శరభసాళ్వుడు
( శరభసాళ్వుని వీధి పళ్ళెరము )
శరభ ,శరభ ,దశ్శరభశరభ
నారసింహ క్రోధ నశిహింపజేయ ;
జగత్సంహారకా !శరభసాళ్శ్వరా !
రూపమును బొందెను సర్వేశ్వరుండుఁ !
శరభ ,శరభ ,దశ్శరభశరభ !!
శరభమృగావృత ,తేజోమయమైన -దేహమునుబొందె !
ఱెక్కలు, ముక్కులు ప్రకాశింపువాడై
వజ్రాయుధముఁ లాగ -గోళ్ళు కోఱలతోన -
అగ్నికణంబులుఁ రాఁల్చు నేత్రములతోన !
శరభ ,శరభ ,దశ్శరభశరభ !!
ఎనిమిది పాదములు ,వేయి బాహువులు
రొండు శిరస్సులు ,ఐదు నేత్రములు
రొండు సర్పతోకలతోన సాక్షాత్కరించే
శరభ ,శరభ ,దశ్శరభశరభ !!
సగభాగమందునఁ పక్షి స్వరూపముఁ
రెక్కలతోనే
నరసింహావతారము -బరిమర్పజేసె !
శరభ ,శరభ ,దశ్శరభశరభ !!