం దర్శించుకొని తరువాత సరస్సును ఆ తరువాత బ్రహ్మ కోవెలను దర్శించుకోవాలి .
కొండ దారిన 1.5కిలోమీటరు నడవాలి , కాస్త కష్టంగానే వుంటుంది . సావిత్రీ మాత కి గాజులు పసుపు కుంకం సమర్పిస్తే భక్తుల సౌభాగ్యాన్ని కాపాడుతుందని నమ్ముతారు .
ఇది చాలా చిన్నకోవెల 7వ శతాబ్దం లో బికనీరు రాజులు ఈ మందిరాన్ని నిర్మించేరు . పుష్కర్ లో కనిపించే అతి తక్కువ పురాతన మందిరాలలో యిది వొకటి .
6) ఆత్పతేశ్వర మహదేవ్ మందిరం ---
బ్రహ్మ నిర్వహించే మహా యజ్ఞానికి పరమశివుని పిలవడం మరచిపోతాడు . దానికి ఆగ్రహించిన శివుడు మాంత్రికుని వేషధారణలో కపాలమును చేత ధరించి యాగ ప్రదేశమునకు వస్తాడు . శివుని అవతారము చూసిన బ్రహ్మ కోపముతో చిరాకు పడతాడు . అందుకు ఆగ్రహించిన శివుడు యాగ ప్రదేశమంతటనూ కపాలములను పడవైచి అపవిత్రము చేసి కైలాసమునకు వెడలిపోతాడు . జరిగిన పొరపాటు తెలుసుకున్న బ్రహ్మ శివుని ప్రార్ధించి ప్రసన్నుని చేసుకొంటాడు . ఆ సంఘటనకు ప్రతీకగా బ్రహ్మ తన కోవెల పక్కగా గుహలో నివాసముండి భక్తులను కటాక్షింపమని వేడుకొనగా శివుడు ఈ గుహామందిరములో ఆత్పతేశ్వరునిగా కొలువై భక్తుల కోర్కెలను తీరుస్తున్నాడు . ఈ గుహలోని శివలింగం చాలా పెద్దది . రాగి పామును శివలింగానికి అలంకరిస్తారు . శివరాత్రి విశేష పూజలు నిర్వహిస్తారు .
వేదమంత్రాలు పుట్టిన ప్రదేశమైన పుష్కర్ లో వేదిక పాఠశాలలు , వైదిక ధర్మశాస్త్రాల అధ్యయనానికి కావలసిన వసతులు వున్నాయి .
ఈ ప్రదేశాలన్నీ దేశీయులనే కాక విదేశీయులను కూడా ఆకర్షించడం ఆశ్చర్యాన్ని కలుగ జేస్తుంది .
పుష్కర్ లో ని అన్ని మందిరాలలోనూ కార్తీక పున్నమి పూజలు అత్యంత భక్తి శ్రధ్దలతో నిర్వహిస్తారు . ఆ సమయంలో నిర్వహించే పశువుల సంత ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకట్టుకుంటోంది .
7) పుష్కర్ పశువుల సంత -----
కార్తీక పున్నమి తో మొదలై అయిదు రోజులు జరిగే పశువుల సంత యిది . ఈ సంతలో అన్ని రకాలయిన పశువుల కొనుగోలు అమ్మకాలూ జరిగినా ముఖ్యంగా ఒంటెల అమ్మకాలూ కొనుగోళ్లూ యెక్కువగా జరుగుతాయి . ఈ సంతలో సుమారుగా ప్రతీ సంవత్సరం యాభైవేల ఒంటెల అమ్మకాలు కొనుగోళ్లూ జరుగుతున్నట్లుగా అంచనా . అందుకే పుష్కర్ సంత విదేశాలలో కూడా ప్రాముఖ్యతను సంతరించుకొని " పుష్కర్ కేమల్ ఫెయిర్ " గా పిలువ బడుతోంది . ఒకే చోట అన్నివేల ఒంటెలను చూడ్డానికే విదేశీ పర్యాటకులు వస్తారని చెప్పడంలో అతిశయోక్తి లేదు . ఈ పశువుల సంతలో వుండే మరో ఆకర్షణ యేమిటంటే పశువుల అలంకరణకు కావలసినవి పూసలు , గవ్వలు , అద్దాలు మొదలయినవి వుపయోగించి చేతితో చేసిన యెన్నో వస్తువలు విక్రయానికి వస్తాయి . వాటి పనితనం దేశ విదేశ పర్యాటకులను ఈ పశువుల సంతకు వచ్చేటట్టు చేస్తోంది అనడం లో యే మాత్రం అతిశయోక్తి లేదు .
శ్రీ రుద్రం నుండీ ఐదు శక్తివంతమైన శివ ధ్యాన మంత్రాలు ఫలితాలు.
1.ఓం నమః శివాయ - మనః శాంతి కి, అన్ని విధాలా సంరక్షణకి
2.ఓం నమో భగవతే రుద్రాయ - బలం కోసం , ఏపనైనా పరిపూర్ణంగా చెయ్యడానికి
3.ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహా దేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః - శరణాగతి కీ , సర్వ శుభాలకీ
4.త్రయంబకం యజామహే సుగంధిమ్ పుష్టివర్ధనం ఉర్వారుక మివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్ - ఆయుర్దాయం కోసం
5.ఓం నమో భగవతే రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి - మృత్యు భయాన్ని పోగొట్టుకోవడానికి
కంచి కామక్షి తల్లి
కంచి కామక్షి తల్లిని దర్శించుకోవడానికి కేవలం మానవ సంకల్పం సరిపోదు తల్లి సంకల్పమే ప్రధానం. ఇది గొప్ప విశేషం
సమస్త భూమండలానికి నాభి స్థానమే కాంచీపురం. మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు మన నాభినుండే తల్లి పోషిస్తుంది. అందుకే కామక్షి తల్లిని దర్శించుకున్న వారిని కష్టం లేకుండా పోషిస్తుంది.
ప్రపంచంలో ఎక్కడా దర్శించలేని విధంగా అమ్మను ఇక్కడ "సుగంధ కుంతలాంబ" అవతారంలో దర్శించవచ్చు.
(ముత్తైదువులకు అఖండ సౌభాగ్యం లభిస్తుంది. )
ప్రపంచంలో ఎక్కడా దర్శించలేని విధంగా ఇక్కడ "ఢంకా
వినాయకుడు" దర్శనమిస్తాడు.
(ఏకాంబరేశ్వర,సుగంధ కుంతలాంబ కళ్యాణ మహోత్సవాన్ని ఢంకా భజాయింపుతో అందరికీ తెలియజేస్తాడు)
కామాక్షి తల్లి ఆలయంలో "అరూప లక్ష్మి" దేవి దర్శనమిస్తుంది. కామాక్షితల్లిని అర్చించిన తరువాత పూజారి మనకిచ్చిన కుంకుమ ప్రసాదాన్ని అరూప లక్ష్మి తల్లికి ఇచ్చి దాన్నే ప్రసాదంగా తీసుకుంటే భర్తను నిందించిన దోషం పొతుంది , మరియు స్త్రీపురుషులు ఎవరైనా సరే ఇక్కడ అరూప లక్ష్మి తల్లిని దర్శించుకుంటే తప్పకుండా శాపవిమోచనం అవుతుంది.
కాత్యాయనీ దేవి పరమేశ్వరుణ్ణి భర్తగా పొందడానికి తపస్సు చేసిన క్షేత్రం కాంచిపురం. తపస్సులో భాగంగా శివకల్పితమైన గంగా ప్రవాహాన్ని తట్టుకొని సైకతలింగాన్ని రక్షించుకునే ప్రయత్నంలో లింగాన్ని తన ఆలింగనంతో(కౌగిలితో) కాపాడుకుంటుంది . అలా ఆలింగనం చేసుకున్నప్పుడు అమ్మ గాజుల మరియు కుచముల ముద్రలు ఇప్పటికీ అక్కడ శివలింగం పై అగుపిస్తాయి.
కామాక్షిదేవి ప్రధాన ఆలయానికి ప్రక్కనే ఉన్న ఉత్సవ కామక్షి తల్లికి ఎదురుగా ఉన్న గోడలో తుండిర మహారాజు, శివుడి నంది ఎలాగో అమ్మకు అలా ఎదురుగా ఉంటాడు. (తనను నమ్మినవారికి ఎంతటి మహోన్నత స్థానాన్నైనా అనుగ్రహించగలదు కామక్షి)
అమ్మధ్యానంలో, "శోకాపహంత్రీ సతాం" అనే దివ్య వాక్కు గురించి వర్ణణ ఉంది. ఎవరైతే సతతం మనః శుద్ధితో అమ్మను ధ్యానించే సత్పురుషులు ఉంటారో, అలాంటి వారి దుఃఖాన్ని పోగొట్టడానికి తల్లి ఎల్లపుడు సిద్ధంగా ఉంటుంది . తనయొక్క కరుణను కురిపించి ఆదుకుంటుంది , భుజం తట్టి నేనున్నాని ధైర్యం చెబుతుంది.
ఓం శ్రీ మాత్రేనమః
శివలింగం యొక్క ఆథ్యాత్మిక రహస్యము!
శివుని లింగాకారం పైన మూడు విభూతిరేఖలను దిద్దుతారు వాటి యొక్క రహస్యము.
1. మొదటిది బ్రహ్మ కి గుర్తు2. రెండవది విష్ణువు కి గుర్తు3. మూడవది శంకరుడు కి గుర్తు
మద్యలో గంధాన్ని బిందువుగా పెడతారు, అది పరమాత్మని యొక్క స్మృతి చిహ్నమునకు గుర్తు అదే పరమాత్మని యొక్క యథార్థ స్వరూపం.
1. పరమాత్ముని నామం సదా శివ,
2. సదా శివ అంటే;;సదా - ఎల్లప్పుడూ , శివ అనగా కళ్యాణకారి " మంగళకారి " మరియు "శుభకారి"
3. పరమాత్మ జ్యోతిర్బిందు స్వరూపుడైన చైతన్య మూర్తి ఇతనికి స్థూల సూక్ష్మ స్వరూపములు రెండూ లేవు.
4. పరమాత్మ బ్రహ్మా-విష్ణు-శంకరుల సూక్ష్మలోకాలకు పైన బ్రహ్మలోకంలో (ముక్తిధామంలో) ఉంటారు.
5. పరమాత్మ త్రిమూర్తి, అనగా బ్రహ్మా, విష్ణు, శంకరులను కూడ సృష్టించినవాడు.
6. పరమపిత పరమాత్మ బ్రహ్మా ద్వారా సృష్టి స్థాపన, విష్ణువు ద్వారా పాలన, శంకరుని ద్వారా మహావినాశనము,
ఈ ముగ్గురు చేత మూడు కర్తవ్యాలను చేయించువాడు "పరమాత్మడు" అంటారు.
7. లింగం శబ్ధము లీనము అనగా వస్తువును తెలియపరచు చిహ్నమని మరియు లక్షణములు' చూపించేది అని
అర్థము. పరమాత్మ లక్షణములు చూపించేది కావున శివలింగం అని అంటారు .
8. ఓం నమః శివాయ అంటే
ఓం - నేను ఆత్మను... నమః - నమస్కారం... శివాయ -పరమాత్మడు
ఆత్మనైనా నేను పరమాత్మకి నమస్కారం చేస్తున్నాను అని అర్ధం.
_ఏ పురాణంలో ఏముందో తెలుసుకుందాము:*_
1. మత్స్యపురాణం 2. కూర్మపురాణం 3. వామన పురాణం 4. వరాహ పురాణం 5. గరుడ పురాణం 6.వాయు పురాణం7. నారద పురాణం 8. స్కాంద పురాణం 9. విష్ణుపురాణం 10. భాగవత పురాణం 11.అగ్నిపురాణం 12. బ్రహ్మపురాణం 13. పద్మపురాణం 14. మార్కండేయ పురాణం 15.బ్రహ్మవైవర్త పురాణం 16.లింగపురాణం 17.బ్రహ్మాండ పురాణం 18. భవిష్యపురాణం
ఈ పురాణాలు అన్నింటిలోకీ మార్కండేయ పురాణం చిన్నది కాగా, పద్మపురాణం పెద్దది.
*మత్స్యపురాణం:*...మత్స్యరూపంలో ఉన్న మహావిష్ణువు మనువనే రాజుకు చెప్పిన ఈ పురాణంలో కాశీక్షేత్ర ప్రాశస్త్యం, యయాతి, కార్తికేయుడు వంటి రాజుల గొప్పదనాన్ని, ధర్మమంటే ఏమిటో, ఆ ధర్మాన్ని ఆచరించే విధానాలేమిటో విష్ణుమూర్తి వివరిస్తాడు.
*కూర్మపురాణం:*...కూర్మావతారం దాల్చిన విష్ణుమూర్తి చెప్పిన ఈ పురాణంలో ఖగోళ శాస్త్రం గురించి, వారణాసి, ప్రయాగ వంటి పుణ్యక్షేత్రాల గురించి వర్ణన కనిపిస్తుంది.
*వామన పురాణం:*...పులస్త్య మహర్షి నారద మహామునికి చెప్పిన ఈ పురాణంలో శివపార్వతుల కల్యాణం, గణేశ, కార్తికేయుల జన్మవృత్తాంతాలు, రుతువుల గురించిన వర్ణనలు కనిపిస్తాయి.
*వరాహపురాణం:*...వరాహావతారం దాల్చిన విష్ణువు భూదేవికి తన జన్మవృత్తాంతం, ఉపాసనా విధానం, ధర్మశాస్త్రాలు, వ్రతకల్పాలు, భూమిపై ఉన్న వివిధ రకాల పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలు ఈ పురాణంలో కనిపిస్తాయి.
*గరుడ పురాణం:*..గరుడుని వివిధ సందేహాలపై విష్ణువు చెప్పిన వివరణ ఇది. ఇందులో గరుడుని జన్మ వృత్తాంతంతోబాటు జనన మరణాలంటే ఏమిటీ, మరణానంతరం జీవుడు ఎక్కడికి వెళతాడు; ఏ పాపానికి ఏ శిక్షపడుతుంది... వంటి విషయాలు తెలుపడం జరిగింది.
*వాయుపురాణం:*...వాయుదేవుడు చెప్పిన ఈ పురాణంలో ఈశ్వరుని మాహాత్మ్యం, భూగోళం, సౌరమండల వర్ణనలు కన్పిస్తాయి.
*అగ్నిపురాణం:*...అగ్నిదేవుడు వశిష్టునికి చెప్పిన ఈ పురాణంలో వ్యాకరణం, ఛందస్సు, వైద్యశాస్త్ర రహస్యాలు, జ్యోతిశ్శాస్త్రం, భూగోళ, ఖగోళ రహస్యాలను ఈ పురాణంలో తెలుసుకోవచ్చు.
*స్కందపురాణం:*.. కాశీఖండం, కేదారఖండం, కుమారిల ఖండం, రేవాఖండం... తదితర ఖండాలుగా ఉండే ఈ పురాణాన్ని స్కందుడే చెప్పాడట. ఇంకా రామేశ్వర క్షేత్ర మహిమ, పూరీ జగన్నాథ ఆలయంతో సహా అనేక పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలుంటాయి. ఇంకా కుమారస్వామి జననం, మహిమలు, శివలీలల ఉంటాయి.
*లింగపురాణం:*..లింగరూప శివ మహిమలతోబాటు, వివిధ వ్రతాలు, ఖగోళ, జ్యోతిష, భూగోళాల గురించిన సమాచారం ఉంటుంది.
*నారద పురాణం:*..బహ్మమానసపుత్రులైన సనక సనంద సనాతన సంపత్కుమారులకు నారదుడు చెప్పిన ఈ పురాణంలో వేదాంగాల గురించి, పలు పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలుంటాయి.
*పద్మపురాణం:*..ఈ పురాణంలో మధుకైటభులనే రాక్షస వధ, రావిచెట్టు మహిమ, పద్మగంధి దివ్యగాథ, గంగా మహాత్మ్యం, గీతాసారం, నిత్యపూజావిధానాల గురించి ఉంటుంది.
*విష్ణుపురాణం:*.. పరాశరుడు తన శిష్యుడైన మైత్రేయునికి బోధించిన ఈ పురాణంలో విష్ణుమూర్తి అవతార వర్ణన, ధ్రువ, ప్రహ్లాద, భరతుల చరితామృతం ఉంటుంది.
*మార్కండేయ పురాణం:* ..శివకేశవుల మాహాత్మ్యం, ఇంద్ర, అగ్ని, సూర్యుల మాహాత్మ్యం, దేవీ మాహాత్మ్యం ఉంటాయి.
*బ్రహ్మపురాణం:*..బ్రహ్మదేవుడు దక్షునికి బోధించిన ఈ పురాణంలో వర్ణధర్మాలు, స్వర్గనరకాల గురించి తెలుసుకోవచ్చు.
*భాగవత పురాణం:*..విష్ణువు అవతారాలు, శ్రీ కృష్ణ జననం, లీలల గురించి మృత్యువుకు చేరువలో ఉన్న పరీక్షిన్మహారాజుకు శుకమహర్షి చెప్పిన పురాణమిది. దీనిని తొలుత వేదవ్యాసుడు శుకునికి బోధించాడు.
*బ్రహ్మాండ పురాణం:*..బ్రహ్మదేవుడు మరీచి మహర్షికి చెప్పిన ఈ పురాణంలో రాధాకృష్ణులు, పరశురామ, శ్రీరామచంద్రుల చరిత్రలు, లలితా మహిమ్నా స్తోత్రం, ఖగోళ విజ్ఞానం గురించిన వివరణ ఉంటుంది.
*భవిష్యపురాణం:*..సూర్యుడు మనువుకు చెప్పిన ఈ పురాణంలో అగ్ని, సూర్యోపాసన విధులతోబాటు, భవిష్యత్తులో జరుగబోయే వివిధ విషయాల గురించిన వివరణ ఉంటుంది.
*బ్రహ్మాపవైపర్తపురాణము:*.. ఇందులో గోలోక ప్రశంస, భోజననియమాలు, రోగనివృత్తి సాధనాలు, తులసీ, సాలగ్రామ మహత్మ్యం ఉంటాయి.
ఏకామ్రేశ్వరుడు-- పృధ్వీలింగం( కాంచీపురo
పంచభూతలింగాలలోని "పృధ్వీలింగం"గా పరమేశ్వరుడు వెలిసిన క్షేత్రం కాంచీపురంలోని "ఏకామ్రేశ్వరుని" దేవాలయం.
దక్షిణభారతదేశంలోని అతి పురాతనమయిన పట్టణాల లో "కంచి" ఒకటి.చెంగల్పట్టు నుండి అరక్కోణంకు ఉన్న రైలుమార్గంమధ్యలో ఈ పట్టణం ఉంది. తిరుపతి నుంచి కంచి 110 కి.మీ దూరంలో ఉంది.
శ్రీ చక్రస్వరూపిణి అయిన దేవిని ఉపాసించేందుకు కంచిలోని "శ్రీకామాక్షిదేవి" ఆలయం చాలా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం.దాదాపు వంద దేవాలయాలతో స్వర్ణనగరంలా విలసిల్లే కాంచీపురం వైష్ణవులకూ,శైవుల కూ ఆరాధ్య మైనది. బ్రహ్మ యజ్ణంచేసి "వరదరాజ" రూపంలో విష్ణువును వెలయింపజేసిన తపోభూమి ఇది.
ఇక్కడనే పార్వతిదేవి తన భర్త అయిన పరమేశ్వరుడు మామిడిచెట్టు రూపంలో వెలిసినట్లు భావించి సేవించిం దని ప్రతీతి. ఆచోటనే "ఏకామ్రేశ్వర దేవాలయం" ఉంది. ఇది కంచిలోని అన్ని ఆలయాలకన్నావిశాలమైనది, ప్రాచీనమైనది.ఇక్కడ గొపురాలు,ప్రాకారాలు స్థంభాలు అన్నీ ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఆలయంలో నాలుగు వైపులా నాలుగు గాలి గోపురాలు ఉన్నాయి. ఒక్కొక్క గాలి గోపురం ఎత్తు 57 మీటర్లు. దేవాలయం లోపలి మండపంలో వెయ్యి స్తంభాలు ఉన్నాయి. ఆలయంలో 1,008 శివలింగాలు ప్రతిష్ఠించబడి ఉన్నాయి.
శివ రూపంలో వెలిసిన ఇక్కడి మామిడిచెట్టు 3500 సంవత్సరాల నాటిదని చెబుతారు. అయితే ఇంతటి ప్రాశస్త్యం కలిగిన ఈ మామిడి వృక్షం యొక్క కాండం మాత్రమే చూడగలం. ప్రస్తుతం ఈ మామిడివృక్షం యొక్క కాండాన్ని అద్దాల పెట్టెలో ఉంచి దేవాలయంలో భద్రపరిచారు. ఇప్పుడు పురాతన మామిడి వృక్షం స్థానంలో, దేవస్థానం వారు కొత్తగా మరో మామిడి వృక్షం నాటారు.
స్థలపురాణం.....
పార్వతిదేవి శివునికన్నులు మూయడం, అందువల్ల జరిగిన పరిణామాలు వలన పార్వతిదేవి తపస్సుకు బయలుదేరడం , ముందుగా కాశిలో తపస్సు చేయడం, అక్కడనుంచి కంచివచ్చి మామిడి చెట్టుక్రింద సైకిత లింగంచేసి పూజలు చేస్తూ ఉండటం, పరమశివుడు అమ్మవార్ని పరిక్షింపదలచడం, తత్ఫలితంగా శివుని జటాఝూటం నుండి గంగానది పోంగడం, పార్వతిదేవి ఇసుకతో చేసిన లింగం కోట్టుకునిపొకుండా ఆలింగనం చేస్కోవడం, శివుడు సంతొషించి అనుగ్రహించడం, అమ్మవారు అక్కడనుంచి అరుణాచలం వెళ్లి అర్దనారీశ్వరులుగా ఏకమవడం అందరికీ తెలిసినదే కదా! అందువలన ప్రస్తావించలేదు.
ఇక్కడి ఏకామ్రేశ్వరలింగం "పృధ్వీలింగం" కనుక ఇక్కడి మట్టికూడా చాలా గొప్పదంటారు. ఈ క్షేత్రంలో చేసిన మంచిపని ఏదయినావెంటనే ఫలిస్తుందనీ,అది నానాటికీ పెరుగుతుందని కూడా అంటారు.!!! సృష్
శివుడే స్వయంగా సృష్టించిన పవిత్రక్షేత్రం..వారణాసి......!!
ఋగ్వేదంలో కాశీ నగరాన్ని జ్యోతి స్థానం అని వర్ణించారు .
స్కంధ పురాణంలోని కాశీఖండంలో అయితే సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడు "ముల్లోకాలూ నాకు నివాసమే... అందులో కాశీ క్షేత్రం నాకు మందిరం. అని చెప్పినట్లుగా వర్ణన ఉంది.
ఈ నగర ప్రాశస్త్యం గురించి వివరించడానికి ఇదొక్కటి చాలు .
గంగా నదితో "వరుణ", "అస్సి" అనే రెండు నదుల సంగమస్థానం మధ్య ఉన్నందున కాశీకి "వారణాసి" అనే మరో పేరు వచ్చింది.వారణాసి నగరానికి ఉత్తరాన వరుణ సంగమ స్థానం, దక్షిణాన అస్సి నది సంగమ స్థానం ఉన్నాయి.
ఇంకో కథ ఏంటంటే "వరుణ" నదికే పూర్వకాలం "వారణాసి అనే పేరు ఉండేది. కనుక నగరానికి కూడా అదే పేరు వచ్చింది. "వారణాసి" అనే పేరును పాళీ భాషలో "బారనాసి" అని రాసేవారు. అది తరువాత ‘బవారస్’గా మారింది.
వారణాసిని ఇతిహాస పురాణాలలో "అవిముక్తక", "ఆనందకానన", "మహాస్మశాన", "సురధాన", "బ్రహ్మవర్ధ", "సుదర్శన", "రమ్య", "కాశి" అనే నామాలతో ప్రస్తావించారు.
సుమారు 5వేల సంవత్సరాల క్రితం శివుడు వారణాసి నగరాన్ని స్థాపించాడని పురాణాలు చెబుతున్నాయి. ఇది హిందువుల ఏడు పవిత్ర నగరాల్లో ఒకటి. ఋగ్వేదం, రామాయణం, మహాభారతం, స్కంద పురాణం వంటి అనేక ఆధ్యాత్మిక గ్రంథాలలో కాశీనగరం ప్రసక్తి ఉంది.
కురుక్షేత్ర యుద్ధం తరువాత పాండవులు భాతృహత్య, బ్రహ్మహత్యా పాతకాల నుండి విముక్తులవడానికి సప్తముక్తిపురాలలో ఒకటైన కాశీకి విచ్చేశారు.
ఆ నగరాలలో అయోధ్య, మథుర, గయ, అవంతిక, కంచి, ద్వారక నగరాలు మిగిలినవి.
ప్రపంచంలో నిరంతరంగా నివాసయోగ్యమైన ప్రదేశాలలో కాశీ ప్రధమ స్థానంలో ఉందని పరిశోధనలు తెలియ జేస్తున్నాయి .
పురాతత్వ అవశేషాలు వారణాశి వేదకాల ప్రజల ఆవాసమని వివరిస్తున్నాయి.
కాశీ పట్టణం గురించి ప్రధమంగా అధర్వణ వేదంలో వర్ణించబడింది. ఇవన్నీ ఎలా ఉన్నా ఆ విశ్వనాథుడు శరీరం అయితే.. కాశీ ఆయన ఆత్మ అని తరతరాలుగా భారతీయ ఆధ్యాత్మిక జగత్తు ఎలుగెత్తి చాటుతోంది.
ప్రపంచం మొత్తం ప్రళయంలో నాశనమైనా కాశీ మాత్రం చెక్కుచెదరదని మన పురాణాలు చెబుతున్నాయి.
దానికి తగ్గట్టే వేల సంవత్సరాలుగా అనేక ఆటుపోట్లను ఎదుర్కుంటున్నా ఈ క్షేత్రం మాత్రం సజీవంగా తన ఉనికిని చాటుకుంటోంది.
వారణాసి అంటేనే ఆలయాలకు నెలవు.
చరిత్రలో వివిధ కాలాల్లో నిర్మించబడ్డ పెద్ద పెద్ద ఆలయాలు ఇక్కడ ఎన్నో ఉన్నాయి.
ఇంకా వివరంగా చెప్పాలంటే ప్రతీ వీధిలోనూ ఒక ఆలయాన్నిచూడవచ్చు. చిన్న ఆలయాల్లో కూడా దైనందిన ప్రార్థనలు, కార్యక్రమాలు జరుగుతుంటాయి.
ఒక లెక్క ప్రకారం కాశీ లో దాదాపు 23 వేల ఆలయాలు ఉన్నాయి.
అయినప్పటికీ అత్యధికంగా ఆరాధించబడే ఆలయం విశ్వనాధ మందిరం, దీని గోపురంపైన పూసిన బంగారు పూత కారణంగా దీనిని "బంగారు మందిరం" అని కూడా అంటుంటారు.
ప్రస్తుతం ఉన్న మందిరాన్ని 1780లోఇండోర్ రాణి అహల్యాబాయి హోల్కర్ నిర్మించారు.
ఇందులో లింగాకారంగా కొలువై ఉన్న స్వామి ... "విశ్వేశ్వరుడు" , "విశ్వనాథుడు" పేర్లతో పూజలందుకొంటున్నాడు.
ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఈ విశ్వేశ్వర లింగం దర్శనం మిగిలిన లింగాల దర్శనం కంటే అధిక ఫలప్రథమని భక్తుల విశ్వాసం.
ఈ ఆలయం పలుమార్లు విధ్వంశం చేయబడి తిరిగి నిర్మించబడింది. ఆలయ సమీపంలో ఉన్న " గ్యాంవాపీ " మసీదు ప్రాంతమే అసలైన ఆలయం ఉన్న ప్రదేశం.
మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు కాలంలో అప్పటి మందిరం విధ్వంసం చేయబడింది.
1983 జనవరి 28న ఈ మందిరం నిర్వహణా బాధ్యతలను ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం స్వీకరించింది. అప్పటి కాశీ రాజు విభూతి నారాయణ సింగ్ అధ్వర్యంలోని ఒక ట్రస్టుకు అప్పగించింది.
కాశీ విశ్వనాథ ఆలయానికి సమీపంలో విశాలాక్షి అమ్మవారి మందిరం ఉంది.
విశ్వనాథుని దర్శించుకున్న తరువాత భక్తులు విశాలాక్షిదేవిని దర్శించుకోవడం ఆచారం.
అలాగే.. కాశీ విశ్వనాథాలయానికి సమీపంలోనే అన్నపూర్ణాదేవి మందిరం కూడా ఉంది.
ఈ దేవాలయం లోపలనే కాశీ వచ్చే భక్తులకు .. ఉచిత అన్నదానం నిర్వహించబడుతోంది.
కాశీ అనగానే గుర్తువచ్చే మరో ప్రత్యేకత..
గంగా తీరం అంతటా నిర్మించబడ్డ స్నాన ఘట్టాలు. ఇక్కడ స్నానం ఆచరించడానికి దేశం నలుమూలల నుంచీ వేలకొద్దీ ప్రజలు వస్తుంటారు.
కేవలం తమ పాపాలు పోగొట్టుకోవడానికే కాకుండా... తమ వారికి పిండ ప్రదానం చెయ్యడానికి వస్తుంటారు.
అందుకే వారి కోసం ఘాట్లను ఏర్పాటు చేశారు. వారాణసిలో మొత్తం 84 ఘాట్లు ఉన్నాయి.
వీటిలో చాలా వరకు ఇక్కడ మరాఠా పరిపాలనా కాలంలో అభివృద్ధి చేయబడ్డాయి.
ఈ స్నానఘట్టాలు మరాఠీలు, సింధియాలు, హోల్కార్లు, భోంస్లేలు, పెషావర్లచే నిర్మించబడ్డాయి. కొన్ని ఘాట్లు ప్రైవేటు ఆస్తులుగా ఉంటున్నాయి. ఎక్కువ ఘాట్లు స్నానానికి, దహనకాండలకు వాడతారు. కొన్ని ఘాట్లు పురాణ గాధలతో ముడిపడి ఉన్నాయి.
ఆధ్యాత్మిక, భౌతిక భావాలతో కూడిన పవిత్రభావాలకు ఈ స్నానఘట్టాలు ప్రతీకలుగా ప్రశంసిచబడుతున్నాయి.
వీటిలో దశాశ్వమేధఘట్టం, పంచ గంగ ఘట్టం, ధహనసంస్కారాలు జరిపించే మణికర్ణికా, హరిశ్చంద్రా ఘాట్లు ప్రత్యేకమైనవి.
ఉదయం బోటులో స్నానఘట్టాలను దర్శించడం యాత్రీకులను ఎక్కువగా ఆకర్షించే విషయాలలో ఒకటి.
కాశీలో ఉన్న పవిత్రాలయాలలో ‘సంకట్ మోచన్ హనుమాన్ మందిరం’ కూడా అతి ముఖ్యమైనది .
ఈ మందిరం " బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం " ఆవరణలో ఉన్న దుర్గా, ఆధునిక విశ్వనాథ్ మందిరాలకు పోయే మార్గంలో అసి నదీతీరంలో ఉంది.
ప్రస్థుత ఆలయం 1900 లో విద్యావేత్త, స్వాతంత్ర సమరవేత్త మదనమోహన్ మాలవ్యా చేత నిర్మించబడింది.
తులసి రామాయణం సృష్టికర్త అయిన తులసీదాసుకు హనుమంతుడు ప్రత్యక్షమైన ప్రదేశంలో నిర్మించబడింది. సీతారాముల ఆలయం కూడా ఉంది.
కేవలం ఇవి మాత్రమే కాదు ..
కాల భైరవ .. కేదార .. తదితర మహిమాన్విత ఆలయాలకు నెలవు వారణాసి నగరం.
ఆధునిక దేవాలయం గా పిలవబడే బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం..
అంతరిక్ష పరిశోధనలకై జైపూర్ రాజా నిర్మించిన జంతర్ మంతర్.. ఇలా ఎటువైపు చూసినా .. ఆధ్యాత్మిక .. చారిత్రిక .. ఆధునిక దృక్పథాల సమాగమంగా విలసిల్లుతుంది కాశీ నగరం .
శివుడే స్వయంగా సృష్టించిన పవిత్ర క్షేత్రం "వారణాసి"
పంచపాత్రలు
పంచపాత్రలు అంటే ఒక పాత్ర కాదు. ఆరాధనకు అయిదు పాత్రల్లో శుద్ధోదకం ఉండాలి. మనం ఒక పాత్రలోనే అన్నీ ఉంచి *మమ* అనేస్తున్నాము.
*మొదటిది అర్ఘ్య పాత్ర:*:: భగవంతుని చేతులు కడిగేందుకు సమర్పించే శుద్ధ జలాలతో కూడిన పాత్ర.
*రెండవది పాద్య పాత్ర:*::::ఇది భగవంతునికి పాదాలను శుభ్రపరిచేందుకు సమర్పించేందుకు శుద్ధ జలాలతో కూడిన పాత్ర.
మూడవది ఆచమనీయ పాత్ర;;;;ఇది భగవంతునికి పుల్లించడానికి సమర్పించే శుద్ధోదకం నింపిన పాత్ర.
*నా;;;లుగవది స్నాన పాత్ర:*::::ఇది భగవంతునికి స్నానము చేయించడానికి కావలసిన శుద్ధోదకం నింపుకున్న పాత
*ఐదవది శుద్ధోదక పాత్ర* ::::ఇందులో భగవంతునికి సమర్పించే జలాలు నింపుకున్న పాత్ర.
*ఇవి పంచ పాత్రలు..*
ఇవి గాక *ప్రతిగ్రాహక పాత్ర* ఉపచారాలు చేశాక తీసిన నిర్మాల్యపు జలాలు నింపుకునే పాత్ర, మరొక శుద్ధ జలం అవసరం అయితే కావాల్సిన జలాన్ని నింపుకున్న పాత్ర, ఇంక ఆచార్య పూజ కూడా ఉండే వాళ్లకు ఆచార్యునికి అర్ఘ్య సమర్పణకు ఒక పాత్ర ఉండాలి
ఇంకా *సర్వార్థ జల పాత్ర* ~ ఇది మన చేతులు మరియు, ప్రతీ ఉపచారానికి మధ్య మధ్యలో ఉద్ధరిణ శుభ్రం చేసి తిరిగి మరొక ఉపచారము చేసేప్పుడు వాడే దానికి శుద్ధ జలము నింపిన పాత్ర.
బయలు వీరభద్రుని చరిత్ర
శ్రీశైలంలో బయలు వీరభద్రునకు ఏ విధమైన రూఫ్ ఉండదు! ఆరాధ్యులకు ఆది దేవుని ఝటా జూటము నుండి ఉద్భవించన వీర భద్రుడు విద్య నిన్ను ఎప్పుడు తల ఎత్తుకునే లా చేస్తుంది సంస్కారం ఎప్పుడు ని తల దించుకోకుండా చేస్తుంది, వీరభద్ర వీధి పళ్లెరము మనసోలోని కోరికను సిద్ధింప చేస్తుంది! హంగు, ఆర్భాటం కావలసిన పెద్ద కార్యం! ప్రధానమైన ఆలయంనకు ఆగ్నేయ దిశలో, ఆంధ్ర ప్రదేశ్ పర్యాటకం వారి హోటల్ హరితకు ఎదురు రోడ్డులో, పోలీస్ స్టేషనుకు ఎడమ భాగంలో ఉంది. ఈ ఆలయమునకు చిన్న ప్రాకారమే తప్ప విమాన గోపురం, గర్భాలయం మరియు శిఖరం ఉండవు. దీనికి కారణమైన కథ ఒకటి ప్రాచుర్యంలో ఉంది. అదమేమిటంటే, శ్రీశైల దేవాలయ నిర్మాణాలు జరుగుతున్న రోజులలో ఈ స్వామి వారికి కూడా ఆలయం నిర్మించారట. కానీ మరుసటి రోజుకు గర్భాలయ గోడలు మరియు పై కప్పు పడిపోయి ఉన్నాయట. దానికి గల కారణం స్వామివారి విగ్రహం యొక్క ఎత్తు పెరగడమే.
మరుసటి రోజు మారిన కొలతలతో మరలా గర్భాలయం మరియు శిఖరం నిర్మింపగా మరలా మరుసటి రోజుకు అవి పడిపోయి ఉన్నాయట. తిరిగి నిర్మించాలని ప్రయత్నిస్తున్న రోజులలో శ్రీ వీరభద్ర స్వామి వారు ఒక భక్తునికి కలలో దర్శనమిచ్చి తనకు గోపుర నిర్మాణం చేయవద్దని ఆదేశించారట.
దానితో గర్భాలయ నిర్మాణం మరియు శిఖర నిర్మాణాలు నిలిచిపోయాయి. శ్రీ వీరభద్ర స్వామివారిని *విగ్రహమును* దర్శించుకున్నప్పుడు స్వామి విగ్రహాపు ఎత్తును గమనిస్తే ఈ విషయం అర్ధం అవుతుంది.ప్రస్తుతం ఈ ఆలయం వద్ద వాహన పూజలు జరుగుతున్నాయి.
కాశీనాధుని సుబ్రహ్మణ్యం
కాల భైరవా నమో స్తుతి
కపాలీ కుండలీ భీమో భైరవో భీమవిక్రమః
వ్యాలోపవీతీ కవచీ శూలీ శూరః శివప్రియాః
ఏతాని దశ నామాని ప్రాతరుత్ధాయ యః పఠేత్
భైరవీ యాతనానస్యాద్ భయం క్యాపి న జాయతే
ప్రతి రోజు ఉదయం నిద్రలేవగానే ఈ మంత్రాన్ని పఠిస్తే ఏది కోరుకుంటే అది మన వశమవుతుందని పురాణాలు చెపుతున్నాయి.
కాలభైరవుని మంత్రాలు జపిస్తే మీ కష్టాలు తొలగిపోతాయి
కాలభైరవుడు అంటే శివుడి యొక్క భయంకరమైన రూపం. కాల అనే పదానికి శివుడు వలసవాది అనే అర్థం ఉంది. అదే విధంగా భైరవ అనే పదానికి అత్యంత భయంకరమైన రూపం అని అర్థం. ఆ రూపం భయంకరమైనది అయినప్పటికీ ఈశ్వరుడు తన భక్తుల పట్ల చాలా దయగలవాడు.
అతడిని కొలిచేవారి కోరికలను తీరుస్తూ వారికి అనేక ప్రయోజనాలు కలిగిస్తాడని చాలా మంది భక్తులు నమ్ముతారు. అలా కాలభైరువుడికి ఎనిమిది రూపాలు ఉన్నాయి. ప్రతి ఒక్క రూపానికి ఒక్కో ప్రత్యేకత ఉంది.
1) అసితాంగ భైరవుడు..
అసితాంగ భైరవ రూపంలో శివుడు బంగారం రంగులో ఉంటాయి. ఆ విగ్రహానికి నాలుగు చేతులు ఉంటారు. ఒక చేతిలో త్రిశూలం, మిగిలిన చేతులలో మూగ, పాషా మరియు కత్తులు ఉంటాయి. ఈ దేవుడి యొక్క మంత్రం ఓం హ్రీ హ్రీం హర్ జమ్ క్లామ్ క్లమ్ బ్రహ్మిదేవి సమేటియా అసితాంగ భైరవయ్య సర్వపాప నిర్వాత్యయం ఓం హ్రీమ్ పాత్ స్వాహా. ఈ మంత్రం తల్లి బ్రహ్మి దేవత అసానగనాసి దేవత రూపంలో కనిపిస్తుంది. ఈ మంత్రాన్ని జపించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమున్నాంటే సృజనాత్మక శక్తిని మెరుగుపరచడం మరియు దాని యొక్క అన్ని విధుల్లో విజయం సాధించడం జరుగుతుందని పురాణాల్లో పేర్కొనబడింది.
2) రురు భైరవుడు..
ఈ రురు భైరవ రూపంలో శివుడు మాణిక్యాలతో అలకరించబడి ఉంటాడు. అంతేకాదు అనేక రకాల ఆభరణాలతో తెలుపు రంగులో కనిపిస్తాడు. అతని వర్ణమాల, గాంట్లెట్, పుస్తకం మరియు సిరను కలిగి ఉంటాడు. అనాయసంగా కనిపిస్తాడు. ఈ రురు భైరవ మంత్రం : ఓం హ్రీం శ్రీ క్లెమ్ శ్రీ శ్రీ శ్రీమ్ సర్వ రాజా వశీకరాయ సర్వ జన మోహనయ సర్వ వాస్య త్వరలో ఇష్రామ్ క్విక్ క్రియమ్ శ్రీ స్వాహా. ఈ మంత్రం జపించడం వల్ల శత్రువులపై విజయం సాధించొచ్చు. కొంతమందిని మీ అధీనంలో ఉంచుకోవచ్చు.
3) చందా భైరవ..
ఈ చందా భైరవ రూపంలో ఉండే శివుడు నీలం రంగులో సుందరంగా కనిపిస్తాడు. ఈ రూపంలో దర్శనమిచ్చే మహాదేవుడు అగ్ని, శక్తి (షులా), కడే మరియు కుండా ధరించిన మయూరవణుడు. చందా భైరవ మంత్రం : ఓం హ్రీమ్ సర్వస్పక్తి రూపా బ్లూ వర్ణ మహా చందా భైరవయ నామ : ఈ మంత్రం అర్థం ఏమిటంటే నీలం రంగులో ఉన్న మరియు అన్ని శక్తులలో గొప్పవాడు అయిన చందా భైరవ్ కు నమస్కరిస్తున్నాను. ఈ మంత్రాన్ని జపించడం వల్ల అత్యున్నత విశ్వాసం కలిగి ఉండటం, పోటీలలో అవలీలలో విజయం సాధించడానికి ఉపయోగపడుతుంది.
4) క్రోథ బైరవుడు..
క్రోథ భైరవుడు బూడి రంగులో కనిపిస్తాడు. పొడవైన కత్తి మరియు కేతఖావా అనే గొడ్డలితో దర్శనమిస్తాడు. ఈ రూపంలో కాలభైరవుడు హాక్ మీద నడుస్తాడు. క్రోథ భైరవుని మంత్రం : ఓం శ్రీ హ్రీమ్ శ్రీ శ్రీమ్ క్లెమెంట్ సర్వ విధాల ఉపశమనం. ఈ మంత్రం జపించడం వల్ల మన జీవితంలో శక్తివంతమైన మరియు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే శక్తిని ఈ శ్లోకం మీకు అందిస్తుంది.
5) ఉన్మత్త భైరవుడు..
ఉన్మత్త భైరవుడు కేత, పరిగన మరియు ఈటె ధరించి ఉంటాడు. నవ్వుతున్న ముఖంతో తెలుపు రంగులో దర్శనమిస్తాడు. ఈ కాల భైరవ రూపం గుర్రపు స్వారీలో ఉంటుంది. ఉన్మత్త భైరవ మంత్రం : ఓం హ్రీమ్ వారహి సమైతయ మహా బోధి భైరవయ బృహవయ హీర్మ్. ఈ మంత్రం జపించడం వల్ల మీ మాటలపై నియంత్రణ సాధించటంలో మీకు సహాయపడుతుంది. అలాగే మీకు అద్భుతమైన వాక్చాతుర్యంతో మిమ్మల్ని వ్యాపిస్తుంది.
6) కపాల భైరవ..
కపాల భైరువుడు పసుపు రంగులో ఉంటాడు. గామ్మవన మాదిరిగానే ఆయుధాలను ధరిస్తాడు. ఈ కపాల భైరువుని మంత్రం : ఓం హ్రీమ్ క్రీమ్ హ్రీ శ్రీ కపాల భైరవయ ఈ మంత్రం అర్థం ఏమిటంటే కపాల భైరవుడికి నమస్కరించి అతని ఆశీర్వాదం కోరుతున్నాను అని అర్థం. ఈ మంత్రం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటంటే అంగారక గ్రహం అన్ని ఉత్పాదకత లేని పనులు మరియు చర్యలను బేర్ చేస్తుంది.
7) భీషణ్ భైరవ..
భీషణ్ భైరవ మాదిరిగానే ఆయుధాలు మరియు శవాన్ని ధరించే ఎర్రరంగులో ఉంటాడు. భీషణ్ భైరవ మంత్రం : ఓం హ్రీమ్ భీషణ్ భైరవయ్య సర్వ నిర్వాణ నాయనా మామా వశం కురు కురు స్వాహా ఈ మంత్రం అర్థం ఏమిటంటే దీని వల్ల అన్ని రకాల శాపాలను, మంత్ర విద్యల ప్రభావాన్ని అధిగమించేందుకు బీషణ భైరవుడికి నమస్కరిస్తున్నాను. దుష్టశక్తులు మరియు ప్రతికూల శక్తులను అధిగమించేందుకు భీషణ భైరవుడు సహాయం చేస్తాడు. ఈ మంత్రం జపించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటంటే అన్ని రకాల దుష్టశక్తులు మరియు ప్రతికూల శక్తులను అధిగమించడానికి సహాయపడుతుంది.
సంహార భైరవ..
సంహార భైరవ రూపంలో ఒక రకమైన మెరుపు, భైరవుడు తన చేతులలో ఆయుధాలు కలిగి ఉంటాడు. సంహార భైరవ మంత్రం : ఓం నామో భగవతయ్ సంహార భైరవ దెయ్యం దెయ్యం బ్రహ్మ రాక్షసాన్ ఉచతాయ ఉచతాయ సుమరాయయ సంహారయ సర్వయ భయం చెదనం కురు కురు స్వాహా:: ఈ మంత్రం అర్థం ఏమిటంటే రాక్షసులు, పిశాచాలు, రుక్కాలు మరియు అన్ని ఇతర దుష్ట శక్తులను నాశనం చేసే సంహార భైరవుడికి నమస్కరిస్తున్నాను. ఈ మంత్రం అన్ని ప్రతికూల శక్తులను అధిగమించడానికి ఈ స్వామి నాకు సహాయం చేస్తాడు. ఈ మంత్రాన్ని జపించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటంటే గత చర్యల యొక్క అన్ని చెడులను తొలగించడానికి సహాయపడుతుంది.
కాలభైరవ అష్టకమ్
దేవ రాజ సేవ్య మాన పావనాంఘ్రి పంకజం,వ్యాళ యజ్ఞ సూత్ర మిందు శేఖరం కృపాకరం |
నారదాది యోగిబృంద వందితం దిగంబరం,కాశికాపురాధి నాథ కాల భైరవం భజే ||1||
భాను కోటి భాస్వరం భవాబ్ది తారకం పరం,నీల కంఠ మీప్సితార్ధ దాయకం త్రిలోచనం |కాల కాల మంబుజాక్ష మక్ష శూల మక్షరం,కాశికాపురాధి నాథ కాల భైరవం భజే ||2||
శూలటంక పాశదండ పాణిమాది కారణం,శ్యామ కాయ మాది దేవ మక్షరం నిరామయమ్|
భిమవిక్రమం ప్రభుం విచిత్ర తాండవప్రియం,కాశికాపురాధి నాథ కాల భైరవం భజే ||3||
భుక్తి ముక్తి దాయకం ప్రశస్త చారు విగ్రహం,భక్తవత్సలం స్థితం సమస్త లోక విగ్రహమ్ |
నిక్వణన్మనోజ్ఞ హేమ కింకిణీలసత్కటిం,కాశికాపురాధి నాథ కాల భైరవం భజే ||4||
ధర్మ సేతు పాలకం త్వధర్మమార్గ నాశకం,కర్మ పాశ మోచకం సుశర్మదాయకం విభుమ్|
స్వర్ణవర్ణ శేశపాశశోభితాంగ మండలం,కాశికాపురాధి నాథ కాల భైరవం భజే ||5||
రత్న పాదుకాప్రభాభిరామ పాద యుగ్మకం,నిత్య మద్వితీయమిష్ట దైవతం నిరంజనం|
మృత్యుదర్ప నాశనం కరాళదంష్ట్రమోక్షణం,కాశికాపురాధి నాథ కాల భైరవం భజే ||6||
అట్టహాసభిన్న పద్మజాండకోశసంతతిం,దృష్టిపాతనష్ట పాపజాలముగ్రశాశనమ్|
అష్టశిద్ధిదాయకం కపాలమాలికంధరం,కాశికాపురాధి నాథ కాల భైరవం భజే ||7||
భూతసంఘనాయకం విశాలకీర్తి దాయకం,కాశివాసిలోకపుణ్య పాపశోధకం విభుమ్|
నీతిమార్గకోవిదం పురాతనం జగత్ప్రభుం,కాశికాపురాధి నాథ కాల భైరవం భజే ||8||
కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం,జ్ఞాన ముక్తి సాధనం విచిత్రపుణ్య వర్ధనమ్|
శోకమోహదైన్యలోభకోపతాపనాశనం,తే ప్రయాంతి కాలభైరవాంఘ్రిసన్నిధం ధ్రువమ్ ||9||
ఇతి శ్రీమచ్ఛంకరాచార్య విరచితం కాలభైరవాష్టకం సంపూర్ణమ్ ||
శ్రీ మల్లినాథ స్థుతి !!
*కైలాసవాస కమలోద్భవనారదాది*!*మౌనీంద్రసంస్తుత మహోత్తమ దివ్యతేజ:!!
*పాపాద్రిభేదనపవే పరమోపకారిన్*!శ్రీ మల్లినాథ పరిపాలయ మామనాథం!!
తాత్పర్యము :.. కైలాసవాసా! బ్రహ్మ,నారదుడు మొదలైన మనీంద్రులచే స్తుతింపబడువాడా! ఉత్కృష్టమును, దివ్యమునైన తేజస్సు కలవాడా! పాపములనెడి పర్వతములను భేదించుట యందు వజ్రాయుధము వంటి వాడా! మిక్కలి ఉపకారము చేయువాడా! శ్రీమల్లికార్జున స్వామీ! అనాధుడనైన నన్ను పాలింపుము.
*భూరిప్రపంచ పరిపాలన చిత్తవృత్తే*!గౌరీ ముఖాంబుజ మనోహర సప్తసప్తే!!
*దారిద్య్రదు:ఖ విపినోత్కట వీతిహోత్రా!శ్రీ మల్లినాథ పరిపాలయ మామనాథం!!
*తాత్పర్యము :*.. విస్తారమైన ప్రపంచమును పరిపాలించు మన:ప్రవృత్తి కలవాడా! పార్వతీ దేవి యొక్క ముఖారవిందమునకు సుందరుడైన సూర్యుడా! దారిద్య్ర, దు:ఖమనెడి అడవికి గొప్ప అగ్నిహోత్రుడా! శ్రీమల్లికార్జున స్వామీ! అనాధుడనైన నన్ను పాలింపుము.
*శ్రుత్వాత్వదీయచరితం భువనప్రసిద్ధం*!వాణీముదంబునిధి మజ్జనమాతనోతి!!
*సృష్ట్యాదిదేవ జగదీశ్వర దీనబంధో*!శ్రీ మల్లినాథ పరిపాలయ మామనాథం!!
*తాత్పర్యము :* ..సృష్టికి ఆదిదేవుడా! జగత్ప్రభూ! దీనబంధూ! జగత్ప్రసిద్ధమైన నీ చరిత్రను విని సరస్వతీదేవి సంతోషమనెడి సముద్రము నందు ఓలలాడు చున్నది. శ్రీమల్లికార్జున స్వామీ! అనాధుడనైన నన్ను పాలింపుము.
*జగతాం జనకం నమతాం సుఖదం*!*గిరి రాజసుతా ధవమీశమహం!!
*నతపాప హరం జితమారశరం*..!ప్రణమామి హరం జగదేకసురం!!
తాత్పర్యము :..సర్వలోకములకు తండ్రియైన వాడును, నమస్కరించు వారికి సుఖము నిచ్చు వాడును, పార్వతీభర్తయు, భక్తుల పాపముల హరించు వాడును, జయింపబడిన మన్మథుని బాణములు కలవాడును, హరుడును, జగత్తునకేకైక దేవుడును అగు నీశ్వరునికి నమస్కారము చేయుచున్నాను.
గురుదేవ గణాధిప సాంబశివం*!*ద్విపదా నవఖండన చండభవం!!
*జనతా మునితా వనబద్ధకరం*!ప్రణమామి హరం జగదేకసురం!!
తాత్పర్యము :* ..గురుదేవుడును, గణాధిపుడును, అంబయైన పార్వతితో కూడిన వాడును, గజాసురుని సంహరించుట యందు భయంకరుడును, జనులను మునులను రక్షించుట యందు బద్ధహస్తుడును, జగత్తునకేకైక దేవుడునైన ఈశ్వరునికి నమస్కారము చేయుచున్నాను.
*అఘనాశకరం గజచర్మధరం*!ఫణిరాజవిరాజిత భవ్యతనుం!!
*మధురాకృతి మందరచాపధరం*!ప్రణమామి హరం జగదేకసురం!!
తాత్పర్యము :* ..పాపములను నాశనము చేయు వాడును, ఏనుగు చర్మమును ధరించిన వాడును, సర్పరాజులచే ప్రకాశించు ఉత్తమమైన శరీరము కలవాడును, మధురమైన ఆకారము కలవాడును, మందర పర్వతమును ధనుస్సుగా ధరించిన వాడును, జగత్తునేకైక దేవుడు నైన ఈశ్వరునికి నమస్కారము చేయుచున్నాను.
శివశంకరకింకర కల్పతరుం*!భవబంధన భంజన మేరుఘనం*!!
*భువనత్రయరక్షణ భారవహం*!ప్రణమామి హరం జగదేకసురం!!
తాత్పర్యము :...సేవకులకు కల్పవృక్షము వంటివాడును, సంసార బంధములను భగ్నము చేయట యందు మేరువు వలె గొప్పవాడును, ముల్లోకములను రక్షించు భారమును వహించినవాడును, జగత్తునేకైక దేవుడునైన ఈశ్వరునికి నమస్కారము చేయుచున్నాను.
*మహేశ్వరం మంజుల వాగ్విలాసం*!గంగాధరం చంద్రకళావతంసం!!
*గౌరీవరం శ్రీనిధిశైలవాసం!శ్రీమల్లినాధం శిరసానమామి!!
తాత్పర్యము :..మహేశ్వరుడును, మృదువైన వాగ్విలాసము కలవాడును, గంగను ధరించు వాడును, చంద్రకళ శిరోభూషణముగ కలవాడును, పార్వతీ భర్తయు, సంపదకు నిధియైన పర్వతము నివాసముగా కలవాడునైన శ్రీమల్లికార్జున స్వామికి శిరస్సుతో నమస్కరించుచున్నాను.
వినామల్లినాథం నదేవో నదేవ:!సదామల్లినాథం భజేహం భజేహం!!
*కదామే పవర్గం ముదాయచ్ఛసిత్వం!నజానే నజానే గురోశ్రీగిరీశ!!
తాత్పర్యము :::మల్లికార్జున స్వామి తప్ప వేరే దేవుడు లేడు. మల్లికార్జున స్వామినే నేను పూజించెదను, భజించెదను. ఓ గురూ! శ్రీశైలాధీశ్వరా! నీవు నాకు సంతోషముతో మోక్షము నెప్పుడు ప్రసాదించెదవో ఎరుగను.
శ్రీ శివ అష్టోత్తర శతనామావళి స్తోత్రం
శివో మహేశ్వర శ్శంభుః పినాకీ శశిశేఖరః:వామదేవో విరూపాక్షః కపర్దీ నీలలోహితః|| 1 ||
శంకర శ్శూలపాణిశ్చ ఖట్వాంగీ విష్ణువల్లభఃశిపి విష్టోంబికా నాథః శ్రీకంఠో భక్తవత్సలః|| 2 ||
భవశ్శర్వస్త్రి లోకేశః శితికంఠః శివప్రియఃఉగ్రః కపాలీ కామారీ అంధకాసుర సూదనః || 3 ||
గంగాధరో లలాటాక్షః కాలకాలః కృపానిధిఃభీమః పరశుహస్తశ్చ మృగపాణిర్జ టాధరః || 4 ||
కైలాసవాసీ కవచీ కఠోరస్త్రి పురాంతకః;;వృషాంకో వృషభారూఢో భస్మోద్ధూళిత విగ్రహః || 5 ||
సామప్రియస్స్వరమయస్త్రయీ మూర్తిరనీశ్వరః; సర్వజ్ఞః పరమాత్మా చ సోమసూర్యాగ్ని లోచనః || 6 ||
హవిర్యజ్ఞ మయస్సోమః పంచవక్త్ర స్సదాశివఃవిశ్వేశ్వరో వీరభద్రో గణనాథః ప్రజాపతిః| 7 ||
హిరణ్యరేతః దుర్ధర్షః గిరీశో గిరిశోనఘఃభుజంగ భూషణో భర్గో గిరిధన్వీ గిరిప్రియః|| 8 ||
కృత్తివాసః పురారాతిర్భగవాన్ ప్రమథాధిపఃమృత్యుంజయస్సూక్ష్మతనుర్జగద్వ్యాపీ జగద్గురుః|| 9 ||
వ్యోమకేశో మహాసేన జనకశ్చారు విక్రమః రుద్రో భూతపతిః స్థాణు రహిర్భుధ్నో దిగంబరః || 10 ||
అష్టమూర్తి రనేకాత్మా సాత్త్విక శ్శుద్ధ విగ్రహఃశాశ్వతః ఖండ పరశు రజః పాశవిమోచకః || 11 ||
మృడః పశుపతిర్దేవో మహాదేవోఽవ్యయో హరిఃపూషదంతభిద వ్యగ్రో దక్షాధ్వరహరో హరః || 12 ||
భగనేత్రభిద వ్యక్తో సహస్రాక్ష స్సహస్రపాత్;.అపవర్గప్రదోఽనంతస్తారకః పరమేశ్వరః || 13 ||
ఏవం శ్రీ శంభుదేవస్య నామ్నామష్టోత్తరంశతమ్...
వివరణ ::
"శివో - మహేశ్వరః - శంభుః - పినాకీ - శశిశేఖరః - వామదేవో - విరూపాక్షః - కపర్దీ - నీలలోహితః"
మహాకవి "ధూర్జటి" ఒక పద్యంలో తెల్పుతూ, ఓ శివా నీ నామము...
వజ్రాయుధాన్ని పూవుగా... నిప్పును మంచుగా... అగాధ జలరాశిని నేలగా... శత్రువును మిత్రునిగా... విషం దివ్యాహారంగా... అమృతంగా మారుననీ... అంటూ చివరలో "శివా.. నీ నామము...
సర్వవశ్యకరవౌ శ్రీకాళహస్తీశ్వరా’ అని వర్ణించి తరించాడు.
ఈశ్వరుడికి ఉన్న నామాల్లో చాలా చిత్రమైనది.. ‘పినాకి’ అనే నామం. మనకు తెలిసి ఉన్నంతలో చేతిలో "కోదండం" పట్టుకున్న శివ మూర్తి... ఎక్కడా కనిపించదు. శివుడు పట్టుకునే ధనుస్సు సామాన్యమైనది కాదు. ఆయన మేరుపర్వతాన్ని ధనుస్సుగా పట్టుకుంటాడు. శ్రీమహావిష్ణువు చేసే రాక్షస సంహారానికి...శంకరుడు చేసే రాక్షస సంహారానికి చిన్న తేడా ఉంటుంది.
విష్ణుమూర్తి రాక్షస సంహారం చేసేటప్పుడు.. ::ఆ రాక్షసుడు ఏ వరాలు కోరుకున్నాడో వాటికి మినహాయింపుగా చంపడానికి వీలైన శరీరాన్ని స్వీకరిస్తాడు.
శంకరుడు తాను ఎలా ఉన్నాడో అలాగే ఉండి రాక్షసులను సంహరిస్తాడు. వేరొక రూపం తీసుకోడు.
అయితే శంకరుడు ధనస్సును పట్టుకున్నట్టు ఎక్కడా చూపించరుగానీ.. వేదం వల్ల శాబ్దికంగా తెలుస్తుంది. ఎక్కడంటే... యజుర్వేదంలోని... ‘శ్రీరుద్రం (రుద్రాద్యాయం)’ లో తెలుస్తుంది.
నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః! నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముత తే నమః!!
యా త ఇషుపశ్శివతమాశివం బభూవ తే ధనుః! శివాశరవ్యాయా తవ త యా నో రుద్ర మృడయ!!
‘ఓ రుద్రా మా మీద ఏమిటా కోపం? స్వామీ మీరు అంత కోపంగా ఉన్నారేమిటి?
మీ కోపానికి ఒక నమస్కారం’ అని చెబుతూ రుద్రాభిషేకం ప్రారంభిస్తాం.
ఇక్కడ మనం ప్రసన్నుడైన మూర్తికి నమస్కారం చెయ్యడం లేదు. కోపంగా ఉన్న స్వామివారి మూర్తికి నమస్కారం చేస్తున్నారు. కోపంతో ఉన్నవారు తన చేతిలో ఉన్న ఆయుధం నుంచి బాణాలను విడిచిపెడతారు. ఇవి మనల్ని రోదింపజేస్తాయి.
మరి ఎందుకు ఆయన అలా ధనుస్సు పట్టుకోవాలి?
రుద్రుడు మనం చేసిన తప్పులకు మనను శిక్షించడానికి... ధనుస్సును పట్టుకుని ఉన్నాడు.
ఆయన తన ధనుస్సును ఎక్కుపెడితే మన కంట అశ్రుధారలు కారుతాయి. ఆయన మనల్ని ఎందుకు బాధపెట్టడం అంటే.. చేసిన పాప ఫలితం బాధపడితేగానీ పోదు కాబట్టి. పాపం పోయేలా ఏడిపించేందుకుగాను ఆయన తన బాణాలను తీస్తున్నాడు.
నేను పాపం చేశాను... కానీ నన్ను అంత ఏడిపించకు... తట్టుకోలేను...నేను ఏడిస్తే నీ పాదాల యందు విస్మృతి కలుగుతుంది. నిష్ఠతో నీ పాదాలను పట్టుకోలేని స్థితి నాకు వచ్చేస్తుంది. కాబట్టి ఈశ్వరా నీ కోపానికి ఒక నమస్కారం.ఈశ్వరా నీ ధనుస్సుకు ఒక నమస్కారం. ఈశ్వరా నీ బాణాలకు ఒక నమస్కారం. మేమేదో కొద్దిగా పుణ్యం చేసుకున్నాం. నీవు తలుచుకుంటే, నన్ను నీ భక్తుడిని చేసుకుంటే ఎవరూ అడ్డు రారు. నా యందు దయ ఉంచి నన్ను నీ త్రోవలో పెట్టుకో’ అని ప్రార్థిస్తే... ఆయన ప్రసన్నుడు అవుతాడు.
అసలు సనాతనధర్మంలో.. మనను భయ పెట్టడానికి మనం చేసే పాపానికి ఫలితం... ఇచ్చే వారొకరు... భయం తీసేవారు ఒకరు వేర్వేరుగా ఉండరు.
‘భయకృత్ భయనాశనః’...
భయాన్ని సృష్టించేవాడు, తీసేసేవాడు పరమాత్మే. ఈశ్వరుని కారుణ్యానికి అంతులేదు.
శాస్త్రప్రకారం ఆయన పట్టుకున్న ధనుస్సు మనకు ఎల్లప్పుడూ రక్షణే కల్పిస్తుంది. ఘోరరూపంతో పాపఫలితాన్నిచ్చినా.. అఘోర రూపంతో సుఖాన్నిచ్చినా... చేస్తున్నది మన రక్షణే. ఆ ధనుస్సు లోకాలను రక్షించగలిగినది
ఓం నమఃశివాయ
మహామృత్యుంజయ మంత్రం యొక్కప్రాముఖ్యత.
మహా మృత్యుంజయ మంత్రంను “మరణం జయించే మంత్రం” లేదా “త్రయంబక మంత్రం” అని అంటారు.
మహా మృత్యుంజయ మంత్రం రోగాలను నయం చేయుటలో అత్యంత శక్తివంతమైన మంత్రాలలో ఒకటిగా భావిస్తారు. మహా మృత్యుంజయ మంత్రం శివునికి అంకితం చేయబడింది. ఋషి మార్కండేయుల వారి ద్వారా సృష్టించబడిందని చెబుతారు.
” ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం
ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్ “
అందరికి శక్తి నొసగే ముక్కంటి దేవుడు, సుగంధ భరితుడు అయిన పరమ శివుని నేను (మేము) పూజించు చున్నాము. ఆయన దోస పండును తొడిమ నుండి వేరు చేసినటుల (అంత సునాయాసముగా లేక తేలికగా) నన్ను (మమ్ము) అమరత్వము కొరకు మృత్యు బంధనము నుండి విడిపించు గాక!
ప్రాశస్త్యము: మనకు ఉన్న, తెలిసిన మంత్రాలలో గాయత్రి మంత్రం వలె ఈ “మహా మృత్యుంజయ మంత్రం” పరమ పవిత్రమైనది, అతి ప్రాచుర్యమైనది. క్షీర సాగర మథనంలో జనించిన హాలాహలాన్ని పరమ శివుడు దిగమింగి మృత్యుంజయుడు అయ్యాడు.
ఈ మంత్రం జపించిన వారు కూడా ఆ రుద్రుని ఆశీస్సులు పొంది మృత్యుంజయులగుదురు అని పలువురి నమ్మకం. ఇది ఒక విధమైన మృత-సంజీవని మంత్రం అని చెప్ప వచ్చు. అంతేకాక ఆపదలు కలిగినపుడు కూడా దీనిని చదువుకో వచ్చును. సాధారణంగా ముమ్మారు గాని, తొమ్మిది మార్లు గాని, లేదా త్రిగుణమైన సంఖ్య లెక్ఖన దీనిని పారాయణం చేస్తారు.
ఈ మహా మృత్యుంజయ మంత్రాన్ని జపించడం వల్ల, దైవ ప్రకంపనలు మొదలై, మనలను ఆవరించి ఉన్న దుష్టశక్తులను తరిమికొడతాయి. తద్వారా మంత్రాన్ని పఠించినవారికి ఓ శక్తివంతమైన రక్షణ కవచం ఏర్పడుతుంది. ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు, దురదృష్టాల నుంచి బయటపడేందుకు, మహా మృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తుంటారు.
ఈ మంత్రానికి సర్వరోగాలను తగ్గించే శక్తి ఉంది.
ఈ మంత్రాన్ని త్ర్యంబక మంత్రమనడంలో కూడా ఎంతో గూఢార్థం ఉంది. శివతత్వంలో “మూడు” కు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఆ స్వామి త్రినేత్రుడు, త్రిగుణాకారుడు, త్రి ఆయుధుడు, త్రిదళాలతో కూడిన బిల్వాలను ఇష్టపడేవాడు, మూడు అడ్డురేఖలను నామంగా కలిగినవాడు, త్రిజన్మ పాప సంహారుడు, త్రిశూలధారుడు, త్రికాలధిపతి, త్రిలోకరక్షకుడు, మరి ఆస్వామి మంత్రాన్ని జపించితే మనకు రక్షణ లభించకుండా ఉంటుందా?
*****************
మహామృత్యుంజయ మంత్రo
అందులో సందేహమేముంది.ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని ప్రాత: కాలన్నే 108 సార్లు, ప్రదోషకాలంలో 108 సార్లు పఠిస్తే ఎటువంటి రోగాలు దరిచేరవు.
ఈ మృత్యుంజయ మంతాన్ని శ్రద్ధతో పఠిస్తే, అకాలమృత్యువులు, ప్రమాదాల నుంచి రక్షణ లభిస్తుంది. ఇంత మహిమాన్వితమైన మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం వల్ల, దైవిక ప్రకంపనలు మన చుట్టూ ఆవరించి, సమస్త దుష్ట శక్తులు మన దరికి చేరకుండా కాపాడబడతాము.
మృత్యుర్యస్వాప సేచనం అని శృతులు చెబుతున్నాయి. అంటే మృత్యువు శివునికి ఊరగాయ వంటిదని అర్థం.
మృత్యువును జయించాలనుకునే వ్యక్తులు పరమశివుని రక్షణకోరితే సరిపోతుందని ఋగ్వేదం అంటున్నది.
తనను ఆశ్రయించేవారి యొక్క మృత్యువును నివారించేవాడు కాబట్టి శివుడు మృత్యుంజయుడు అని కూడ పిలువబడుతున్నాడు.
ఎవరైతే పుణ్యభీతితో శివుని ఉపాసిస్తారో, వారికి ఆ జన్మలోనే కర్మసంచయాన్ని (ఆగామితో సహా) పటాపంచలు చేసే శక్తిని శివుడు ప్రసాదిస్తాడు.
\అందుకు మృత్యుంజయ మంత్రాన్ని శ్రద్ధగా పఠించి ఆయురారోగ్యాలను పొందుదాం. ఓం నమః శివాయ...!!
రుద్రాభిషేకం
రుద్రాభిషేకం చేసినప్పుడు జ్ఞానం రావడం అనేటటువంటిది రక్షణ కలగడం అనేటటు వంటిది రెండు ప్రయోజనాలు వుంటాయి. లౌకికమైన కోరికలు తీర్చుకోవడం అనేది తప్పనిసరి.
ఒక కుటుంబంలో ఒక గృహస్థుగా వున్నప్పుడు కొన్ని లౌకికమైన కోరికలు వుంటాయి. అవి వుండకూడదు అని శాస్త్రమూ చెప్పలేదు.
భగవంతుడు కూడా భగవద్గీతలో యేమన్నాడంటే "ఆర్తో జిజ్ఞాసు రర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ" - కోరికలున్న వాళ్ళు నన్నే పట్టుకుంటారురా అన్నాడు. కొన్ని కోర్కెల రూపంలో వుండి కోర్కెలవుతాయి. కొన్ని కోరిక కానీ కోరిక కాదు. అది ఈశ్వరుడికి ప్రీతిపాత్రమైనది అవుతుంది. నేను ఇంటి యజమానిగా వున్నాను. నా కొడుకు/కూతురు కష్టపడకుండా వుండాలని అపమృత్యువు చేత గ్రసింపబడకుండా దీర్ఘాయువై వుండి నా మూడో తరాన్ని చూడాలని కోరుకోవడం తప్పు కాదు కదా! అది ఇవ్వగలిగిన స్థానం పరమేశ్వరుడిది.ఆయననే కదా ఆశ్రయించాలి. అది ఆశ్రయించడానికి యే అనువాకంతో/యే పదార్థంతో అభిషేకం చేస్తే లౌకికమైన కోర్కెలు తీరుస్తుందో చెప్పారు. ఆ పదార్థం ఒక్కటీ కాదు కోరిక తీర్చేది. ఆ పదార్థం లింగంమీద మంత్రంతో పడాలి. మంత్రం ప్రధానం. అభిషేకం చేయాలంటే మంత్రమూ వుండాలి (మంత్రం లేకుండా తీసుకెళ్ళి పోసేస్తాను అంటే కుదరదు), పదార్థం వుండాలి, లింగం వుండాలి. ఈ మూడూ కలిస్తే విస్ఫోటనం వుంటుంది అందులోనుంచి. లౌకికమైన కోరికలు తీరడానికి ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క దానికి కారణమౌతుంది. దాహం వేసినప్పుడు ద్రవమే కదా అని పాకం/నెయ్యి త్రాగితే దాహం తీరుతుందా? మంచినీళ్ళు త్రాగాలి. ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క కోరికని/ఆర్తిని/తాపాన్ని తీరుస్తుంది. అంతటా నిండివున్న మంగళకరమైన శివలింగంలోనుంచి ఒక్కొక్క మంగళకరమైన అనుగ్రహశక్తి బయటికి రావాలి అంటే ఒక్కొక్క పదార్థంతో, మంత్రంతో అన్వయం చేయాలి.
పాలు - ఆవుపాలతో అభిషేకము సమస్త సౌఖ్యములకూ కారణము. జ్ఞానం నుంచి సర్వసౌఖ్యాలు ఇస్తుంది.
పెరుగు - ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం లోపించి ఆరోగ్యం కావాలి అనుకున్నప్పుడు ఆవుపాలు తోడుపెట్టిన పెరుగుతో అభిషేకం చేసి దానిని ప్రసాదంగా పుచ్చుకుంటే అది అనారోగ్యం కలగడానికి హేతువైన పాపాన్ని తొలగించి ఆరోగ్యమనే మంగళప్రద శక్తినిస్తుంది.
నెయ్యి - ఐశ్వర్యం కావాలంటే, కొడుకికి వుద్యోగం వచ్చి స్థిరపడాలి అన్నా ఆవునేతిని ఉపయోగించి అభిషేకం చేసి ఆ ప్రసాదాన్ని పుచ్చుకుంటే యేది ఐశ్వర్యాన్ని సంపాదించుకోవడానికి అడ్డు వస్తోందో ఆ అడ్డు తొలగిపోతుంది.
తేనె - తేజస్సు పొందాలి అనుకుంటే తేనెతో అభిషేకం చేయాలి. తేనెలో రెండు రకాలు - తేనె పట్టునుండి వచ్చే తేనె; పుట్ట తేనె. తేనెపట్టునుంచి వచ్చిన తేనెతో పరమశివుడికి అభిషేకం చేస్తే వాళ్ళకి తేజస్సు కలుగుతుంది. గోధుమ త్రాచు/నాగుపాము పుట్టలోకి దూరి శరీరాన్ని వేగంగా విదిలిస్తే చీమలు భయపడి బయటికి వెళ్ళిపోతాయి. విషపుగాలి ఊదుతుంది. చీమలన్నీ వెళ్ళిపోతాయి. చాలాకాలం సాధన చేసి శరీరాన్ని తిప్పుతుంది. లోపల మట్టి అంతా ఊడి మెత్తగా తయారవుతుంది. అక్కడ ఒకరకమైన జాతి తేనెటీగలు లోపల ఒక పట్టు పెడతాయి. పాము లోపలికి వెళ్ళినప్పుడు తేనెటీగలన్నీ బయటికి వెళ్ళేటట్లు కొడుతుంది. చీమలు బయటికి రాకుండా తేనెటీగలు బయటికి వచ్చినా, త్రాచుపాము లోపలికి వెళ్తుంటే తేనెటీగలు బయటికి వచ్చినా, లేదా పాము వెళ్ళిపోయాక తేనెటీగ లోపలికి వెళ్తున్నా అందులో తేనెపట్టు వుందని అర్థం. అప్పుడు కలుగులోకి పొగ వచ్చే పదార్థాన్ని చొప్పించినప్పుడు ప్రక్క కలుగులోంచి పాము వెళ్ళిపోతుంది. తేనెటీగలన్నీ వెళ్ళిపోతాయి. అప్పుడు పుట్ట త్రవ్వి తేనె తీసి తాటాకులో పోసి పిండుతారు. అప్పుడు వచ్చేదానిని పుట్ట తేనె అంటారు. అది నాలుక మీద పడితే అమృతం పడినట్లే వుంటుంది అంటారు. ఆ పుట్ట తేనె తెచ్చి అభిషేకం చేస్తే గంధర్వగానం వస్తుంది ఉత్తరజన్మలో. వాగ్గేయకారుడౌతాడు. అన్నమాచార్యుల వారిలా, ఒక శ్యామాశాస్త్రి గారిలా అవగలిగిన సంగీత విద్య ఎక్కడినుంచీ వస్తుంది అంటే పుట్టతేనెతో అభిషేకం చేస్తే. కానీ అది లభ్యమవుతుందనుకోవడం చాలా కష్టం.
పంచదార - పంచదారతో అభిషేకం చేస్తే దరిద్రం పోతుంది. దరిద్రం పోవడం వేరు, ఐశ్వర్యం కలగడం వేరు. దరిద్రం అంటే అన్నీ వుంటాయి కానీ అనుభవించడానికి వుండదు. ఇదంతా పోగొట్టి మనసులో అనుకున్నట్లు అనుభవించే శక్తిని ఇచ్చేవాడు పరమేశ్వరుడు. దరిద్రనాశనం బాహ్యంలో లేకపోవడం దగ్గరినుంచి ఉన్నది అనుభవించేంతవరకు. ఇది శివానుగ్రహం చేతనే సాధ్యం.
మారేడు దళం - మారేడు దళం యొక్క ఈనె క్రిందకి వెళ్ళేటట్లు పెద్దగా ఉన్న ఆకుని పైకి పెట్టి కొంచెం అంచు అభిషేకం చేసే పాత్రకేసి నొక్కాలి. పాత్రను ఒడుపుగా వంచితా మారేడు దళం చివరినుంచి (శీర్షం నుంచి) ధార పడుతుంది. ఆ ధార శివలింగం మీద పడేటట్లుగా అభిషేకం చేస్తే సర్వసౌఖ్యములకూ కారణమౌతుంది.
పసుపు నీళ్ళల్లో కలిపి అభిషేకం చేస్తే మంగళములకు కారణమౌతుంది.
మామిడిపండు రసంతో అభిషేకం చేస్తే రోగం పోవడానికి కారణమౌతుంది.
నేరేడు పండ్ల రసంతో అభిషేకం చేస్తే వైరాగ్యం కలగడానికి కారణమౌతుంది. ఎంత వయస్సు వచ్చినా ఇంకా అర్థరహితమైన జీవితం. పిచ్చి కోరికలు. బ్రతికున్నంతకాలం కోరికలే? గురువుగారి దగ్గరికి వెళ్ళినా. ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళినా కోరికలే. బ్రతుకంతా కోరికలు వుండడం కాదు. ఏదో ఒకనాడు చెప్పులు విప్పాల్సిందే. వైరాగ్య సుఖాన్ని పొందాలి. ఈశ్వరుడియందు మనస్సు పెట్టాలి. అలా కాకుండా కోరికలతో వెంపర్లాడే స్థితి మనస్సులో వుంటే ఆ పరిస్థితి తొలగించమని నేరేడు పండ్ల రసంతో అభిషేకం చేయాలి.
నవరత్నాలు నీళ్ళల్లో వేసి అభిషేకం చేస్తే ఇల్లు కట్టుకోలేక పోయిన వాడికి ఇల్లు కట్టుకునే అదృష్టం కలుగుతుంది.
బంగారం నీళ్ళల్లో వేసి అభిషేకం చేస్తే భూమి కలిసొస్తుంది.
కస్తూరి నీళ్ళల్లో కలిపి అభిషేకం చేస్తే చక్రవర్తిత్వాన్ని పొందుతాడు. బాహ్యంలో రాజ్యానికి చక్రవర్తి. ఏ కోరికా లేక కస్తూరితో అభిషేకం చేస్తే భక్తి సామ్రాజ్యానికి చక్రవర్తివి అవుతావు.
విభూతిని నీళ్ళల్లో కలిపి అభిషేకం చేస్తే సమస్త పదార్థాలతో అభిషేకం చేసినట్లే అని శాస్త్రంలో మర్యాద చూపించింది. ఈ పదార్థం చేశారు, ఈ పదార్థంతో చేయలేదు అన్న లోటు చెప్పరు. అన్నింటితో చేసేసినట్లే.
ప్రతిరోజూ ఇంట్లో చందనం తీసి దానిని నీళ్ళల్లో కలిపి అభిషేకం చేస్తే సంతానం కలుగుతుంది. చందనంతో రోజూ అభిషేకం చేస్తే కొడుకు వృద్ధిలోకి వస్తాడు.
కాబట్టి ఒక్కొక్క పదార్థంతో అభిషేకం చేస్తే ఒక్కొక్క లౌకికమైన ప్రయోజనాలు కలుగుతాయి. కోరికలు ఒక వయస్సులో అవసరం. ఆ కోరికలు తీర్చుకోవడానికి రుద్రాధ్యాయం ఈ పదార్థాలను చెప్పింది. రుద్రకామ్యార్చన అంటారు. కోరికలనుండి కోరికలు కాని కోరికల వరకు ఇవ్వగలిగిన వాడు ఒక్కడే పరమేశ్వరుడు. అది అభిషేక ప్రక్రియ చేత లభిస్తుంది. అందుకు రుద్రం, రుద్రాధ్యాయం, రుద్రాభిషేకం అంత గొప్పవి. ఇవన్నీ లౌకిక ప్రయోజనములు, ఆంతరమునందు విశేష ప్రయోజనములు.
కన్యాకుమారిలో బాలాంబిక అమ్మ వారిముక్కు పుడక....!!
కొల్లూరు మూకాంబిక, వడకరా లోకాంబిక, పాలక్కాడు హేమాంబిక, కన్యాకుమారి బాలాంబికలు ,
కొడుంగల్లూరు మహా భగవతి,
వెలసి , ముక్తిని ప్రసాదిస్తున్న ఐదు స్ధలాలను పంచ భగవతి స్ధలాలు అంటారు.
ఈ ఆలయాలు పరశురామునిచే ప్రతిష్టింపబడిన అతి మహిమాన్వితమైన స్ధలాలు.
కన్యాకుమారిలో బాలాంబిక అమ్మ వారి ముక్కు పుడక గురించి స్వారస్యమైన గాధలెన్నో ఎన్నో ప్రచారంలో వున్నాయి.
తాటి చెట్లు ఎక్కి కల్లు తీసే వీరమార్తాండునికి..ఒకసారి అపూర్వమైనరత్నం దొరికింది.
ఆ రత్నాన్ని తీసుకుని వెళ్లి..తిరవిదాంగూర్ మహరాజైన మార్తాండ వర్మన్ కి సమర్పించాడు.
మార్తాండ వర్మన్ దానితోఒక విలువైన ముక్కు పుడక తయారు చేయించి, కన్యాకుమారి అమ్మవారికి,
సమర్పిస్తాడు.
ఇదే ముక్కు పుడక గురించి ..మరొక కధ కూడా చెప్తారు.
వీరశూరన్ అనే వ్యక్తి ని నాగ పాము కరవడానికి..వచ్చి, నాగమణి ని కక్కుతుంది.
వీరశూరన్ వెంటనే ఆ మణిని పేడతో..కప్పిపెట్టి తర్వాత ఆ మణిని మార్తాండవర్మకి అప్పగించాడు .
మార్తాండవర్మన్ కణ్ణి భగవతి కి ముక్కు పుడక చేయించి సమర్పించాడు.
ఒకసారి జపాన్ దేశపు ఓడ సముద్రంలో దారి తప్పింది. అయినా కన్యాకుమారి అమ్మవారిముక్కు పుడక కాంతి కి ఆకర్షించబడిన ఆ ఓడని కన్యాకుమారి తీరం వైపు మళ్ళించారు. అయినా ఓడ కట్టు తప్పి, వివేకానందుని ఆలయం..వున్న బండకి తగిలి బద్దలయింది.
మరొకసారి, కొంతమంది సముద్రపు దొంగలు అమ్మవారి ముక్కు పుడక దొంగిలించాలని, పన్నాగం
పన్నారు. .కానీ ,అమ్మవారి దివ్య శక్తి తో..వారి ఓడ అక్కడికక్కడే మునిగిపోయింది. అందులోనుండి తప్పించుకుని..వచ్చిన దొంగలు ఆలయంలో ప్రవేశించి ముక్కు పుడక దొంగిలించాలని ప్రయత్నించినప్పుడు, వారి కంటి చూపు పోయి, దిక్కు తెలియక అక్కడే..పడివుండగా,మరునాడుకాపలా సిబ్బంది వారిని..పట్టి తెచ్చి రాజుగారికి..అప్పగించారు...ఆ రోజు నుండి మహరాజా వారి ఆదేశంతో తూరుపు వైపున వున్న ద్వారం మూసి వేశారు...ఆ పెద్ద ద్వారానికి వున్న మరో ..చిన్న తలుపును యీ నాటికి మనం అక్కడ చూడవచ్చును.
ఆరాట్టు, తిరుకార్తిగై,..విజయదశమి, రెండు..అమావాస్యలు అని కేవలం ఐదురోజులు మాత్రం యీ తలుపు తెరుస్తారు.
కన్యాకుమారి అమ్మ వారి..నాగమణి ముక్కు పుడకని, తూరుపు ద్వారం నుండి వచ్చిన ఒక దొంగ అపహరించుకు పోయాడు. ..ఆ తరువాత తిరువిదాంగూరు మహరాజు ఈ ఆలయానికి..కానుకగా సమర్పించిన..రెండు వజ్రాలు అమ్మవారి..ముక్కు పుడకని అలంకరించినట్లు చెప్తారు..
శివ ద్వాదశ నామాలు
విశ్వేశ్వర విరూపాక్ష విశ్వరూప సదాశివ ౹
శరణం భవ భూతేశ కరుణాకర శంకర ౹౹
హర శంభో మహాదేవ విశ్వేశామరవల్లభ ౹
శివ శంకర సర్వాత్మన్ నీలకంఠాయ నమోస్తుతే ౹౹
మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే ౹
అమృతేశాయ శర్వాయ శ్రీ మహాదేవ తే నమః ౹౹
ఏతాని శివనామాని యః పఠేన్నియతః సకృత్ ౹
నాస్తి మృత్యుభయం తస్య పాపరోగాది కించన ౹౹
సంకట నాశన గణేశ స్తోత్రం!
నారద ఉవాచ ।
ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకమ్ ।
భక్తావాసం స్మరేన్నిత్యమాయుష్కామార్థసిద్ధయే ॥ 1 ॥
ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకమ్ ।
తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకమ్ ॥ 2 ॥
లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవ చ ।
సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తథాష్టమమ్ ॥ 3 ॥
నవమం భాలచంద్రం చ దశమం తు వినాయకమ్ ।
ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననమ్ ॥ 4 ॥
ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః ।
న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం పరమ్ ॥ 5 ॥
విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనమ్ ।
పుత్రార్థీ లభతే పుత్రాన్మోక్షార్థీ లభతే గతిమ్ ॥ 6 ॥
జపేద్గణపతిస్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్ ।
సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయః ॥ 7 ॥
అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వా యః సమర్పయేత్ ।
తస్య విద్యా భవేత్సర్వా గణేశస్య ప్రసాదతః ॥ 8 ॥
ఇతి శ్రీనారదపురాణే సంకష్టనాశనం నామ గణేశ స్తోత్రమ్ ।
కేదార్‌నాథ్ ఆలయం అనేది పరిష్కరించని రహాస్యం
కేదార్‌నాథ్ ఆలయాన్ని ఎవరు నిర్మించారనే దాని గురించి చాలా విషయాలు చెప్పబడ్డాయి. పాండవుల నుండి ఆదిశంకరాచార్యుల వరకు కూడా
కానీ మనము దానిలోకి వెళ్లాలనుకోవడం లేదు.
కేదార్‌నాథ్ ఆలయం బహుశా 8వ శతాబ్దంలో నిర్మించబడిందని నేటి శాస్త్రం సూచిస్తుంది. అంటే ఈ ఆలయం కనీసం 1200 సంవత్సరాల నుండి ఉంది.
కేదార్‌నాథ్ ఉన్న భూమి అప్పుడే కాదు ఇప్పటికీ21వ శతాబ్దంలో కూడా చాలా ప్రతికూలమైనది. ఒకవైపు 22,000 అడుగుల ఎత్తులో కేదార్‌నాథ్ కొండ, మరోవైపు 21,600 అడుగుల ఎత్తులో కరచ్‌కుండ్ మరియు మూడో వైపు 22,700 అడుగుల ఎత్తులో భరత్‌కుండ్ ఉన్నాయి.
ఈ మూడు పర్వతాల గుండా ప్రవహించే ఐదు నదులు మందాకిని, మధుగంగ, చిర్గంగ, సరస్వతి మరియు స్వరందరి. వీటిలో కొన్ని మన పురాణాలలో వ్రాయబడ్డాయి. ఈ ప్రాంతం "మందాకినీ నది" యొక్క ప్రారంభ ప్రాంతం. చలికాలంలో విపరీతమైన మంచు కురిసే చోటు, వర్షాకాలంలో నీరు అతి వేగంతో ప్రవహించే ప్రదేశం, ఇలాంటి ప్రదేశంలో ఇంతటి కళాఖండాన్ని రూపొందించడం ఎంత ప్రయాసతో కూడిన అద్భుతమైన విషయం. నేటికీ, "కేదార్‌నాథ్ ఆలయం" ఉన్న ప్రదేశానికి మీరు వాహనాలతో వెళ్లలేరు.
1000 సంవత్సరాల క్రితం ఇంత ప్రతికూల ప్రాంతంలో, అననుకూల పరిస్థితుల్లో ఆలయాన్ని ఎలా నిర్మించారు. మనమందరం ఒక్కసారైనా ఆలోచించాలి. ఈ ఆలయం 10వ శతాబ్దంలో భూమిపై ఉండి ఉంటే, అది తక్కువ "ఐస్ ఏజ్" కాలంలో ఉండేదని శాస్త్రవేత్తలు ఊహిస్తున్నారు.
డెహ్రాడూన్‌లోని "వాడియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జియాలజీ," కేదార్‌నాథ్ దేవాలయంలోని రాళ్లపై లిగ్నోమాటిక్ డేటింగ్ పరీక్షను నిర్వహించింది. "రాళ్ల జీవితం" గుర్తించడానికి ఇది జరుపుతారు . దానిలో 14వ శతాబ్దం నుంచి 17వ శతాబ్దం మధ్యకాలం వరకు ఆలయం పూర్తిగా మంచుతో కప్పబడి ఉందని పరీక్షలో తేలింది. అయితే ఆలయ నిర్మాణానికి ఎలాంటి నష్టం జరగలేదు. 2013లో కేదార్‌నాథ్‌ను తాకిన విపత్కర వరదను అందరూ తప్పక చూసి ఉంటారు. ఈ కాలంలో సగటు కంటే 375% ఎక్కువ వర్షపాతం నమోదైంది. తదుపరి వరదలు "5748 మంది" (ప్రభుత్వ గణాంకాలు) మరణించారు మరియు 4200 గ్రామాలు దెబ్బతిన్నాయి. భారత వైమానిక దళం ద్వారా 1 లక్షా 10 వేల మందికి పైగా ప్రజలు విమానంలో రక్షించబడ్డారు. అంతా అతలాకుతలం అయింది. కానీ ఇంత విపత్కర వరదలో కూడా కేదార్‌నాథ్ ఆలయ నిర్మాణంపై ఏ మాత్రం ప్రభావం పడలేదు.
"ఆర్కియాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా" ప్రకారం, వరదల తర్వాత కూడా ఆలయం మొత్తం నిర్మాణం యొక్క ఆడిట్‌లో 99 శాతం ఆలయం పూర్తిగా సురక్షితంగా ఉందని తేలింది.
2013 వరదల సమయంలో నిర్మాణానికి ఎంత నష్టం జరిగిందో మరియు దాని ప్రస్తుత స్థితిని అధ్యయనం చేయడానికి "IIT మద్రాస్" ఆలయంపై "NDT పరీక్ష" నిర్వహించింది. ఆలయం పూర్తిగా సురక్షితంగా, పటిష్టంగా ఉందని కూడా తెలిపింది.
రెండు వేర్వేరు సంస్థలు నిర్వహించే "శాస్త్రీయ పరిశీలన మరియు శాస్త్రీయ పరీక్ష"లో ఆలయం ఉత్తీర్ణత సాధించకపోతే, ఆ ఆలయాన్నీ శిథిలావస్థకు చేరినట్టే, ఆ వరదలు తగ్గిన తరువాత చూస్తే... 1200 సంవత్సరాల తరువాత, ఆ ప్రాంతంలోనికి బయటినుండి తరలించబడిన ప్రతిదీ తుడుచుకుపెట్టుకు పోయింది, ఒక్క నిర్మాణం కూడా నిలబడలేదు. కానీ ఈ ఆలయం మాత్రం అక్కడ నిలబడి ఉంది మరియు ఇది చాలా బలంగా ఉంది.
ఈ ఆలయం ఇలా ఉండటానికి నిర్మించిన విధానమీ దీని పటిష్టత వెనుక ఉందని నమ్ముతారు. ఆలయం కోసం ఎంపిక చేయబడిన స్థలం. ఈ వరదలో ఈ దేవాలయం నిలదొక్కుకో గలిగినందుకు ఆలయ నిర్మాణంలో ఉపయోగించిన రాతి మరియు నిర్మాణ పద్ధతి కారణమనే నేడు శాస్త్రం చెబుతోంది.
కేదార్‌నాథ్ ఆలయాన్ని "ఉత్తర-దక్షిణ"గా నిర్మించారు. భారతదేశంలోని దాదాపు అన్ని దేవాలయాలు "తూర్పు-పశ్చిమ"శలో ఉంటాయి నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆలయం "తూర్పు-పశ్చిమ" గా ఉంటే, అది ఇప్పటికే ధ్వంసమై ఉండేది. లేదంటే కనీసం 2013లో వచ్చిన వరదలోనైనా శిథిలమై ఉండేది.
కానీ ఈ దిశ లో నిర్మించిన కారణంగా కేదార్‌నాథ్ ఆలయం బయటపడింది. ఇంకో విషయం ఏంటంటే ఇందులో వాడే రాయి చాలా గట్టిగా, మన్నికగా ఉంటుంది. విశేషమేమిటంటే, ఈ ఆలయ నిర్మాణానికి ఉపయోగించిన రాయి అక్కడ లభ్యం కాదు, అయితే ఆ రాయిని అక్కడికి ఎలా తీసుకెళ్లి ఉంటారో ఊహించుకోండి. అప్పట్లో ఇంత పెద్ద రాయిని మోసుకువెళ్లేందుకు ఎలాంటి రవాణా సాధనాలు కూడా అందుబాటులో లేవు. ఈ రాయి యొక్క లక్షణం ఏమిటంటే, 400 సంవత్సరాలు మంచు కింద ఉన్నప్పటికీ, దాని "గుణాలలో" ఎటువంటి తేడా లేదు. అందువల్ల, ఆలయం ప్రకృతి విపత్తులలో కూడా తన బలాన్ని నిలుపుకుంది. గుడిలోని ఈ బలమైన రాళ్లను ఎలాంటి సిమెంట్ ఉపయోగించకుండా "ఆష్లర్" పద్ధతిలో అతికించారు. అందువల్ల రాతిపై ఉష్ణోగ్రత మార్పుల ప్రభావం లేకుండా ఆలయ బలం అభేద్యంగా ఉంటుంది.
2013లో వీట ఘలై గుండా గుడి వెనుక భాగంలో ఒక పెద్ద బండ రాయి (భీమా శిల) కూరుకుపోయి నీటి అంచుని విభజించి ఆలయానికి ఇరువైపులా ఉన్న నీరు దానితో పాటు అన్నింటిని మోసుకెళ్లింది కానీ, ఆలయం మరియు ఆలయంలో ఆశ్రయం పొందిన ప్రజలు సురక్షితంగా ఉన్నారు. . మరుసటి రోజు భారత వైమానిక దళం వారిని కాపాడి విమానాల ద్వారా తరలించారు .
విశ్వాసాన్ని నమ్మాలా వద్దా అనేది మీ ఇష్టం కానీ 1200 సంవత్సరాల పాటు దాని సంస్కృతిని మరియు బలాన్ని కాపాడే ఆలయ నిర్మాణానికి స్థలాన్ని ఎంచుకున్న తర్వాత, దాని దిశ, అదే నిర్మాణ సామగ్రి మరియు ప్రకృతిని కూడా మన పెద్దలు ఎంతో జాగ్రత్తగా పరిశీలించారనడంలో సందేహం లేదు.
టైటానిక్ మునిగిపోయిన తర్వాత, పాశ్చాత్యులు "NDT పరీక్ష" మరియు "ఉష్ణోగ్రత" ఆటుపోట్లను ఎలా మార్చగలరో గ్రహించారు. మన ఆలయం విషయానికి వస్తే, కొన్ని నెలలు వర్షంలో, కొన్ని నెలలు మంచులో, మరియు కొన్ని సంవత్సరాలు మంచులో పూర్తిగా కూరుకుపోయి ఉండి కూడా, గాలి మరియు వర్షం ఇప్పటికీ ప్రతికూలంగా, సముద్ర మట్టానికి 12,000 అడుగుల ఎత్తులో ఉన్నాయి. ఇక్కడ 6 అడుగుల ఎత్తైన ప్లాట్‌ఫారమ్‌ను నిర్మించడానికి ఉపయోగించిన అపారమైన సైన్స్ గురించి ఆలోచిస్తే మనం ఆశ్చర్యపోతాము. వరదలన్నింటి తర్వాత నేడు అదే వైభవంతో 12 జ్యోతిర్లింగాలలో అత్యున్నతమైన గౌరవాన్ని పొందతున్న కేదార్‌నాథ్ శాస్త్రవేత్తల నిర్మాణానికి మరోసారి తలవంచుతున్నాం.
వైదిక హిందూ మతం మరియు సంస్కృతి ఎంత అభివృద్ధి చెందిందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ.
శివనామాలు- ఫలితాలు !!
శివ : అంటే సుఖం, శివనామం జపిస్తే జయం లభిస్తుంది! ఆధ్యాత్మికంగా కొంత నిగ్రహ శక్తి, సుఖం సంతోషం శాంతి లభిస్తుంది!
హర : ఈ నామాన్ని జపిస్తే గుండె ధమనులు, శిరలు బాగా స్పందిస్తాయి!హృదయ, ఉదర సంబంధం వ్యాధులు తగ్గు ముఖం పడతాయి!
మృత్యం జయ : అని జపిస్తే..అకాల మృత్యువుని..జయిoచి చిరాయువుని ఇస్తుంది! శరీర భాగాలూ మంచిగ స్పందించి ఆరోగ్యంగా ఉంటాయి!
సదాశివా : అని ధ్యానిస్తే సదా ఎల్లప్పుడు కష్టాల నుండి విముక్తి చేయిస్తుంది!సత్ సంతాన్నం, వరివలన సుఖం, మనోధైర్యం వర్తిస్తుంది!
మహాదేవ : అని ధ్యానిస్తే మనసులోని మలినాలను పారద్రోలి మనసును ఏకాగ్రతతో ఉంటుంది!
సర్వేశ్వరాయ : అని జపిస్తే సర్వ కార్యాలు తనవే అనుకొని రక్షిస్తాడు! హరుడు సర్వ కాల సర్వావస్థల యందు రక్షించును!
ఆదిదేవుడు : అని జపిస్తే ఆది అంతం వరకు, మన సమస్యలు ఆయనే చూసుకుంటాడు!
త్రయంబకాయ : అని జపిస్తే శత్రువులను జయంచి, ఆకారణ కలహ విముక్తి లభిస్తుంది!
త్రిపురాంతకాయ : త్రికాలములలో ఆయన నామం జపిస్తే చేపట్టిన కార్యం సిద్దిస్తుంది!
రుద్రాయ : అని జపిస్తే సర్వకాలలలో విజయం సిద్దిస్తుంది, భయాలు తీరి బాధ్యతలు ఏర్పడతాయి!
నీలఖంటాయ : సర్వం నీ దరి చేరి దారిని ప్రస్పుటం చేసి, గమ్యాన్ని చేరుస్తాయి!
గౌరీ పతి : అని ధ్యానిస్తే భార్యతో సుఖసంతులు కలిగిన జీవితం ఏర్పడి అభివృద్ధి పధంలో వెళ్తారు!
భవాని పతే : అని ధ్యానిస్తే భార్యా అనుకూలవతిఅయ్యి..వివాహానంతరం అభివృద్ధి చెండుతారు!
భూతేశ : అని జపిస్తే నిద్రలో పీడకలలు, నిద్రలో భయపడుట, ఆపమృత్యు భయం, లేక సుఖ నిద్ర పట్టును.
కలాగ్ని రుద్రాయ : అని జపిస్తే కాలం త్వరగా కలిసివచ్చి, ప్రతి నిమిషం మీకు బంగారం కాగలదు!
పైన చెప్పినవాటిలోనిజమెంత అని ఆలోచింపక దానిని వదిలేసి పైన చెప్పిన దైవనామాలు స్మరిస్తే!చిత్తశాంతి, మనశాంతి మానసిక వత్తిడులు, అశాంతి నుండి బైట పడేయగలదని శాస్త్రం గట్టిగ చెపుతుంది! ప్రతి వ్యక్తి ఆచరించ దగ్గ సూక్ష్మములు!..సర్వే జనా సుఖినో భవంత్ !
ఆచమనం
పూజలు, వ్రతాల్లో ''ఆచమనం'' అనే మాట చాలా సార్లు వింటాం.
"ఆచమనం" అనే ఆచారం అపరిమితమైనది.
ఉదయం లేచి స్నానం చేసిన తర్వాత, పూజకు ముందు, సంధ్యావందనం చేసే సమయంలో పలుసార్లు, భోజనానికి ముందు, తర్వాత, బయటకు ఎక్కడికైనా వెళ్ళి వచ్చిన తర్వాత ముఖం, కాళ్ళూ చేతులూ కడుక్కున్న తర్వాత ఆచమనం చేయొచ్చు.
ఆచమనం చేసే వ్యక్తి శుచిగా, శుభ్రంగా ఉండాలి. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఉద్ధరణి చొప్పున మంత్రయుక్తంగా మూడుసార్లు చేతిలో నీరు పోసుకుని తాగాలి.
ఆచమనం గురించి సంస్కృతంలో ''గోకర్ణాకృతి హస్తేన మాషమగ్నజలం పిబేత్'' అని వర్ణించారు. అంటే, కుడి అరచేతిని ఆవు చెవి ఆకారంలో ఉంచి, ఇందులో మూడు ఉద్ధరణిల నీటిని (ఒక మినపగింజ మునిగేంత పరిమాణంలో నీళ్ళు) పోసి, వాటిని తాగాలి. చేతిలో పోసేనీళ్ళు అంతకంటే ఎక్కువ కానీ, తక్కువ కానీ ఉండకూడదు. నీరు కొలత అంతే ఉండాలి.
ఆచమనం ఎన్నిసార్లు అయినా చేయొచ్చు అని చెప్తున్నారు....బాగానే ఉంది.
1.అసలు ఆచమనం ఎందుకు చేయాలి?
2.నీటిని అరచేతిలో పోసుకుని తాగడం వల్ల ప్రయోజనం ఏమిటి?
3.అలా ఎందుకు తాగాలి?
4.ఉద్ధరణితో తిన్నగా నోట్లో పోసుకుని ఎందుకు తాగకూడదు?
5.మూడు ఉద్ధరణిల నీరు మాత్రమే ఎందుకు తీసుకోవాలి?
6. నీరు కొంత ఎక్కువో తక్కువో అయితే ఏమవుతుంది?
7. "స్వాహా" అనిదుకు చెప్పాలి మాత్రమే ఎం?
ఇలాంటి సందేహాలు కలగడం సహజం. అందుకే ఆచమనం చేయడంలో పరమార్థం ఏమిటో విపులంగా తెలుసుకుందాం.
మన గొంతు ముందు భాగం లోంచి శబ్దాలు వస్తాయి. దీన్ని స్వరపేటిక అంటాం. దీని చుట్టూ కార్టిలేజ్ కవచం ఉంటుంది కనుక కొంత వరకూ రక్షణ లభిస్తుంది. అయినప్పటికీ, ఇది ఎంత అద్భుతమైనదో, అంత సున్నితమైనది. ఈ గొంతు స్థానంలో చిన్నదెబ్బ తగిలినా ప్రమాదం. స్వరపేటిక దెబ్బతిని మాట పడిపోవచ్చు, ఒక్కోసారి ప్రాణమే పోవచ్చు. స్వరపేటిక లోపలి భాగంలో ధ్వని ఉత్పాదక పొరలు ఉంటాయి. ఇవి ఇంగ్లీషు అక్షరం 'V' ఆకారంలో పరస్పరం కలిసిపోయి ఉంటాయి. ఈ తంత్రులు సూక్ష్మంగా ఉండి, ఎపెక్స్ ముందుభాగంలో పాతుకుని ఉంటాయి. స్వరపేటిక కవాటాలు పల్చటి మాంసపు పొరతో ముడిపడి ఉంటాయి.
ఈ శరీర నిర్మాణం గురించి చెప్పుకోవడం ఎందుకంటే, మన భావవ్యక్తీకరణకు కారకమైన స్వరపేటిక మహా సున్నితమైనది. ముక్కు,నోరు, నాలుక, పెదవులు, పళ్ళు, గొంతు నాళాలు, అంగిలి, కొండనాలుక,గొంతు లోపలి భాగం, శ్వాస నాళం, అన్ననాళం, స్వర తంత్రులు, వాటిచుట్టూ ఉన్న ప్రదేశం ఇవన్నీ ఎంతో నాజూకైనవి. వీటికి బలం కలిగించడమే ఆచమనం పరమోద్దేశం.
ఆచమనంలో మూడు ఉద్ధరణిల నీరు మాత్రమే తాగాలి అనిచెప్పుకున్నాం కదా! గొంతులోంచి శబ్దం వెలువడేటప్పుడు అక్కడున్న గాలి బయటికొస్తుంది. ఇలా లోపలి నుండి గాలి బయటకు వస్తున్నప్పుడు అందులో వేగం ఉండకూడదు.
శబ్దం సులువుగా, స్పష్టంగా రావాలి. ఇలా కొన్నినీటిని జాగ్రత్తగా చేతిలోకి తీసుకుని, అంతే జాగ్రత్తగా మెల్లగాతాగడం అనే అలవాటు వల్ల మనం చేసే ప్రతి పనిలో శ్రద్ధ,జాగ్రత్త అలవడుతుంది.
రోజులో ఆచమనం పేరుతో అనేకసార్లు మెల్లగా నీరు తాగడంవల్ల గొంతు, ఇతర అవయవాలు వ్యాయామం చేసినట్లు అవుతుంది.
“ స్వాహా" అన్నప్పుడు అది గొంతునుండి వెలువడుతుంది. మంత్రం నాలుక సాయంతో బయటకు వస్తుంది. చివరిగా మంత్రం పెదవుల సాయంతో వెలువడుతుంది.
ఆచమనం అనే ఆచారాన్ని పాటించి ఈమంత్రాలను ఉచ్చరించడం వల్ల గొంతు, నాలుక, పెదాలకు వ్యాయామం లభిస్తుంది. పైగా ఇవి పరమాత్ముని నామాలు కనుక, భక్తిభావంతో ఉచ్చరించడం వల్లమేలు జరుగుతుంది.
ఇక ఉద్ధరణితో తిన్నగా ఎందుకు తాగకూడదు, చేతిలో వేసుకునే ఎందుకు తాగాలి అంటే, మన చేతుల్లో కొంతవిద్యుత్తు ప్రవహిస్తూ ఉంటుంది. చేతిలో నీళ్ళు వేసుకుని తాగడం వల్ల ఆ నీరు విద్యుత్తును పీల్చుకుని నోటి ద్వారా శరీరంలోనికి ప్రవేశిస్తుంది. అక్కడ ఉన్న విద్యుత్తుతో కలిసిశరీరం అంతా సమానత్వం ఉండేలా, సమ ధాతువుగా ఉండేలా చేస్తుంది.
ఒక ఉద్ధరణి చొప్పున కొద్దికొద్దిగా నీరు సేవించడం వల్ల ఆకొద్దిపాటి విద్యుత్తు పెదాలు మొదలు నాలుక, గొంతు, ప్రేగుల వరకూ ఉన్న సున్నితమైన అవయవాలను ఉత్తేజ పరుస్తాయి.
ఈ ప్రయోజనాలే కాకుండా ఒక పవిత్ర ఆచారంగా భావిస్తూ రోజులో అనేకసార్లు పాటించడం వల్ల మనసు దానిమీద కేంద్రీకృతమై,లేనిపోని బాధలు, భయాలు తొలగుతాయి.
ఏదో అలవాటుగా పాటించే ఆచారాల వెనుక ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. శాస్త్రీయత ఉంది.
*శ్రీ పూరి జగన్నాథుని ఆలయం గురించి ఎనిమిది అద్భుత విషయాలు:*
1) ఆలయంపై జెండా ఎప్పుడు గాలికి “Opposite దిరెచ్తిఒన్” లో రెప రెపలాడుతుంటుంది.
2) ఆలయంపై ఉండే సుదర్శన చక్రాన్ని మనం పూరి పట్టణంలో ఎక్కడ నుండి చూసినా మనవైపు చూస్తునట్టే కనిపిస్తుంది.
3) మామూలుగా అయితే సముద్రం నుంచి భూమి మీదకి గాలి వస్తుంది మరియు సంధ్యా వేళలో దానికి వ్యతిరేకంగా ఉంటుంది. కానీ పూరి పట్టణంలో మాత్రం దానికి విరుద్ధంగా ఉంటుంది.
4) పక్షులు గానీ, విమానాలు గానీ ఆలయ గోపురం మీద నుండి వెళ్ళవు.
5) ఆలయ గోపురం నీడ ఏ సమయంలోనూ, ఏ దిశలోనూ కనిపించదు.
6) ఆలయంలో వండిన ప్రసాదం మొత్తం సంవత్సరం అంతా అలానే ఉంటుంది. దానిని దాదాపు 20 లక్షలు మందికి పెట్టవచ్చు. అయినా అది వృధా కాదు, తక్కువ కాదు!
7) జగన్నాథుని ఆలయంలోని వంటశాలలో వంట చెఱకుతో వెలిగే పొయ్యిలపై 7 మట్టి పాత్రలను ఒకదానిపై ఒకటి పెట్టి వండుతారు; అయినా అన్నిటి కంటే పైన ఉండే మట్టిపాత్ర ముందు వేడి అవుతుంది, చివరిగా క్రింద ఉండేది వేడి అవుతుంది.
ఆలయంలోని సింహ ద్వారంలోకి ఒక అడుగు పెట్టగానే సముద్ర శబ్దం వినపడదు; అదే ఒక అడుగు వెనక్కి వేస్తే శబ్దం వినిపిస్తుంది.
జగన్నాథ దివ్య ధామం*
భగవానుడు సృష్టి అనంతరం భూమిపై మొట్టమొదటి సారిగా భోజనం చేసిన భోగ క్షేత్రం పూరీ
పూరీలో జగన్నాథునికి నివేదించే నైవేద్యాలు -:
పూరీ క్షేత్రాన్ని పురుషోత్తమ క్షేత్రమని, శ్రీక్షేత్రమని, శంఖక్షేత్రమని, నీలాచలమని, నీలాద్రి అని, జగన్నాథపురి అని కూడా అంటారు. ఇక్కడ వెలసిన జగన్నాథుడిని నీలమాధవుడి ఆరాధిస్తారు. స్వామి వారికి 56 నుండి 64 రకాల పిండి వంటలను నివేదిస్తారు. ఇక్కడ వంటను సాక్షాత్ మహాలక్ష్మీదేవి అదృశ్య రూపంలో పర్యవేక్షిస్తుంటుందట, అందుకే అన్న ప్రసాదాలు అంత రుచికరంగా ఉంటాయని అక్కడి వారి విశ్వాసం. గంగ, యమున బావుల్లోని నీటిని ప్రసాదాల తయారీకి వాడతారు. జగన్నాథునికి ఛప్పన్న (56) ప్రసాదాలను, రోజుకు ఆరుసార్లు నివేదిస్తారు. పూరీలో జగన్నాథ స్వామికి నివేదించే ఛప్పన్న బోగాలేమిటి వాటి తయారీకి ఉపయోగించే పదార్థాలు.
1. అన్నం..2. కనికా (బియ్యం, నెయ్యి, పంచదారతో తయారు చేస్తారు)..3. దొహి పొఖాళొ (నీట్లో నానిన అన్నానికి పెరుగు కలిపి తయారు చేస్తారు)..4. ఒద్దా పొఖాళొ (నీట్లో నానిన అన్నానికి అల్లం కలుపుతారు)..5. తీపి కిచిడీ (బియ్యం, పెసరపప్పు, నెయ్యి, పంచదారతో చేస్తారు)..6. నేతి అన్నం 7. కిచిడీ..8. మిఠా పొఖాళొ (నీట్లో నానిన అన్నానికి పంచదార కలుపుతారు)..9. ఒరియా పొఖాళొ (బియ్యం, నెయ్యి, నిమ్మరసం, ఉప్పుతో చేస్తారు)..10. కాజా 11. గొజ్జా (గోధుమపిండి, నెయ్యి, పంచదారతో చేసే మిఠాయి)..12. లడ్డు 13. మగజా లడ్డు (గోధుమపిండితో చేసే లడ్డు)..14. జీరాలడ్డు (గోధుమపిండికి జీలకర్ర చేర్చి తయారు చేసే లడ్డు)..15. వల్లభ (గోధుమపిండితో చేసే ఒక ప్రత్యేక మిఠాయి)..16. ఖురుమా (గోధుమపిండి, పంచదార, ఉప్పుతో చేస్తారు)..17. మొథాపులి (మినుములు, నెయ్యి, పంచదారతో చేస్తారు)..18. కకరా (గోధుమపిండి, కొబ్బరికోరు, పంచదారతో చేస్తారు)..19. మరిచి లడ్డు (గోధుమపిండి, నెయ్యితో చేస్తారు)..20. లుణి ఖురుమా (గొధుమపిండి, నెయ్యి, ఉప్పుతో చేస్తారు)..21. సువార్ పిఠా (గోధుమపిండి, నెయ్యితో చేస్తారు)..22. చొడెయి లొడా (గోధుమలు, నెయ్యి, పంచదారతో చేస్తారు)..23. ఝిలి (వరిపిండి, నెయ్యి, పంచదారతో చేస్తారు)..24. కొంటి (వరిపిండి, నెయ్యితో చేస్తారు)..25. మండా (గోధుమపిండి, నెయ్యితో చేస్తారు)..26. ఒమాళు (గోధుమపిండి, నెయ్యి, పంచదారతో చేస్తారు)...27. పూరీ 28. లుచి (వరిపిండి, నెయ్యితో చేస్తారు)..29. బొరా (మినప్పప్పుతో చేసే వడలు)..30. దొహిబొరా (పెరుగు గారెలు)..31. అరిసె 32. త్రిపురి (వరిపిండి, నెయ్యితో చేస్తారు)..33. రొసాపాయిక (గోధుమలతో చేస్తారు) 34. ఖిరి (పాయసం)..35. పాపుడి (పాలమీగడ, పంచదారతో చేస్తారు36. కోవా 37. రొసాబొళి (పాలు, పంచదార, గోధుమలతో చేస్తారు)..38. తడియా (తాజా పనీర్, నెయ్యి, పంచదారతో చేస్తారు)..39. ఛెనాఖాయి (తాజా పనీర్, పంచదార, పాలతో చేస్తారు)..40. బపుడి ఖొజా (పాలమీగడ, నెయ్యి, పంచదారతో చేస్తారు)..41. ఖువా మండా (పాలు, గోధుమపిండి, నెయ్యితో చేస్తారు)..42. సొరాపులి (పాలను గంటల తరబడి మరిగించి చేసే మిఠాయి)..43. డల్లి (కందిపప్పుతో చేసే ముద్దపప్పు) 44. ముగొడల్లి (పెసరపప్పు వంటకం) 45. బిరిడల్లి (మినుములతో చేసే పప్పు) 46. ఉరద్ డల్లి (మినప్పప్పు వంటకం)..47. దాల్మా (కందిపప్పు, కాయగూరలు కలిపి చేసే వంటకం)..48. మవుర్ (పప్పులు, కొర్రలతో చేసే వంటకం)..49. బేసొరొ (కలగూర వంటకం) 50. సగొ (తోటకూర వంటకం)..51. పొటొలొ రొసా (పొటల్స్/పర్వల్ కూర)..52. గొటి బైగొణొ (గుత్తివంకాయ కూర)..53. ఖొటా (చింతపండు గుజ్జు, బెల్లంతో చేసే లేహ్యం)..54. రైతా (పెరుగులో కూరగాయల ముక్కలు వేసి చేస్తారు)..55. పిఠా (గోధుమపిండితో చేసే తీపిరొట్టె) 56. బైగని (వంకాయలతో)
****************************** శుభం ********************************************************************************************************
front page
పినాక
రచన -సేకరణ
ముదిగొండ సేనాపతి















































